తెలుగు ప్రేక్షకులు గత వారం మొత్తం సంక్రాంతి సినిమాల్లో మునిగి తేలారు. థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో ఓటీటీలో కాస్త సందడి తగ్గింది. అయితే సంక్రాంతి ముగిసింది. ఐదు సినిమాల పరిస్థితేంటో ఇప్పటికే తేలిపోయింది. ఇక మెల్లగా ఓటీటీ వైపు తిరిగి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈవారం అంటే జనవరి 17 నుంచి 23 మధ్య ఓటీటీలోకి రాబోతున్న మూడు తెలుగు సినిమాలు ఏవి? వాటిని ఎందుకు చూడాలో తెలుసుకోండి.
ఓటీటీలోకి రానున్న తెలుగు సినిమాలు

సంక్రాంతి హడావిడి ముగిసింది. ఇప్పుడు ఓటీటీలో కొత్త సినిమాల సందడి మొదలైంది. ఈ వారం తెలుగులో మూడు ఆసక్తికరమైన సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పైకి వస్తున్నాయి. థియేటర్లో హిట్ కొట్టిన సినిమాతో పాటు, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కూడా ఉండటం విశేషం. ఆ లిస్ట్ లో ఏమున్నాయో చూడండి.
1. శంభాల (Shambhala)
ప్లాట్‌ఫామ్: ఆహా వీడియో
స్ట్రీమింగ్ తేదీ: జనవరి 22, 2026
ఆది సాయికుమార్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన మూవీ ఈ శంభాల. విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేకపోయినా, ట్రైలర్‌తో బజ్ క్రియేట్ చేసి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. ఇదో సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్. ఓ ఊళ్లో ఓ ఉల్క పడిన తర్వాత వరుసగా చాలా మంది చనిపోతుంటారు. ఆ ఊరికి వచ్చిన సైంటిస్టు వాటి వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడీ మూవీ ఓటీటీలోనూ అలరించేందుకు సిద్ధమైంది.
2. చీకటిలో (Cheekatilo)
ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
{{/usCountry}}ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
{{/usCountry}}స్ట్రీమింగ్ తేదీ: జనవరి 23, 2026
చాలా కాలం తర్వాత గ్లామరస్ బ్యూటీ శోభిత ధూళిపాళ తెలుగులో నటించిన మూవీ ఇది. అయితే ఇది థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలవుతోంది. సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాలో శోభిత జర్నలిస్టుగా కనిపించనుంది. అనుమానాస్పద స్థితిలో జరుగుతున్న మహిళల హత్యల మిస్టరీని ఛేదించే థ్రిల్లర్ కథాంశంతో ఇది తెరకెక్కింది. ఓ ట్రూ క్రైమ్ పాడ్‌కాస్టర్ గా సీరియల్ కిల్లర్ ఎవరో బయటపెట్టే పాత్రలో శోభిత నటించింది.
3. ఛాంపియన్ (Champion)
ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్
స్ట్రీమింగ్ తేదీ: జనవరి 23, 2026
రోషన్ మేక (శ్రీకాంత్ కుమారుడు) చాలా గ్యాప్ తర్వాత నటించిన సినిమా ఇది. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను ‘సీతారామం’, ‘కల్కి 2898 AD’ వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించింది. అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించింది. థియేటర్లలో ఆశించిన ఫలితం సాధించలేకపోయిన ఈ సినిమా.. ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.