OTT Mystery Thriller:హాస్పిట‌ల్‌ నుంచి చిన్నారి మిస్సింగ్‌-ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్-గూస్ బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్

OTT Mystery Thriller: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఆమె లీడ్ రోల్ ప్లే చేసిన మోస్ట్ అవైటెడ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ 'షాక్: ట్రస్ట్ నో వన్' ట్రైలర్ ఇవాళ రిలీజైంది. ఈ ట్రైలర్ చూస్తే సిరీస్ లో థ్రిల్ వేరే లెవల్ లో ఉండబోతుందని అర్థమవుతోంది.

Published on: Sep 10, 2026, 13:15:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Mystery Thriller: బాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి పరిణీతి చోప్రా ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తొలి వెబ్ సిరీస్ 'షాక్: ట్రస్ట్ నో వన్' (Shaque: Trust No One) ట్రైలర్ ఇవాళ (సెప్టెంబర్ 10) రిలీజైంది.

హాస్పిట‌ల్‌ నుంచి చిన్నారి మిస్సింగ్‌-ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్-గూస్ బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్ (x)
హాస్పిట‌ల్‌ నుంచి చిన్నారి మిస్సింగ్‌-ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్-గూస్ బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్ (x)

షాక్ ట్రస్ట్ నో వన్ ట్రైలర్

పరిణీతి చోప్రా ఓటీటీ డెబ్యూపై మంచి హైప్ ఉంది. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచేలా షాక్ ట్రస్ట్ నో వన్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది. ఇందులోని ట్విస్ట్ లు ఓటీటీ ఆడియన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ అందించేలా కనిపిస్తున్నాయి.

కథ ఏమిటంటే?

ఒక తల్లి (పరిణీతి చోప్రా) హాస్పిటల్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిస్తుంది. కానీ ఆ హాస్పిటల్ బెడ్ పై నుంచి ఆ చిన్నారిని ఎవరో ఎత్తుకెళ్తారు. దీంతో తన బిడ్డ కావాలని ఆ తల్లి పోరాటం కొనసాగిస్తుంది. ఆ కిడ్నాపర్ తాను ఎత్తుకెళ్లిన పాప ఫొటోలను ఈ పేరెంట్స్ పంపిస్తాడు.

ఆ చిన్నారికి అపేక్ష అని పేరు పెట్టుకుంటారు. బిడ్డ కోసం పిచ్చిదానిలా మారిపోయిన ఆ తల్లికి కనిపించిన పిల్లలను తన పాప అనే అనుకుంటుంది. మధ్యలో రియాలిటీకి, ఇమాజినేషన్ కు తేడా తెలియకుండా పోతుందని ఆ తల్లికి డాక్టర్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు.

మరి ఆ పాప దొరికిందా? ఆ తల్లి 9 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కిందా? మధ్యలో వచ్చే చేతబడి కథ ఏంటీ? అనేది షాక్ వెబ్ సిరీస్ లో చూసి తెలుసుకోవాల్సిందే.

ఉత్కంఠ రేపేలా

ఒక తల్లి తన తొమ్మిదేళ్ల క్రితం మిస్సయిన బిడ్డ కోసం చేసే నిరంతర పోరాటం, అన్వేషణల చుట్టూ ఈ సిరీస్ కథనం సాగుతుంది. నమ్మకానికి, అనుమానానికి మధ్య ఉండే సన్నని గీతను, మాతృత్వంలోని ఎమోషనల్ అండ్ ఆబ్సెసివ్ కోణాలను దర్శకుడు అత్యంత ఉత్కంఠభరితంగా ఆవిష్కరించారు.

బిడ్డ ఆచూకీకి సంబంధించిన ఆధారాలు లభిస్తున్న కొద్దీ, తన చుట్టూ ఉన్న సొంత మనుషులనే అనుమానించాల్సిన పరిస్థితి ఆ తల్లికి ఎదురవుతుంది. నిజం ఏంటి, అబద్ధం ఏంటి అనే సస్పెన్స్‌తో ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని నిలబెట్టేలా తీర్చిదిద్దారు.

ఓటీటీ రిలీజ్ డేట్

ఈ ఉత్కంఠభరితమైన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ సెప్టెంబర్ 24 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రఖ్యాత దర్శకులు రెన్సిల్ డిసిల్వా, సిద్ధార్థ్ పి. మల్హోత్రాలు సంయుక్తంగా క్రియేట్ చేసిన ఈ సిరీస్‌ను ఆల్కెమీ ఫిల్మ్స్ నిర్మించింది.

ఇటీవలి కాలంలో ఓటీటీ వీక్షకులలో మిస్సింగ్ చైల్డ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్లకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌పై వచ్చే డార్క్ మిస్టరీ సిరీస్‌లు అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయి. కుర్బాన్, 24 వంటి పవర్‌ఫుల్ థ్రిల్లర్స్ అందించిన డైరెక్టర్ రెన్సిల్ డిసిల్వా ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేయడం పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More