Actress: ఒక్క రాత్రికి ఎంత తీసుకుంటావ్.. పాపులర్ నటికి వేధింపులు.. వికృత మెసేజ్‌లు
Actress Anangsha Biswas About Vulgar Messages: ప్రసిద్ధ ఓటీటీ వెబ్ సిరీస్ 'మిర్జాపూర్'లో జరీనా పాత్రతో గుర్తింపు పొందిన నటి అనంగ్షా బిస్వాస్ నెటిజన్ల అసభ్యకర వేధింపులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెండితెరపై బోల్డ్ పాత్రలు పోషించినంత మాత్రాన నిజ జీవితంలోనూ అలాగే ఉంటారనుకోవడం సరికాదన్నారు.
Actress Anangsha Biswas About Vulgar Messages: డిజిటల్ స్ట్రీమింగ్ ప్రపంచంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటీటీ వెబ్ సిరీస్ 'మిర్జాపూర్'. ఈ ఓటీటీ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అనంగ్షా బిస్వాస్ (Anangsha Biswas). ఈ పొలిటికల్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో రాజకీయం, గ్లామర్‌ను ఉపయోగించి ఎదిగే 'జరీనా' అనే గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు.

బోల్డ్ క్యారెక్టర్ వల్ల వేధింపులు
ఇప్పుడు ఇదే కథ వెండితెరపై 'మీర్జాపూర్: ది మూవీ' రూపంలో రానున్ విషయం తెలిసిందే. అయితే, స్క్రీన్‌పై తాను పోషించిన బోల్డ్ క్యారెక్టర్ వల్ల నిజ జీవితంలో తీవ్రమైన వేధింపులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఈ బెంగాలీ భామ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అసభ్యకరమైన మెసేజ్‌లు.. వ్యక్తిగత వేధింపులు
హిందీ రష్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనంగ్షా మాట్లాడుతూ.. మొదటి సీజన్ విడుదలైన తర్వాత తన ఇన్ బాక్స్ నిండా వికృత మెసేజ్‌లే దర్శనమిచ్చాయని చెప్పారు. రీల్ జీవితానికి, రియల్ జీవితానికి తేడా తెలియని కొందరు నెటిజన్లు తన పట్ల అత్యంత నీచంగా వ్యవహరించారని అనంగ్షా బిస్వాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్క రాత్రికి ఎంత తీసుకుంటారు?
"ఒక్క రాత్రికి ఎంత తీసుకుంటారు? రెండు రోజులు మోరీషస్‌కి వస్తారా? అంటూ ఈమెయిల్స్‌లో కొందరు అసభ్యకరంగా అడిగేవారు. నేను నటనను సరస్వతీ దేవిలా భావించి పూర్తి నిష్ఠతో పనిచేశాను. కానీ ప్రజలు నన్ను నిజ జీవితంలో కూడా అలాగే చూస్తారని ఊహించలేదు" అని అనంగ్షా బిస్వాస్ తీవ్రంగా కలత చెందారు.
పాత్రలను బట్టి వ్యక్తిత్వాన్ని చూడటం దారుణం
బోల్డ్ లేదా విలన్ పాత్రలు వేసే నటీనటులను విడిగా చూడగల మానసిక పరిణతి ప్రేక్షకుల్లో రావాలని ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన ఇంటర్వ్యూ కథనంలో ఆమె కోరారు. సినిమాల్లో పాత్రలను బట్టి నటుల వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూడటం దారుణమని ధ్వజమెత్తారు.
'మిర్జాపూర్: ది మూవీ'తో మళ్లీ వెండితెరకు
ఇదిలా ఉంటే, ఓటీటీలో రికార్డులు సృష్టించిన మీర్జాపూర్ సిరీస్, ఇప్పుడు బిగ్ స్క్రీన్ సినిమాగా రూపాంతరం చెందుతుండటం అరుదైన విషయంగా చెప్పవచ్చు. అభిమానుల నుంచి వచ్చిన భారీ డిమాండ్ చూసే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత ఫర్హాన్ అక్తర్ స్పష్టం చేశారు.
అభిమానుల ప్రేమాభినాల ఫలితమే
"ఎక్కడికి వెళ్లినా మీర్జాపూర్ నెక్ట్స్ వెర్షన్ ఎప్పుడు వస్తుందని నన్ను అడిగేవారు. అభిమానుల ప్రేమాభిమానాల ఫలితమే ఈ చిత్రం" అని ఫర్హాన్ అక్తర్ సంతోషం వ్యక్తం చేశారు.
మీర్జాపూర్ సినిమా నటీనటులు
ఈ భారీ ప్రాజెక్ట్‌లో ఖాలీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, గూడ్డూ పండిట్‌గా అలీ ఫజల్, మున్నా భయ్యాగా దివ్యేందు శర్మ, బీనా త్రిపాఠిగా రసికా దుగల్ తిరిగి సందడి చేయనున్నారు. మొదటి సీజన్‌లో విక్రాంత్ మాస్సీ పోషించిన ‘బబ్లూ పండిట్’ పాత్రను ఈ సినిమాలో 'పంచాయత్' ఫేమ్ జితేంద్ర కుమార్ పోషిస్తుండటం విశేషం.
బోల్డ్ కంటెంట్ చేసే నటీనటులకు
తెలుగు రాష్ట్రాల్లోనూ 'మీర్జాపూర్' సిరీస్‌కు విశేషమైన క్రేజ్ ఉంది. డిజిటల్ మాధ్యమాల్లో బోల్డ్ కంటెంట్ చేసే నటీనటులు ఆన్‌లైన్ ట్రోలింగ్, సైబర్ వేధింపులకు గురికావడంపై ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


