OTT Today: ఒక్క రోజే గతాన్ని మరచిపోయే హీరోయిన్.. ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి తొలి హిందీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Today: ఓటీటీలోకి సాయి పల్లవి నటించిన తొలి హిందీ సినిమా ఏక్ దిన్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన రెండున్నర నెలలకు ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అయింది. తెలుగులోనూ సినిమా స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.

Published on: Jul 17, 2026, 13:53:58 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Today: ఒక్క రోజే హీరోయిన్ గతం మరచిపోవడం, అది కాస్తా హీరోకి వరంగా మారడం అనే సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ఏక్ దిన్. సాయి పల్లవి నటించిన తొలి హిందీ మూవీ ఇది. ఈ ఏడాది మే 1న థియేటర్లలో రిలీజై మిక్స్‌డ్ రివ్యూలు సొంతం చేసుకున్న ఈ సినిమా.. మొత్తానికి రెండున్నర నెలల తర్వాత ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది.

OTT Today: ఒక్క రోజే గతాన్ని మరచిపోయే హీరోయిన్.. ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి తొలి హిందీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Today: ఒక్క రోజే గతాన్ని మరచిపోయే హీరోయిన్.. ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి తొలి హిందీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఏక్ దిన్ ఓటీటీ స్ట్రీమింగ్

ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ఏక్ దిన్. ఆమిర్ ఖాన్ స్వయంగా ప్రొడ్యూస్ చేసి పెద్ద ఎత్తున ప్రమోషన్లు నిర్వహించినా ఫలితం లేకపోయింది. మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఐఎండీబీలోనూ కేవలం 5.8 రేటింగ్ మాత్రమే సొంతం చేసుకుంది.

అలాంటి మూవీ మొత్తానికి డిజిటల్ ప్రీమియర్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒరిజినల్ హిందీ వెర్షన్ తోపాటు తెలుగు, తమిళంలలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సాయి పల్లవి క్యూట్ హిందీ డైలాగులు, యాక్టింగ్.. జపాన్ అందాలు ఈ సినిమాకు అతిపెద్ద ప్లాస్ పాయింట్లుగా నిలుస్తాయి.

'ఏక్ దిన్' కథ ఏంటంటే?

ఏక్ దిన్ మూవీ స్టోరీ దినేష్ (జునైద్ ఖాన్) అనే ఐటీ ప్రొఫెషనల్ చుట్టూ తిరుగుతుంది. అతను తనతో పాటు పనిచేసే మీరా (సాయి పల్లవి)ను రహస్యంగా ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పే ధైర్యం అతనికి ఉండదు. ఆఫీస్ ట్రిప్ అంటూ అందరూ కలిసి ఐదు రోజుల జపాన్ ట్రిప్ కి వెళ్లినప్పుడు, కనీసం ఒక్క రోజైనా ఆమెతో గడపాలని అక్కడి ఫార్చూన్ బెల్ దగ్గర కోరుకుంటాడు.

ఆ తర్వాత ఊహించని రీతిలో రాత్రంతా మంచులో కూరుకుపోయిన మీరాకు అరుదైన 'ట్రాన్సియంట్ గ్లోబల్ అమ్నీషియా' (TGA) వస్తుంది. అంటే ఒక రోజు పాటు ఆమె తన గతాన్ని మరచిపోతుంది. తన చిన్నప్పటి విషయాలు ఆమెకు గుర్తున్నా.. రీసెంట్ గా జరిగినవన్నీ ఆమెకు గుర్తుండవు. ఆమెను కాపాడిన దినేష్.. తాను ఆమె బాయ్‌ఫ్రెండ్ అని అంటూ ఒక రోజు పాటు ఆమెతో సంతోషంగా గడపాలని చూస్తాడు. కోలుకున్నాక ఆలోచిస్తే ఆమెకు ఏం జరిగిందో గుర్తుకు రాదు. మరి ఆ రోజు ఏం జరిగింది? దినేష్ తన ప్రేమను చెప్పాడా? మీరా రియాక్షన్ ఏంటీ? అన్నది తెరపైనే చూడాలి.

ఏక్ దిన్ ఎలా ఉందంటే?

ఏక్ దిన్ మూవీ 2016లో వచ్చిన థాయ్ మూవీ 'వన్ డే'కి అధికారిక హిందీ రీమేక్. తాను రహస్యంగా ప్రేమిస్తున్న అమ్మాయి సడెన్ గా ఒక రోజు గతం మరచిపోవడం, ఆ రోజు తన బాయ్‌ఫ్రెండ్ గా ఆనందంగా గడపాలనుకునే అబ్బాయి.. ఇలా ఓ వెరైటీ కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ ఇది. ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ సాయి పల్లవే. ఆమె సహజమైన నటన మూవీని ఎక్కడా బోర్ కొట్టకుండా చేస్తుంది.

దీనికితోడు చాలా వరకు మూవీ జపాన్ లోనూ సాగడంతో అక్కడి అందాలు కూడా కట్టి పడేస్తాయి. అయితే ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ లీడ్ రోల్లో నటించినా.. అతని నటన, ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్ పెద్దగా పండలేదు. ఒక రకంగా అతడే ఈ మూవీకి పెద్ద మైనస్ అని కూడా చెప్పొచ్చు. థియేటర్లలో చూడని వాళ్లు ఈ మూవీని ప్రైమ్ వీడియోలో తెలుగులోనూ చూసే అవకాశం ఉంది. వెంటనే ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోండి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More