...
...
Next Story

ఓటీటీలోకి తమిళ కామెడీ మూవీ.. ఐఎండీబీలో 9.3 రేటింగ్.. ఓ బట్టతల అబ్బాయి.. ఇద్దరు అమ్మాయిలు

తమిళ కామెడీ మూవీ ఒకటి ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. ఓ బట్టతల అబ్బాయి, ఇద్దరు అమ్మాయిల చుట్టూ తిరిగే స్టోరీ ఇది. రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 9.3 రేటింగ్ ఉండటం విశేషం.

Published on: Oct 28, 2025, 17:54:19 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఓటీటీలోకి ఈవారం రానున్న ఇంట్రెస్టింగ్ సినిమాల్లో ఓ తమిళ కామెడీ మూవీ కూడా ఉంది. ఈ సినిమా పేరు సొట్ట సొట్ట ననైయుతు (Sotta Sotta Nanaiyuthu). బట్ట తలతో బాధపడే ఓ యువకుడు ఎదుర్కొనే కష్టాలు, ఆత్యన్యూనత, బాడీ షేమింగ్ లాంటి అంశాల చుట్టూ తిరిగే మూవీ ఇది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

సొట్ట సొట్ట ననైయుతు ఓటీటీ రిలీజ్ డేట్

ఓటీటీలోకి తమిళ కామెడీ మూవీ.. ఐఎండీబీలో 9.3 రేటింగ్.. ఓ బట్టతల అబ్బాయి.. ఇద్దరు అమ్మాయిలు
ఓటీటీలోకి తమిళ కామెడీ మూవీ.. ఐఎండీబీలో 9.3 రేటింగ్.. ఓ బట్టతల అబ్బాయి.. ఇద్దరు అమ్మాయిలు

తమిళ కామెడీ మూవీ సొట్ట సొట్ట ననైయుతు మూవీ ఆగస్టు 29న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా ఇప్పుడు అక్టోబర్ 31 నుంచి ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. “అందరికీ సంబంధించిన మరో కథ వచ్చేస్తోంది ఫ్రెండ్స్.. సొట్ట సొట్ట ననైయుతు అక్టోబర్ 31న ఆహా తమిళంలో ప్రీమియర్ కానుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సొట్ట సొట్ట ననైయుతు మూవీ గురించి..

సొట్ట సొట్ట ననైయుతు ఓ తమిళ కామెడీ సినిమా. దీనికి నవీద్ ఎస్ ఫరీద్ కథ అందించి, డైరెక్ట్ చేశాడు. ఇందులో నిశాంత్ రుసో, రాజా ఎలంగోవన్, షాలిని, రోబో శంకర్, పుగళ్, వర్షిణి వెంకట్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమా బట్టతలతో బాధపడే ఓ యువకుడి చుట్టూ తిరుగుతుంది. రాజా అనే ఆ ధనవంతుడైన వ్యక్తి.. ఓ మంచి మనసున్న ప్రియ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు.

అయితే అతని కుటుంబం మాత్రం ఈ కాలం మైండ్‌సెట్ ఉన్న శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజా ఎవరి వైపు మొగ్గు చూపుతాడు? ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఈ సినిమాలో చూడొచ్చు. ఈ మూవీకి ఐఎండీబీలో ఏకంగా 9.3 రేటింగ్ ఉండటం విశేషం.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks