Telugu OTT: ఈ వారం ఓటీటీలోని తెలుగు థ్రిల్లర్లు.. క్రైమ్, సస్పెన్స్ తో అదుర్స్.. వీకెండ్ కు బెస్ట్.. ఓ లుక్కేయండి
Telugu OTT: వీకెండ్ లో మంచి ఓటీటీ వైబ్ తో ఎంటర్ టైన్ కావాలా? మరి ఇంకెందుకు లేటు ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ తెలుగు థ్రిల్లర్లపై ఓ లుక్కేయండి. క్రైమ్, సస్పెన్స్ తో ఈ సినిమాలు మిమ్మల్ని థ్రిల్ చేస్తాయి.
వీకెండ్ లో ఓటీటీలో ఏ మూవీస్ చూడాలా? అని ఆలోచిస్తున్నారా? మీకు థ్రిల్లర్స్ అంటే ఇష్టమా? సస్పెన్స్ తో కూడిన సినిమాలను ఎంజాయ్ చేస్తారా? అయితే ఈ మూవీస్ మీకోసమే. ఈ వారం ఓటీటీలో రిలీజైన ఈ తెలుగు థ్రిల్లర్లు కచ్చితంగా థ్రిల్ పంచుతాయి.

యుఫోరియా
సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన క్రైమ్ సోషల్ డ్రామా థ్రిల్లర్ ‘యుఫోరియా’. ఈ తరం యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేలా గుణశేఖర్ తీసిన మూవీ ఇది.
ఈటీవీ విన్ లో
యుఫోరియా ధురంధర్ హీరోయిన్ సారా అర్జున్, భూమిక చావ్లా తదితరులు నటించారు. ఐఏఎస్ కావాలనుకునే ఓ అమ్మాయిని కొంతమంది కుర్రాళ్లు మత్తులో రేప్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
మృత్యుంజయ్
శ్రీవిష్ణు నటించిన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్. ఈ మూవీ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మృత్యుంజయ్ ను చూడొచ్చు.
ఓ పేపర్ లో యాడ్ విభాగంలో పని చేసే హీరో వరుస హత్యల కేసును ఎలా ఛేదించాడన్నదే మృత్యుంజయ్ మూవీ స్టోరీ.
సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని
ఓ పోలీస్ ఆఫీసర్ శవాన్ని మాయం చేయడం కోసం ఓ ఫ్యామిలీ పడే కష్టాల చుట్టూ సాగే సినిమానే సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. ఈ సినిమాలో శివాజీ, లయ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా ఓటీటీలో అయిదు భాషల్లో ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.
ఎస్.సరస్వతి
వర్సటైల్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా ‘ఎస్.సరస్వతి’. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్ ప్లే చేసింది. ఈ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రైమ్ వీడియోలో తెలుగులో ప్లే అవుతోంది.
రేస్ చేశారని
తన కూతురిని స్కూల్ లో ముగ్గురు కలిసి రేప్ చేసి, చంపేశారని ఓ తల్లి కంప్లెయింట్ ఇస్తుంది. కానీ అసలు అలాంటిదేమీ జరగలేదని కేసు కొట్టేస్తారు. ఆ తర్వాత మూడు హత్యలు జరుగుతాయి. ఇలా ట్విస్ట్స్ అండ్ టర్న్ లతో సాగే స్టోరీతో థ్రిల్ పంచుతుంది ఎస్.సరస్వతి సినిమా.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


