OTT Telugu: ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి వస్తున్న తెలుగు కోర్టు రూమ్ థ్రిల్లర్.. చర్చి ఫాదర్ హత్య చుట్టూ తిరిగే స్టోరీ
థియేటర్లలో పెద్దగా సందడి చేయలేకపోయిన సస్పెన్స్ కోర్టు డ్రామా 'వంచన' ఎట్టకేలకు ఓటీటీ బాట పట్టింది. ఉమా మహేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మార్చి 3 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి రానుంది.
టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు థియేటర్లలో కంటే ఓటీటీ వేదికలపైనే ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. కంటెంట్ బాగుంటే చాలు.. స్టార్లు లేకపోయినా ప్రేక్షకులు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా ఇదే కోవలో మరో ఇంట్రెస్టింగ్ కోర్టు రూమ్ డ్రామా 'వంచన' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. మరి ఆ వివరాలేంటో చూడండి.

వంచన ఓటీటీ స్ట్రీమింగ్
తెలుగులో వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ కోర్టు రూమ్ థ్రిల్లర్ వంచన. ఈ సినిమా నవంబర్ 8, 2024న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు సుమారు ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా సరైన ప్రమోషన్లు లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది.
అయితే తాజాగా ఈ మూవీ డిజిటల్ హక్కులను సన్ నెక్స్ట్ (Sun NXT) ప్లాట్‌ఫామ్ దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం, మార్చి 3, 2026 నుంచి 'వంచన' మూవీ సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కానుంది. ఐఎండీబీలో ఈ సినిమాకు 7.5 రేటింగ్ ఉంది.
వంచన మూవీ స్టోరీ ఏంటంటే?
ఒక చర్చి ఫాదర్ దారుణ హత్యకు గురవడంతో ఈ వంచన మూవీ కథ ప్రారంభమవుతుంది. ఆ హత్య కేసులో అనుమానితుడిగా అతని డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే ఆ డ్రైవర్ నిర్దోషి అని నమ్మిన యువ క్రిమినల్ లాయర్ కృష్ణ.. ఈ కేసును వాదించేందుకు సిద్ధమవుతాడు. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో లాయర్ కృష్ణకు ఎదురైన సవాళ్లు ఏంటి? అసలైన హంతకుడు ఎవరు? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా సాగుతుంది.
వంచన సినిమా విశేషాలు
ఈ వంచన సినిమాకు ఉమా మహేష్ దర్శకత్వం వహించడమే కాకుండా, ప్రధాన పాత్రలోనూ నటించాడు. నటుడిగా అక్కడక్కడా తడబడినప్పటికీ, దర్శకుడిగా స్క్రీన్ ప్లే విషయంలో తన ప్రతిభను చాటుకున్నాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే కోర్టు రూమ్ సీన్లు.. లాయర్, జడ్జి మధ్య జరిగే వాదోపవాదాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. తక్కువ బడ్జెట్‌లో నిర్మించినప్పటికీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ సినిమాకు బలాన్నిచ్చాయి.
ఇటీవల కాలంలో థియేటర్లలో పెద్దగా ఆడని 'శ్రీ చిదంబరం గారు', రోషన్ కనకాల 'మౌగ్లీ' వంటి సినిమాలు ఓటీటీలో మంచి వ్యూస్ సాధించాయి. అదే బాటలో 'వంచన' కూడా డిజిటల్ ఆడియన్స్‌ను మెప్పిస్తుందో లేదో చూడాలి. కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఓటీటీలో మంచి సక్సెస్ అందుకునే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


