...
...
Next Story

OTT Trending:బిగ్ బాస్ ఎలాగో ఫస్ట్ ప్లేస్‌-మ‌రి జియోహాట్‌స్టార్‌లో తెలుగు ఆడియ‌న్స్ తెగ చూసేస్తున్న సినిమాలు ఏవో తెలుసా?

OTT Trending: బిగ్ బాస్ కొత్త సీజన్ స్టార్ట్ అయిందంటే చాలు ఓటీటీ ఆడియన్స్ ఎగబడి మరీ చూస్తారు. అందుకే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో జియోహాట్‌స్టార్‌లో బిగ్ బాస్ ట్రెండింగ్ నంబర్ వన్ గా ఉంటుంది. ఆ షో కాకుండా రెండు సినిమాలను తెలుగు ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. వాటి వివరాలు తెలుసుకోండి.

Published on: Sep 21, 2026, 09:33:36 IST
Advertisement

OTT Trending: కామన్ పీపుల్ కు కూడా దగ్గరైన ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌. జియో సిమ్ రీఛార్జులతో పాటు ఈ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ కోసం స్పెషల్ ఆఫర్స్ అందించడమూ ఓ కారణమే. అయితే ఇప్పుడు జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో బిగ్ బాస్ క్రేజ్ కనిపిస్తోంది. అన్ని భాషల్లోనూ ఓటీటీలో బిగ్ బాస్ ట్రెండింగ్ నంబర్ వన్ గా ఉంది.

బిగ్ బాస్ ట్రెండింగ్

బిగ్ బాస్ ఎలాగో ఫస్ట్ ప్లేస్‌-మ‌రి జియోహాట్‌స్టార్‌లో తెలుగు ఆడియ‌న్స్ తెగ చూసేస్తున్న సినిమాలు ఏవో తెలుసా?
బిగ్ బాస్ ఎలాగో ఫస్ట్ ప్లేస్‌-మ‌రి జియోహాట్‌స్టార్‌లో తెలుగు ఆడియ‌న్స్ తెగ చూసేస్తున్న సినిమాలు ఏవో తెలుసా?

జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో బిగ్ బాస్ కు తిరుగులేదు. తెలుగులో బిగ్ బాస్ 10వ సీజన్ ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ బిగ్ బాస్ దే హవా. ఆయా భాషల్లో జియోహాట్‌స్టార్‌లో ట్రెండింగ్ నంబర్ వన్ గా బిగ్ బాస్ సీజన్లు కొనసాగుతున్నాయి.

ఆ రెండు సినిమాలు

అయితే బిగ్ బాస్ తర్వాత జియోహాట్‌స్టార్‌లో తెలుగు ఆడియన్స్ ఎక్కువగా చూస్తున్న రెండు సినిమాలు హాట్ టాపిక్ గా మారాయి. ఇందులో ఒకటి మలయాళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘తుడక్కమ్’ కాగా, మరొకటి తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘కర్మాఖ్య’ కావడం విశేషం.

సస్పెన్స్ థ్రిల్లర్

మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ ‘తుడక్కమ్’ సినిమాను తెలుగు ఆడియన్స్ కూడా తెగ చూసేస్తున్నారు. ఈ మూవీ తెలుగు ఆడియోలోనూ అందుబాటులో ఉంది. ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌లో తెలుగు ట్రెండింగ్ లో ఈ మూవీ మూడో ప్లేస్ లో ఉంది. సూపర్ స్టార్ మోహన్ లాల్ కూతురు విస్మయ మోహన్ లాల్ తుడక్కమ్ మూవీతో డెబ్యూ చేసింది.

ఇక చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్సే దక్కించుకున్న హారర్ థ్రిల్లర్ ‘కర్మాఖ్య’. జబర్దస్త్ కామెడీ షోలో అదిరే అభిగా అదరగొట్టిన అభిన‌య కృష్ణ‌ డైరెక్టర్ గా మారి తెరకెక్కించిన మూవీ ఇది. ఈ సినిమాలో ఓ యువతిని నరబలి ఇచ్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తారు. చేతబడి, నరబలి లాంటి అంశాలతో ఈ కర్మాఖ్య మూవీ మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తోంది.

జియోహాట్‌స్టార్‌లో తెలుగు ట్రెండింగ్ లో బిగ్ బాస్ 10వ సీజన్ తర్వాత కర్మాఖ్య సెకండ్ ప్లేస్ లో ఉంది. సినిమాల్లో ఫస్ట్ ప్లేస్ లో దూసుకెళ్తోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks