గుడ్ న్యూస్.. వారం ముందుగానే ఓటీటీలోకి సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ నాలుగో సీజన్.. కొత్త స్ట్రీమింగ్ డేట్ ఇదే

అమెజాన్ ప్రైమ్ వీడియోలోని సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ పంచాయత్ నాలుగో సీజన్ అనుకున్నదాని కంటే వారం ముందుగానే వచ్చేస్తోంది. తాజాగా బుధవారం (జూన్ 11) ట్రైలర్ రిలీజ్ చేస్తూ కొత్త స్ట్రీమింగ్ తేదీని కూడా అనౌన్స్ చేసింది.

Published on: Jun 11, 2025, 14:12:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండియన్ ఓటీటీలో అత్యుత్తమ వెబ్ సిరీస్ లలో ఒకటి పంచాయత్ (Panchayat). ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ నాలుగో సీజన్ ఈ నెలలోనే వచ్చేస్తోంది. మొదట జులై 2 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వెల్లడించిన ప్రైమ్ వీడియో.. ప్రేక్షకుల వేసిన ఓట్ల మేరకు వారం ముందుగానే తీసుకురానుండటం విశేషం.

గుడ్ న్యూస్.. వారం ముందుగానే ఓటీటీలోకి సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ నాలుగో సీజన్.. కొత్త స్ట్రీమింగ్ డేట్ ఇదే
గుడ్ న్యూస్.. వారం ముందుగానే ఓటీటీలోకి సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ నాలుగో సీజన్.. కొత్త స్ట్రీమింగ్ డేట్ ఇదే

పంచాయత్ సీజన్ 4 ఓటీటీ రిలీజ్ డేట్

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'పంచాయత్' సీజన్ 4 అమెజాన్ ప్రైమ్ వీడియోలో తిరిగి రాబోతోంది. ఈ కొత్త సీజన్ లో మంజు దేవి (నీనా గుప్తా), క్రాంతి దేవి (సునీత రాజ్వర్) మధ్య ఎన్నికల పోరు జరగబోతోంది. ఈ సరికొత్త సీజన్ జూన్ 24 నుంచే స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రైమ్ వీడియో తెలిపింది. కొత్త స్ట్రీమింగ్ తేదీతోపాటు ట్రైలర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.

కొన్ని రోజుల కిందట తమకు ఓటు వేస్తే సీజన్ 4ను జులై 2 కంటే ముందే తీసుకొస్తామని మంజు దేవి, క్రాంతి దేవి ఓ ఫన్నీ వీడియో ద్వారా చెప్పినట్లే.. ఇప్పుడు చేశారు. జులై 2న కాదు జూన్ 24నే వస్తుందని తెలిపారు.

ఫన్నీగా ట్రైలర్

పంచాయత్ సీజన్ 4 ట్రైలర్ కూడా చాలా ఫన్నీగా సాగిపోయింది. ఈ కొత్త సీజన్ మొత్తం ఎన్నికల సమరం సాగనుంది. ఫులేరా ఊరికి కొత్త సర్పంచ్ వచ్చే సమయం దగ్గర పడింది. మంజు దేవి మరోసారి సర్పంచ్ కావాలని చూస్తుండగా.. ఆమె ప్రత్యర్థి క్రాంతి దేవి కూడా గట్టిగానే ప్రచారం చేయడం ఇందులో చూడొచ్చు. ఓటర్లను ఆకర్షించడానికి ఈ ఇరు వర్గాలు ఎన్నో ప్రయత్నాలు చేయడం, ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంలాంటివి కూడా ఈ కొత్త సీజన్లో ఉండబోతున్నాయి. వాళ్ల మధ్య పంచాయతీ కార్యదర్శిగా ఉన్న అభిషేక్ త్రిపాఠీ (జితేంద్ర కుమార్) భవిష్యత్తు ఏం కాబోతుందన్నది కూడా ఈ కొత్త సీజన్లోనే తేలనుంది.

ఈ 4వ సీజన్ నటీనటులలో అభిషేక్ త్రిపాఠిగా జితేంద్ర కుమార్, గ్రామ ప్రధాన్ మంజు దేవిగా నీనా గుప్తా, ప్రధాన్ భర్తగా రఘుబీర్ యాదవ్, ప్రహ్లాద్‌చంద్ "ప్రహ్లాద్" పాండేగా ఫైసల్ మాలిక్, వికాస్‌గా చందన్ రాయ్, రింకీగా సన్వికా, భూషణ్‌గా దుర్గేష్ కుమార్, క్రాంతి దేవిగా సునీత రాజ్వర్, ఎమ్మెల్యే చంద్ర కిషోర్ సింగ్‌గా పంకజ్ ఝా నటిస్తున్నారు.

ది వైరల్ ఫీవర్ (టీవీఎఫ్) నిర్మించిన 'పంచాయత్' సీజన్ 4ను దీపక్ కుమార్ మిశ్రా, చందన్ కుమార్ క్రియేట్ చేశారు. దీనికి చందన్ కుమార్ రచన, దీపక్ కుమార్ మిశ్రా, అక్షత్ విజయ్‌వర్గియా దర్శకత్వం వహించారు. 2019లో మొదలైన ఈ పంచాయత్ వెబ్ సిరీస్ గతేడాది వరకు మూడు సీజన్లు పూర్తి చేసుకోగా.. జూన్ 24 నుంచి ప్రైమ్ వీడియోలో నాలుగో సీజన్ స్ట్రీమింగ్ కానుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More