...
...
Next Story

OTT Releases: ఓటీటీలోకి ఈవారం రానున్న టాప్ 5 తెలుగు, తమిళ సినిమాలు, వెబ్ సిరీస్.. హారర్ థ్రిల్లర్ టు కామెడీ

OTT Releases: ఓటీటీలోకి ఈవారం అంటే నవంబర్ 16 నుండి 22 మధ్య ఓటీటీ ప్రేక్షకులకు రొమాన్స్, కామెడీ, సస్పెన్స్, వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్ల విందు సిద్ధమైంది. ఈ వారం వివిధ డిజిటల్ వేదికలపై 5 ఆసక్తికరమైన సౌత్ ఇండియన్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రాబోతున్నాయి.

Published on: Nov 17, 2026, 14:51:14 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Releases: ఓటీటీలోకి ఎప్పటిలాగే ఈవారం ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రానుండగా.. వాటిలో తెలుగు, తమిళం నుంచి 5 క్రేజీ మూవీస్, సిరీస్ వాటిలో ఉన్నాయి. ముఖ్యంగా 'డీజే టిల్లు' దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన ‘అనుమాన పక్షి’, ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న 8.6 ఐఎండీబీ రేటింగ్ సాధించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘418’ ప్రేక్షకుల్లో భారీ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మరి ఈ ఐదు చిత్రాల కథాంశాలు, నటీనటులు, స్ట్రీమింగ్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

1. మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్ (Mr & Mrs Office)

OTT Releases: ఓటీటీలోకి ఈవారం రానున్న టాప్ 5 తెలుగు, తమిళ సినిమాలు, వెబ్ సిరీస్.. హారర్ థ్రిల్లర్ టు కామెడీ
OTT Releases: ఓటీటీలోకి ఈవారం రానున్న టాప్ 5 తెలుగు, తమిళ సినిమాలు, వెబ్ సిరీస్.. హారర్ థ్రిల్లర్ టు కామెడీ

ప్రదీప్ ఆంటోనీ, స్నేహా మణిమేగలై, సనమ్ శెట్టి, మగిళ్ తిరుమేని నటించిన ఈ వెబ్ సిరీస్ కు అబ్దుల్ కబీజ్ దర్శకత్వం వహించాడు. ఆఫీస్ రొమాంటిక్ కామెడీ జానర్ లో ఈ సిరీస్ జియోహాట్‌స్టార్ లోకి నవంబర్ 18న స్ట్రీమింగ్ కానుంది.

ఈ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే.. అరివు, ఐశ్వర్య అనే నూతన దంపతుల చుట్టూ తిరిగే సరదా కథ ఇది. ఇంట్లో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట, ఒకే ఆఫీసులో పనిచేస్తుంటారు. అయితే తమకు పెళ్లయిందన్న నిజాన్ని ఆఫీసులో ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచాల్సి వస్తుంది. బాస్ కంటపడకుండా, ప్రతి విషయాన్ని గమనించే సహోద్యోగుల నుంచి తమ బంధాన్ని వీరు ఎలా దాచిపెట్టారనేది కడుపుబ్బా నవ్విస్తుంది.

2. అనుమాన పక్షి (Anumana Pakshi)

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సెసిల్, బ్రహ్మాజీ, రాశి నటించిన ఈ కామెడీ థ్రిల్లర్ ను డీజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ డైరెక్ట్ చేశాడు. సన్ నెక్ట్స్ ఓటీటీలో నవంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఈ క్రమంలో కన్యాకుమారి అనే అమ్మాయి పరిచయమై, ఆమె ప్లాన్లలో చిక్కుకుంటాడు. అంతలోనే సన్నీ స్నేహితుడు అనుమానాస్పదంగా మరణించడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది.

3. 418 (హారర్ థ్రిల్లర్ మూవీ)

చైత్ర జె. ఆచార్, రమేష్ ఇందిర, సూర్య రాజ్ వీరబత్తిని, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహించారు. నెట్‌ఫ్లిక్స్ లో నవంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భయానక, మిస్టరీ కథలను ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. ఐఎండీబీ ఏకంగా 8.6 రేటింగ్ సాధించిన ఈ చిత్రం.. గత 15 ఏళ్లుగా మూసివేసి ఉన్న ఒక మెడికల్ కాలేజీ భవనం చుట్టూ తిరుగుతుంది. స్థానికుల తీవ్ర వ్యతిరేకతను లెక్కచేయకుండా ఆ భవనాన్ని తిరిగి తెరవడంతో, అక్కడ వింతైన, భయానక సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆ భవనం వెనుక దాగి ఉన్న చీకటి రహస్యం ఏమిటనేది వెన్నులో వణుకు పుట్టిస్తుంది.

4. అన్బిల్ అవన్ (Anbil Avan)

అశోక్ సెల్వన్, ప్రీతి ముకుందన్, రేవతి, సాబుమోన్ అబ్దుసమద్, ఢిల్లీ గణేష్ నటించిన ఈ సినిమాను ఆర్. కార్తికేయన్ డైరెక్ట్ చేశాడు. రొమాంటిక్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 20 నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

నగరంలోని ఉరుకులు పరుగుల జీవితాన్ని వదిలి, ప్రశాంతమైన కొండ ప్రాంతంలో స్థిరపడాలనుకునే సూర్య, ఇయల్ అనే దంపతుల కథ ఇది. అక్కడ ఒక అందమైన హోమ్‌స్టే ప్రారంభించాలనే కలతో ఇద్దరూ కలిసి ఒక పురాతన బంగ్లాను కొనుగోలు చేస్తారు. కానీ ఆ ప్రాంతానికి చెందిన ఒక శక్తివంతమైన వ్యక్తి వారిని ఆ ఇంటి నుంచి వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తాడు. నిరంతర బెదిరింపుల మధ్య తన భార్యను, ఇంటిని కాపాడుకోవడానికి సూర్య చేసిన పోరాటమే ఈ చిత్రం.

5. హైకూ (Haiku)

ఏగన్, శ్రీదేవి ఆపల్ల, ఫెమినా జార్జ్, అదిర్చి అరుణ్ నటించిన ఈ రొమాంటిక్ డ్రామాకు యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహించారు. నెట్‌ఫ్లిక్స్ లో నవంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఇంజినీరింగ్ కాలేజీ నుంచి సస్పెండ్ అయిన మనోహరన్ అలియాస్ మనో, అనుకోని పరిస్థితుల్లో ఒక గర్ల్స్ కాలేజీలో చేరతాడు. ఆ కాలేజీలో ఏకైక అబ్బాయి అయిన మనో, పావళకోడి అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ అనుమానాల వల్ల వారి బంధం తెగిపోతుంది.

కొన్నేళ్ల తర్వాత చెన్నైలో ఉద్యోగం చేస్తున్న మనో జీవితంలోకి నివేత అనే ట్రైనీ వస్తుంది. పాత ప్రేమ గాయాల నుంచి కోలుకుంటున్న ఇద్దరూ దగ్గరవుతున్న సమయంలో, మనో మాజీ ప్రేయసి మళ్లీ తిరిగి రావడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది.

ఈ వారం విభిన్న జానర్లలో వస్తున్న ఈ ఐదు దక్షిణాది చిత్రాలు, సిరీస్‌లతో ఓటీటీ ప్రియులకు అసలైన వినోదం అందనుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks