ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అతని తల్లి సువర్ణలత కన్నుమూశారు. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఎక్స్ అకౌంట్‌లో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 86 ఏళ్ల వయసున్న సువర్ణలత గత కొంతకాలంగా వయసు పైబడటం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
పవన్ కళ్యాణ్, విష్ణు వర్ధన్ రెడ్డి సంతాపం..

ఈ వార్త విన్న వెంటనే పవన్ కళ్యాణ్ తన ఎక్స్ అకౌంట్‌లో స్పందిస్తూ.. "ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ గారి మాతృమూర్తి శ్రీమతి సువర్ణలత గారు శివైక్యం చెందారనే విషయం తెలిసి నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మాతృ వియోగంతో బాధపడుతున్న ప్రకాష్ రాజ్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని రాసుకొచ్చారు.
అలాగే మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి కూడా రియాక్ట్ అవుతూ.. "ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ గారి తల్లి సువర్ణలత గారు కన్నుమూశారనే వార్త విని నేను చాలా బాధపడ్డాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఈ కష్ట సమయంలో ప్రకాష్ రాజ్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను" అని పోస్ట్ చేశారు.
తల్లి ఆరోగ్యంపై ప్రకాష్ రాజ్
తన తల్లి ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల గురించి ప్రకాష్ రాజ్ గతంలోనే చాలా ఓపెన్‌గా మాట్లాడాడు. ఆమెకు బ్రెయిన్‌లో ఒక సిస్ట్ (కణితి) ఉండటంతో సర్జరీ చేయాల్సి వచ్చిందని అతడు చెప్పాడు. ఆ సర్జరీ తర్వాత ఆమెకు సివియర్ మెమరీ లాస్ వచ్చిందని, కనీసం అత్యంత సన్నిహితులైన ఫ్యామిలీ మెంబర్స్‌ను కూడా గుర్తుపట్టలేని పరిస్థితికి వెళ్లిపోయారని అతడు ఎంతో ఎమోషనల్ అయ్యాడు.
2018లో జరిగిన ఇంటర్నేషనల్ సింపోజియం ఆన్ డిమెన్షియా ప్రోగ్రామ్‌లో అతడు మాట్లాడుతూ.. "కొన్ని నెలల క్రితం నేను ఒక సినిమాలో అల్జీమర్స్ పేషెంట్ రోల్ చేయాల్సి వచ్చింది. దానికోసం నేను నైటింగేల్స్ సెంటర్‌కు వెళ్లి కొన్ని గంటలు గడిపాను. సరిగ్గా అలాంటి పరిస్థితే మా అమ్మకు కూడా ఎదురైంది. ఆమె అల్జీమర్స్ పేషెంట్ కాదు కానీ, ఆమె బ్రెయిన్‌లో ఒక సిస్ట్ ఉండింది. సర్జరీ జరిగిన మూడు రోజులకే ఆమె తన సొంత చెల్లెలిని, కొడుకును కూడా మర్చిపోయింది. మా అమ్మ అన్నీ మర్చిపోయిందనే ఆలోచనే నన్ను వణికేలా చేసింది. ఆమెకు గతం గుర్తుకు రావాలని వాళ్ల పాత స్కూల్ ఫ్రెండ్స్‌ను పిలిపించి మాట్లాడించేవాడిని" అని తన మనసులోని బాధను అందరితో పంచుకున్నాడు.
ప్రకాష్ రాజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇవే..
{{/usCountry}}2018లో జరిగిన ఇంటర్నేషనల్ సింపోజియం ఆన్ డిమెన్షియా ప్రోగ్రామ్‌లో అతడు మాట్లాడుతూ.. "కొన్ని నెలల క్రితం నేను ఒక సినిమాలో అల్జీమర్స్ పేషెంట్ రోల్ చేయాల్సి వచ్చింది. దానికోసం నేను నైటింగేల్స్ సెంటర్‌కు వెళ్లి కొన్ని గంటలు గడిపాను. సరిగ్గా అలాంటి పరిస్థితే మా అమ్మకు కూడా ఎదురైంది. ఆమె అల్జీమర్స్ పేషెంట్ కాదు కానీ, ఆమె బ్రెయిన్‌లో ఒక సిస్ట్ ఉండింది. సర్జరీ జరిగిన మూడు రోజులకే ఆమె తన సొంత చెల్లెలిని, కొడుకును కూడా మర్చిపోయింది. మా అమ్మ అన్నీ మర్చిపోయిందనే ఆలోచనే నన్ను వణికేలా చేసింది. ఆమెకు గతం గుర్తుకు రావాలని వాళ్ల పాత స్కూల్ ఫ్రెండ్స్‌ను పిలిపించి మాట్లాడించేవాడిని" అని తన మనసులోని బాధను అందరితో పంచుకున్నాడు.
ప్రకాష్ రాజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇవే..
{{/usCountry}}ఇక ప్రకాష్ రాజ్ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్‌గా హిందీలో వచ్చిన 'తేరే ఇష్క్ మే' సినిమాలో ధనుష్ ఫాదర్ క్యారెక్టర్‌లో అతడు కనిపించాడు. తర్వాత దళపతి విజయ్ హీరోగా వస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా 'జన నాయగన్' సినిమాలో కూడా అతడు ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు.
యాక్టర్‌గా విజయ్‌కి ఇదే లాస్ట్ రిలీజ్ కావడం విశేషం. నిజానికి ఈ సినిమా ఈ నెల మొదట్లోనే రిలీజ్ అవ్వాల్సింది. కానీ సెన్సార్‌షిప్ ఇష్యూస్ వల్ల వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు.