OTT Telugu: అఫీషియల్.. ఓటీటీలోకి ఐదు భాషల్లో వస్తున్న శ్రీవిష్ణు లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ..

OTT Telugu: ఓటీటీలోకి శ్రీవిష్ణు లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. ఏకంగా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Published on: Mar 31, 2026, 19:25:47 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Telugu: క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ కు గుడ్ న్యూస్. తెలుగులో తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టే శ్రీవిష్ణు నటించిన థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ్ ఓటీటీలోకి వస్తోంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఆ విశేషాలు, అసలు స్టోరీ ఏంటి అన్నది ఇక్కడ చూడండి.

OTT Telugu: అఫీషియల్.. ఓటీటీలోకి ఐదు భాషల్లో వస్తున్న శ్రీవిష్ణు లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
OTT Telugu: అఫీషియల్.. ఓటీటీలోకి ఐదు భాషల్లో వస్తున్న శ్రీవిష్ణు లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ..

మృత్యుంజయ్ ఓటీటీ రిలీజ్ డేట్

వరుస హత్యల మిస్టరీని ఛేదించే ఓ సామాన్యుడి పాత్రలో శ్రీవిష్ణు నటించిన మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాను శుక్రవారం (ఏప్రిల్ 3) నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా రానుండటం విశేషం.

దీంతో థియేటర్లలో అంతంతమాత్రం ఆదరణ దక్కించుకున్న ఈ మూవీకి ఓటీటీలో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. “సిటీని ఓ వేదికలా భావించే కిల్లర్ ఓవైపు.. ఓ మరణాన్ని క్లూ భావించే వ్యక్తి మరోవైపు.. నెట్‌ఫ్లిక్స్ లో మృత్యుంజయ్ ఏప్రిల్ 3 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో..” అనే క్యాప్షన్ తో నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేసింది.

మృత్యుంజయ్ మూవీ స్టోరీ, ఇతర విశేషాలు

మృత్యుంజ‌య్ సినిమా మార్చి 6, 2026న థియేటర్లలో రిలీజైంది. ఇందులో శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, వీర్ ఆర్యన్, చిన్నా, సుదర్శన్ తదితరులు నటించారు. ఈ మూవీకి హుస్సేన్ షా కిరణ్ డైరెక్టర్. కాలభైరవ మ్యూజిక్ అందించిన ఈ మృత్యుంజ‌య్ మూవీకి థియేటర్లో మిక్స్ డ్ టాక్ వినిపించింది.

హత్యల వెనుక ఉన్న మిస్టరీని కనిపెట్టడమే కథగా సాగే సినిమానే మృత్యుంజ‌య్. ఇందులో జయ్ (శ్రీవిష్ణు) ఓ పేపర్ యాడ్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తుంటాడు. కానీ అతనికి ఎప్పటికైనా క్రైమ్ రిపోర్టర్ కావాలని కల. అవకాశం రాకపోవడంతో ఇష్టం లేకపోయినా యాడ్ విభాగంలోనే కొనసాగుతాడు.

ఎవరైనా చనిపోతే వాళ్ల ఇంటికి వెళ్లి శ్రద్ధాంజలి ప్రకటనలు సంపాదిస్తుంటాడు. చనిపోయిన వాళ్ల గురించి గొప్పగా చెప్తుంటాడు. ఈ క్రమంలోనే ఓ సారి అచ్యుత్ రావు (బాలాదిత్య) మరణిస్తాడు. వాళ్ల ఇంటికి జయ్ వెళ్తాడు.

అచ్యుత్ రావుకు చిన్న కూతురు అంజలి ఉంటుంది. నాన్నకు ఎందుకు అలా జరిగిందని జయ్ ను ఆ పాప అడుగుతుంది. తాను తెలుసుకుంటానని జయ్ చెప్తాడు. అయితే అచ్యుత్ లాగే మరో వ్యక్తి కూడా మరణిస్తాడు. దీంతో ఈ చావుల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు జయ్ రంగంలోకి దిగుతాడు.

మరోవైపు ఐపీఎస్ ఆఫీసర్ సీతా పరశురాం (రెబా మోనికా) కూడా ఈ చావులపై విచారణ కొనసాగిస్తుంది. కానీ పై అధికారుల ఒత్తిడి కారణంగా అవి ప్రమాదాలే అని నమ్ముతుంది. కానీ అవి సాధారణ మరణాలు కాదని హత్యలు అని జయ్ తెలుసుకుంటాడు. మరి ఆ హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? వాళ్లను జయ్ కనిపెట్టాడా? అన్నది మృత్యుంజ‌య్ సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More