తెలుగులో మరో వెరైటీ లవ్ స్టోరీ రాబోతోంది. ఈ సినిమా పేరు పతంగ్ (Patang). అందరూ కొత్త నటీనటులతో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ సోమవారం (డిసెంబర్ 15) రిలీజ్ కాగా.. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఆసక్తి రేపేలా సాగింది. ఈ రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కానుంది.
పతంగ్ ట్రైలర్ రిలీజ్

ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్.. మధ్యలో ఓ అమ్మాయి.. ఆమె కోసం ఆ ఇద్దరూ శత్రువులుగా మారి కొట్టుకోవడం. ఈ స్టోరీ కొత్తదేమీ కాదు. కానీ దీనికి పతంగుల కాంపిటిషన్ ను జోడించి వెరైటీగా ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీని తీసుకొస్తున్నాడు డైరెక్టర్ ప్రణీత్ ప్రత్తిపాటి. ఒకే అమ్మాయి కోసం పోటీ పడే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ల మధ్య ఆ అమ్మాయి కోసం సాగే పతంగుల పోటీ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలపనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ వెరైటీ కాన్సెప్ట్ తో ఈ మూవీ వస్తోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి కైట్ కాంపిటీషన్ ను జోడించి తీసుకొస్తున్నారు. ట్రైలర్ మొత్తం నవ్వులు పూయించేలా సాగింది. కొత్త నటీనటులైనా చాలా సహజంగా వాళ్ల నటన, డైలాగులు ఉన్నాయి. ఇదే సినిమాపై ఆసక్తి రేపుతోంది. ట్రైలర్ వెంటనే యూత్ ఆడియెన్స్ ను ఆకర్షించడానికి ఇదే కారణం.
పతంగ్ మూవీ గురించి..
పతంగ్ సినిమాలో ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ లీడ్ రోల్స్ లో నటించారు. ప్రణీత్ ప్రత్తిపాటి డైరెక్ట్ చేశాడు. చిన్నప్పటి నుంచీ ముస్తాఫా ముస్తాఫా అంటూ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఎదిగిన ఇద్దరు వ్యక్తులు.. ఓ అమ్మాయి తమ జీవితంలోకి వచ్చిన తర్వాత బద్ధ శత్రువులుగా ఎలా మారారన్న కథకు ఫన్, కైట్ కాంపిటీషిన్ జోడించి తీసుకొస్తున్న సినిమాయే ఈ పతంగ్.
ఈ సినిమాలో లీడ్ రోల్స్ తోపాటు అను హసన్, ఎస్పీ చరణ్, వడ్లమాని శ్రీనివాస్, విష్ణు ఓయ్, శివనారాయణ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇక గౌతమ్ వాసుదేవ్ మేనన్, ఎస్ఎస్ కంచి అథితి పాత్రల్లో కనిపించనుండటం విశేషం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సమర్పిస్తున్నాడు. క్రిస్మస్ వీకెండ్ కు వస్తుండటం, ట్రైలర్ ఆసక్తి రేపేలా ఉండటంతో ఈ పతంగ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర తన మార్క్ చూపిస్తుందని భావిస్తున్నారు.
{{/usCountry}}ఈ సినిమాలో లీడ్ రోల్స్ తోపాటు అను హసన్, ఎస్పీ చరణ్, వడ్లమాని శ్రీనివాస్, విష్ణు ఓయ్, శివనారాయణ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇక గౌతమ్ వాసుదేవ్ మేనన్, ఎస్ఎస్ కంచి అథితి పాత్రల్లో కనిపించనుండటం విశేషం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సమర్పిస్తున్నాడు. క్రిస్మస్ వీకెండ్ కు వస్తుండటం, ట్రైలర్ ఆసక్తి రేపేలా ఉండటంతో ఈ పతంగ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర తన మార్క్ చూపిస్తుందని భావిస్తున్నారు.
{{/usCountry}}