...
...
Next Story

Pakistani singer: నన్ను ఇండియా నుంచి బ్యాన్ చేసినందుకు థ్యాంక్స్.. నాకు మంచే జరిగింది: పాకిస్థాన్ సింగర్ కామెంట్స్

Pakistani singer: పాకిస్థాన్ కు చెందిన బాలీవుడ్ స్టార్ సింగర్ ఆతిఫ్ అస్లం ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్, ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెబుతున్నాడు. తనపై నిషేధం విధించినందుకే అతడు కృతజ్ఞతలు చెప్పడం గమనార్హం. ఇంతకీ అతడు ఎందుకిలాంటి కామెంట్స్ చేశాడో చూడండి.

Published on: Aug 12, 2026, 15:18:56 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Pakistani singer: ఇండియాలో తనను గత 10 ఏళ్లుగా బ్యాన్ చేసిన ప్రభుత్వానికి, ఇండస్ట్రీ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ పాకిస్థాన్ స్టార్ సింగర్ ఆతిఫ్ అస్లం చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ మ్యూజిక్ వరల్డ్‌లో ఒకప్పుడు సెన్సేషనల్ చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో ఊపేసిన ఈ పాక్ పాప్ ఐకాన్, తన పదేళ్ల గ్యాప్ గురించి రీసెంట్‌గా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఓపెన్‌గా మాట్లాడారు.

బ్యాన్ వెనుక అసలు కథ ఏమిటి?

Pakistani singer: నన్ను ఇండియా నుంచి బ్యాన్ చేసినందుకు థ్యాంక్స్.. నాకు మంచే జరిగింది: పాకిస్థాన్ సింగర్ కామెంట్స్
Pakistani singer: నన్ను ఇండియా నుంచి బ్యాన్ చేసినందుకు థ్యాంక్స్.. నాకు మంచే జరిగింది: పాకిస్థాన్ సింగర్ కామెంట్స్

2016లో జరిగిన ఉరి ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ సరిహద్దుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థానీ నటులు, సింగర్లు, టెక్నీషియన్లతో మన నిర్మాతలు ఎవరూ పనిచేయకూడదని ప్రొడ్యూసర్స్ బాడీ ఆదేశాలు జారీ చేసింది.

దాని తర్వాత 2019 పుల్వామా దాడి ఘటనతో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) కూడా పాక్ కళాకారులపై పూర్తిస్థాయిలో నిషేధం ప్రకటించింది. దాంతో బాలీవుడ్‌లో టాప్ గేర్‌లో ఉన్న ఆతిఫ్ అస్లం కెరీర్‌కు ఇండియాలో ఒక్కసారిగా బ్రేక్ పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆయన బాలీవుడ్‌లో ఒక్క పాట కూడా పాడలేదు.

'వీపీఎన్ వాడి నా పాటలు వింటున్నారు'.. ఫ్యాన్స్‌కి స్పెషల్ మెసేజ్

తాజాగా క్రిస్ ఫేడ్ నిర్వహించిన టాక్ షోలో ఆతిఫ్ అస్లం మాట్లాడారు. "ఇండియాలో నాపై నిషేధం విధించి దాదాపు పదేళ్లు అవుతోంది. అది అక్కడ ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న అధికారిక నిర్ణయం. పాకిస్థాన్‌లోనూ భారతీయ కళాకారులపై నిషేధం ఉంది. అక్కడ నేను పాటలు పాడి పదేళ్లయినా, నా ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం నన్ను అస్సలు మర్చిపోలేదు" అని చెప్పారు.

ఇండియన్ ఆడియన్స్ మీద తనకు ఏమాత్రం కోపం లేదని ఆతిఫ్ స్పష్టం చేశారు. "నా ఇండియన్ ఫ్యాన్స్‌తో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. మీరు దేనికీ బాధపడకండి. నేను అక్కడి ప్లేబ్యాక్ సింగింగ్ ప్రాజెక్టులను మిస్ అవ్వడం లేదేమో కానీ, మిమ్మల్ని మాత్రం చాలా మిస్ అవుతున్నా. ఒకవేళ నన్ను ఇండియాలో బ్యాన్ చేయకపోతే, నేను కేవలం మూవీ పాటలకే పరిమితమయ్యేవాడిని" అని చెప్పుకొచ్చారు.

"నన్ను బ్యాన్ చేయడం వల్లే నాలోని ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ బయటకు వచ్చాడు. ఓన్ మ్యూజిక్ ఆల్బమ్స్, సోలో కంపోజిషన్స్ క్రియేట్ చేయడం నేర్చుకున్నా. అందుకే నన్ను బ్యాన్ చేసిన వాళ్లకు కూడా నేను బిగ్ థాంక్స్ చెబుతున్నా. ఈ బ్యాన్ నన్ను నేను కొత్తగా అన్వేషించుకోవడానికి చాలా హెల్ప్ అయింది" అని ఆయన వ్యాఖ్యానించారు.

బాలీవుడ్‌లో ఆతిఫ్ అస్లం సృష్టించిన మ్యూజికల్ సెన్సేషన్

2005లో వచ్చిన 'కలియుగ్' సినిమాలోని 'ఆదత్' సాంగ్‌తో ఆతిఫ్ అస్లం ఇండియాలో అడుగుపెట్టారు. ఆ ఒక్క పాటతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. ఆ తర్వాత వచ్చిన 'జహర్' మూవీలోని 'వో లమ్హే' పాట దేశమంతటా ఒక ఊపు ఊపేసింది.

ఆ తర్వాత ఆయన పాడిన ప్రతి పాట ఒక చార్ట్‌బస్టర్ గా నిలిచింది. రేస్ మూవీలోని తెరే బిన్, అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ మూవీలో తు జానే నా, తేరా హోనే లగా హూ, కిస్మత్ కనెక్షన్ సినిమాలో పెహ్లీ నజర్ మే, భజరంగీ భాయిజాన్ సినిమాలో తు జో మిలా, జీనా జీనా సాంగ్స్ తో యువతకు బాగా దగ్గరయ్యాడు.

ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ కేటగిరీలో పలుమార్లు నామినేట్ అయిన ఆతిఫ్.. మ్యూజిక్ లవర్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe