OTT Today: ఓటీటీలోకి ఈవారం వచ్చిన ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాల్లో ఒకటి బాల్టీ (Balti). గతేడాదే థియేటర్లలో రిలీజైనా.. చాలా రోజులకు గానీ డిజిటల్ ప్రీమియర్ కాలేదు. నిజానికి శుక్రవారం (జులై 10) సోనీ లివ్ ఓటీటీలోకి రావాల్సి ఉన్నా.. ఒక రోజు ముందే అంటే గురువారం (జులై 9) సాయంత్రం నుంచే ఐదు భాషల్లో స్ట్రీమింగ్ మొదలైంది.
బాల్టీ ఓటీటీ స్ట్రీమింగ్

మలయాళం సినిమాలకు పాన్ ఇండియా లెవెల్లో ఉన్న క్రేజ్ నేపథ్యంలో చాలా వరకు సినిమాలు థియేటర్లలో కేవలం మలయాళం ఆడియోతోనే రిలీజైనా.. ఓటీటీలో మాత్రం మల్టీ లాంగ్వేజెస్ రిలీజ్ చూస్తున్నాయి. తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టిన బాల్టీ కూడా అంతే.
మలయాళం టాలెంటెడ్ యాక్టర్ షేన్ నిగమ్ లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది. ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీలో మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
బాల్టీ మూవీ స్టోరీ ఏంటంటే?
ఉదయన్ అలియాస్ బాల్టీ (షేన్ నిగమ్) తన ఫ్రెండ్స్ గ్రూప్‌తో కలిసి వెలంపళయం అనే బోర్డర్ టౌన్‌లో లోకల్ కబడ్డీ టోర్నమెంట్లు ఆడుతుంటాడు. అతనికి తన తల్లి, స్నేహితులు అంటే ప్రాణం. అయితే ఓ లోకల్ కబడ్డీ మ్యాచ్‌లో పవర్‌ఫుల్ రౌడీ పోర్తామరై భైరవన్ టీమ్‌ను బాల్టీ గ్యాంగ్ ఓడిస్తుంది. అక్కడినుంచి హీరో లైఫ్ మొత్తం టర్న్ అవుతుంది. ఈ విజయం వాళ్ళను అక్రమ ఫైనాన్స్, గ్యాంగ్ వార్స్, అండర్ వరల్డ్ క్రైమ్ మాఫియాలోకి లాగేస్తుంది.
సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో చాలా ఎంగేజింగ్‌గా సాగుతుంది. షేన్ నిగమ్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్పోర్ట్స్ మెన్‌గా, ఫ్రెండ్ కోసం ప్రాణాలిచ్చే కుర్రాడిగా తన యాక్టింగ్ ఇరగదీశాడు. డైరెక్టర్ ఉన్ని శివలింగం ఫస్ట్ మూవీ అయినా సరే యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.
సెకండాఫ్ మైనస్
కానీ సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి సినిమా ట్రాక్ మారుతుంది. కబడ్డీ పక్కకు వెళ్లిపోయి పక్కా వయొలెంట్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా మారిపోతుంది. కథలో ఎమోషనల్ ఫీల్ మిస్ అయ్యి రొటీన్ రివెంజ్ డ్రామాగా సాగడం కొద్దిగా మైనస్ అని చెప్పొచ్చు. అయితే యాక్షన్ లవర్స్‌కి మాత్రం ఈ సినిమా సెకండ్ హాఫ్ కూడా మంచి కిక్ ఇస్తుంది.
{{/usCountry}}కానీ సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి సినిమా ట్రాక్ మారుతుంది. కబడ్డీ పక్కకు వెళ్లిపోయి పక్కా వయొలెంట్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా మారిపోతుంది. కథలో ఎమోషనల్ ఫీల్ మిస్ అయ్యి రొటీన్ రివెంజ్ డ్రామాగా సాగడం కొద్దిగా మైనస్ అని చెప్పొచ్చు. అయితే యాక్షన్ లవర్స్‌కి మాత్రం ఈ సినిమా సెకండ్ హాఫ్ కూడా మంచి కిక్ ఇస్తుంది.
{{/usCountry}}హీరోయిన్ ప్రీతి అస్రాని క్యారెక్టర్‌కి పెద్దగా స్కోప్ లేదు కానీ, ఉన్నంతలో నీట్‌గా చేసింది. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే అలెక్స్ జే పులికల్ విజువల్స్ బోర్డర్ టౌన్ రస్టిక్ ఫీల్‌ను పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేశాయి. శివకుమార్ ఎడిటింగ్ వర్క్ బాగుంది కానీ, సెకండ్ హాఫ్‌లో కాస్త ట్రిమ్ చేసుంటే సినిమా స్పీడ్ ఇంకా పెరిగేది.
ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మ్యూజిక్. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ (Sai Abhyankkar) మ్యూజిక్, బీజీఎం వేరే లెవెల్ లో ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో బీజీఎం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. 'జలక్కారి' సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుండటంతో ఈ వీకెండ్ మీ వాచ్ లిస్ట్ లో చేర్చుకోవచ్చు.