...
...
Next Story

OTT Release: ఓటీటీలోకి ఈవారం తెలుగు, తమిళం, మలయాళంలలో వస్తున్న టాప్ మూవీస్, షోలు ఇవే.. థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు..

OTT Release: ఓటీటీలోకి ఈవారం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో రాబోతున్న సినిమాలు, రియాలిటీ షోల వివరాలు ఇక్కడ చూడండి. వీటిలో తెలుగు నుంచి మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ కూడా ఉంది. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అగ్నిపరీక్ష కూడా ఈ వీకెండ్ లోనే ప్రారంభం కానుంది.

Published on: Aug 12, 2026, 17:15:52 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Release: ఓటీటీలోకి ఈ వారం వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ నెక్స్ట్ లెవెల్‌కి చేరబోతోంది. ఆగస్టు 12 నుంచి ప్రముఖ డిజిటల్ వేదికలైన జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, మనోరమా మ్యాక్స్, ఆహా, సన్ నెక్ట్స్ ప్లాట్‌ఫామ్స్‌లో తెలుగు, మలయాళం, తమిళ భాషలకు చెందిన క్రేజీ సినిమాలు, వినోదాత్మక రియాలిటీ షోలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.

కాట్టాలన్ (Kattalan) - మనోరమ మ్యాక్స్

OTT Release: ఓటీటీలోకి ఈవారం తెలుగు, తమిళం, మలయాళంలలో వస్తున్న టాప్ మూవీస్, షోలు ఇవే.. థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు..
OTT Release: ఓటీటీలోకి ఈవారం తెలుగు, తమిళం, మలయాళంలలో వస్తున్న టాప్ మూవీస్, షోలు ఇవే.. థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు..

మలయాళం రస్టిక్ యాక్షన్ స్టార్ ఆంటోనీ వర్గీస్ (పేపే) ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ 'కాట్టాలన్'. పాల్ జార్జ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1995 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది.

కేరళ-తమిళనాడు సరిహద్దుల్లోని ఆనకుల్లీ అడవుల్లో ఏనుగుల వేట, దంతాల అక్రమ రవాణా నేపథ్యంతో ఈ కథ రూపుదిద్దుకుంది. నేర సామ్రాజ్యాన్ని శాసించే మారి, ఎడ్డీ అనే ఇద్దరు బాస్‌ల మధ్య సాగే భయానక గ్యాంగ్ వార్ ఇంటెన్స్ యాక్షన్ లవర్స్‌ను ఆకట్టుకోనుంది. సునీల్, కబీర్ దుహాన్ సింగ్, జగదీష్, దుషార విజయన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆగస్టు 13 నుంచి మనోరమా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

అరూపి (Aroopi) - ప్రైమ్ వీడియో

హారర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కోసం ప్రైమ్ వీడియో తీసుకొస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'అరూపి'. ఆర్యనట్టు ఎస్టేట్‌లో ఒక పాత బొమ్మలో బంధించిన పగతో రగిలే యక్షిణి ఆత్మ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

దొంగలు అనుకోకుండా ఆ ఆత్మను రిలీజ్ చేయడంతో ఎస్టేట్‌లో భయంకరమైన పరిణామాలు ఎదురవుతాయి. ఎస్టేట్ చివరి వారసుడు తన కుటుంబ రహస్యాలను ఛేదించి, ఆ శాపం నుంచి ఎలా బయటపడ్డాడో తెలుసుకోవాలంటే ఆగస్టు 14 నుంచి ప్రైమ్ వీడియోలో చూడాల్సిందే. ఈ చిత్రంలో జాయ్ మాథ్యూ, వైశాఖ్ రవి, నేహా చావ్లా, సాక్షి బడాలా ముఖ్య పాత్రలు పోషించారు.

మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ -సన్ నెక్ట్స్ ఓటీటీ

వైవా హర్ష, అనీష్ కురువిల్లా, సత్య కృష్ణన్, హర్షవర్ధన్, శివాజీరాజా, వేణు యల్దండి, సప్తగిరి వంటి భారీ కామెడీ తారాగణం ఈ సినిమాలో ఉంది. ఈ క్యూట్ అండ్ ఎంటర్‌టైనింగ్ మూవీ ఆగస్టు 14 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది.

బిగ్ బాస్ తెలుగు 10: అగ్నిపరీక్ష - జియోహాట్‌స్టార్

బుల్లితెర హిస్టరీలో మైలురాయిగా నిలవనున్న బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్ భారీ సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది. సామాన్య ప్రజలకు బిగ్ బాస్ హౌస్‌లోకి నేరుగా ఎంట్రీ ఇచ్చేందుకు 'అగ్నిపరీక్ష' పేరుతో ప్రత్యేక ప్రీ-షోను డిజైన్ చేశారు.

స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ షోలో కంటెస్టెంట్లు కఠినమైన ఆడిషన్లు, ఫిజికల్ టాస్కులు ఎదుర్కొని మెయిన్ హౌస్ కన్ఫర్మ్ స్పాట్ కోసం పోటీపడతారు. ఈ ఇంటెన్స్ రియాలిటీ హంగామా ఆగస్టు 15 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

బిగ్ బాస్ తమిళం: ది కామన్ మ్యాన్ - జియోహాట్‌స్టార్

తమిళ బిగ్ బాస్ 10వ సీజన్ ప్రారంభానికి ముందు హాట్‌స్టార్ తీసుకొస్తున్న ప్రత్యేక స్పిన్ ఆఫ్ షో 'ది కామన్ మ్యాన్'. నటి మాయా ఎస్. కృష్ణన్ హోస్ట్‌గా వ్యవహిస్తున్న ఈ ప్రీ-షోలో సాధారణ పోటీదారులు నేరుగా మెయిన్ సీజన్‌లోకి అడుగుపెట్టడానికి హోరాహోరీగా పోటీపడతారు. ఈ షో ఆగస్టు 16 నుంచి జియోహాట్‌స్టార్ లో అలరించనుంది.

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ యుఎస్‌ఎ - ఆహా వీడియో ఓటీటీ

స్టార్ యాంకర్ సుమ కనకాల, నటుడు జీవన్ కుమార్ కలిసి సందడి చేస్తున్న పాపులర్ కుకింగ్ కామెడీ షో 'చెఫ్ మంత్ర'. ఈసారి అమెరికాలోని ఎన్ఆర్ఐ సెలబ్రిటీలు, కంటెస్టెంట్లతో 'ప్రాజెక్ట్ USA' పేరుతో సరికొత్త సీజన్ డిజైన్ చేశారు. కిచెన్ కన్ఫ్యూజన్, నవ్వుల హంగామాతో సాగే ఈ షో ఆగస్టు 13 నుంచి ఆహా (Aha Video)లో స్ట్రీమింగ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe