OTT Trending: ఓటీటీలో అదరగొడుతున్న వార్ డ్రామా.. ఎగబడి చూసేస్తున్న జనాలు.. ట్రెండింగ్ నంబర్ వన్.. మీరు చూశారా?
OTT Trending: ఇండో-పాక్ వార్ నేపథ్యంలో వచ్చిన దేశభక్తి సినిమా ‘బోర్డర్ 2’ ఓటీటీలో అదరగొడుతోంది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ, ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ సత్తాచాటుతోంది. ట్రెండింగ్ నంబర్ వన్ గా ఈ చిత్రం కొనసాగుతోంది.
ఓటీటీలో దేశభక్తి సినిమా ‘బోర్డర్ 2’ అదరగొడుతోంది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ ఇండో-పాక్ వార్ డ్రామా, ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ దూసుకెళ్తోంది. ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను ఓటీటీ లవర్స్ తెగ చూసేస్తున్నారు.

బోర్డర్ 2 ఓటీటీ
బ్లాక్ బస్టర్ మూవీ ‘బోర్డర్ 2’ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 20, 2026న ఈ సినిమా డిజిటల్ డెబ్యూ చేసింది. ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో టాప్ లేపుతోంది.
రూ.464 కోట్లు
బోర్డర్ 2 మూవీ థియేటర్లలో అదరగొట్టింది. బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఏకంగా రూ.464 కోట్లు కొల్లగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా వసూళ్లలో దూసుకెళ్లింది. ఈ ఇండో-పాక్ వార్ డ్రామా మూవీలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, అహాన్ శెట్టి, దిల్జీత్ దోసాంజ్ కీలక పాత్రలు పోషించారు.
లెఫ్టినెంట్ కల్నల్ గా
1971 ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో సాగే ఈ కథలో.. ఆర్మీ మేజర్ హోషియార్ సింగ్ దహియాగా వరుణ్ ధావన్, నేవీ లెఫ్టినెంట్ కమాండర్ ఎంఎస్ రావత్‌గా అహాన్ శెట్టి, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్‌గా దిల్జీత్ దోసాంజ్ నటించారు. వారికి సీనియర్‌గా లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ కాలేర్ పాత్రలో సన్నీ డియోల్ మరోసారి తన గంభీరమైన నటనతో ఆకట్టుకున్నారు.
వార్ మూవీగా రికార్డు
బోర్డర్ 2 మూవీ కలెక్షన్ల పరంగా ఓ రికార్డు ఖాతాలో వేసుకుంది. 2026 జనవరి 23న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. హృతిక్ రోషన్ ‘ఫైటర్’, విక్కీ కౌశల్ ‘ఉరి’, అక్షయ్ కుమార్ ‘కేసరి’ వంటి చిత్రాలను అధిగమించి భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన వార్ ఫిల్మ్‌గా బోర్డర్ 2 నిలిచింది.
ఇండో-పాక్ యుద్ధం
1971 ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో సాగే మూవీనే బోర్డర్ 2. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఐకానిక్ గా నిలిచిన సినిమాల్లో బోర్డర్ ఒకటి. దీనికి సీక్వెల్ గా బోర్డర్ 2 సినిమా వచ్చింది. థియేటర్లలో ఆడియన్స్ ను మెప్పించింది ఈ మూవీ. భారత త్రివిధ దళాలకు ఇది సరైన ట్రిబ్యూట్ అని కామెంట్లు వస్తున్నాయి. ఈ సినిమాకు ఐఎండీబీలో 7.1 రేటింగ్ ఉంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


