బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను పాకిస్థాన్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చడం కలకలం రేపుతోంది. అబుదాబిలో బలూచిస్తాన్ గురించి సల్మాన్ చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. దీంతో అతను వివాదంలో చిక్కుకున్నాడు. ఈ ఘటన పాకిస్థాన్ కు తీవ్రమైన కోపం తెప్పించింది. అందుకే సల్మాన్ ఖాన్ ను ఉగ్రవాదిగా పేర్కొంది. ఈ విషయం సంచలనంగా మారింది.
టెర్రరిస్ట్ గా సల్మాన్ ఖాన్

యాంటీ-టెర్రరిజం యాక్ట్ (1997)లోని 4వ షెడ్యూల్‌లో సల్మాన్ ఖాన్ పేరును పాకిస్థాన్ చేర్చినట్లు సమాచారం. యాంటీ-టెర్రరిజం యాక్ట్ (1997)లోని 4వ షెడ్యూల్ అనేది ఉగ్రవాదంతో సంబంధాలు ఉన్నాయని అనుమానించే వ్యక్తుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన జాబితా. దీంతో పాకిస్తాన్ సల్మాన్ ఖాన్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిందని కన్ఫామైంది. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం ఈ విషయాన్ని బలూచిస్తాన్ ప్రభుత్వ హోం శాఖ అక్టోబర్ 16, 2025న జారీ చేసిన నోటిఫికేషన్‌తో ధృవీకరించింది.
ఎందుకు ఉగ్రవాది?
సల్మాన్ ఖాన్‌ను 'ఉగ్రవాది'గా ప్రకటించడానికి గల కారణాన్ని ఆ పత్రంలో పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ 'ఆజాద్ బలూచిస్తాన్ ఫెసిలిటేటర్' అని అందులో ఉన్నట్లు సమాచారం. 4వ షెడ్యూల్‌లో చేర్చడం వల్ల నిఘా పెరగడం, ప్రయాణాలపై పరిమితులు, వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం వంటి తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అబుదాబిలోని రియాద్‌లో జరిగిన జాయ్ ఫోరమ్ 2025లో సల్మాన్ ఖాన్ పాకిస్తాన్, బలూచిస్తాన్‌లను వేర్వేరుగా ప్రస్తావించిన కొద్ది రోజులకే ఈ చర్య తీసుకున్నారు.
సల్మాన్ కామెంట్స్
సల్మాన్ ఖాన్ మిడిల్ ఈస్ట్ లో పని చేస్తున్న ప్రజల గురించి ఆ ఈవెంట్ లో మాట్లాడాడు. ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ కలిసి హాజరయ్యారు. బాలీవుడ్ ముగ్గురు ఖాన్‌లు కలిసి అరుదుగా కనిపించి మధ్యప్రాచ్యంలో భారతీయ సినిమాకు పెరుగుతున్న ఆదరణ గురించి చర్చించారు.
మధ్యప్రాచ్యంలో నివసించే దక్షిణాసియా కమ్యూనిటీలలో భారతీయ సినిమా ప్రభావం గురించి మాట్లాడుతూ సల్మాన్ ఖాన్.. “ప్రస్తుతం మీరు ఒక హిందీ సినిమా తీసి ఇక్కడ (సౌదీ అరేబియాలో) విడుదల చేస్తే అది సూపర్ హిట్ అవుతుంది. మీరు ఒక తమిళ, తెలుగు, లేదా మలయాళీ సినిమా తీసినా అది వందల కోట్ల వ్యాపారం చేస్తుంది. ఎందుకంటే ఇక్కడికి ఇతర దేశాల నుండి చాలా మంది వచ్చారు. బలూచిస్తాన్ నుండి ప్రజలు ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుండి ప్రజలు ఉన్నారు, పాకిస్తాన్ నుండి ప్రజలు ఉన్నారు.. అందరూ ఇక్కడ పనిచేస్తున్నారు” అని సల్మాన్ అన్నాడు.
బలూచిస్థాన్ పోరాటం
{{/usCountry}}మధ్యప్రాచ్యంలో నివసించే దక్షిణాసియా కమ్యూనిటీలలో భారతీయ సినిమా ప్రభావం గురించి మాట్లాడుతూ సల్మాన్ ఖాన్.. “ప్రస్తుతం మీరు ఒక హిందీ సినిమా తీసి ఇక్కడ (సౌదీ అరేబియాలో) విడుదల చేస్తే అది సూపర్ హిట్ అవుతుంది. మీరు ఒక తమిళ, తెలుగు, లేదా మలయాళీ సినిమా తీసినా అది వందల కోట్ల వ్యాపారం చేస్తుంది. ఎందుకంటే ఇక్కడికి ఇతర దేశాల నుండి చాలా మంది వచ్చారు. బలూచిస్తాన్ నుండి ప్రజలు ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుండి ప్రజలు ఉన్నారు, పాకిస్తాన్ నుండి ప్రజలు ఉన్నారు.. అందరూ ఇక్కడ పనిచేస్తున్నారు” అని సల్మాన్ అన్నాడు.
బలూచిస్థాన్ పోరాటం
{{/usCountry}}పాకిస్థాన్ నుంచి ఫ్రీడమ్ కోసం బలూచిస్థాన్ వేర్పాటు వాదులు ఫైట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బలూచిస్థాన్ నుంచి కూడా ప్రజలున్నారని సల్మాన్ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలపై ఇంటర్నెట్‌లో మిశ్రమ స్పందనలు వచ్చాయి. చాలా మంది ఆయన వైఖరిని ప్రశంసించగా, పొరుగు దేశానికి చెందిన చాలా మంది దీనిపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
ఖాన్ వ్యాఖ్యలను బలూచ్ వేర్పాటువాద నాయకులు ప్రశంసించారు. తమ పోరాటాలకు గుర్తింపుగా భావిస్తూ.. మీర్ యార్ బలూచ్ పలు నివేదికల ప్రకారం ఇలా అన్నారని ఉటంకించారు. “బలూచిస్తాన్‌ను ప్రత్యేకంగా గుర్తించడం ద్వారా, చాలా దేశాలు చేయడానికి సంకోచించే పనిని సల్మాన్ ఖాన్ చేశారు. ఇది మా గుర్తింపుపై ప్రపంచ అవగాహనను బలపరిచే ఒక శక్తివంతమైన సాఫ్ట్ డిప్లొమసీ చర్య” అని అన్నాడు. ఇంకా దీనిపై సల్మాన్ స్పందించాల్సి ఉంది.