కంగ్రాట్యులేషన్స్.. పార్టీ పెట్టినాక మెుదటి ఎన్నికల్లోనే విజయ్ విక్టరీపై పవన్ కళ్యాణ్ పోస్ట్
TVK Vijay : తమిళనాడులో టీవీకే విజయ్ గెలుపుతో సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పార్టీ స్థాపించిన కొద్ది కాలంలోనే విజయం సాధించిన విజయ్ దళపతిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త సంచలనాన్ని సృష్టించాయి. ఈ ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ స్పందిస్తూ ఓటర్ల చైతన్యాన్ని కొనియాడారు. ఇదే సమయంలో దళపతి విజయ్ సాధించిన అద్భుత విజయంపై సినీ లోకం కూడా ప్రశంసల జల్లు కురిపిస్తోంది.

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాల్లో మరోసారి ఓటర్ల చైతన్యం స్పష్టంగా కనిపించిందని పవన్ కల్యాణ్ అన్నారు. 'పాలన నచ్చితే మళ్లీ మళ్లీ గెలిపిస్తారని.. నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారనడానికి ఈ ఫలితాలే చక్కటి ఉదాహరణ.' అని పవన్ పేర్కొన్నారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారని ఆయన విశ్లేషించారు.
పశ్చిమ బెంగాల్‌లో భాజపా విజయం వెనుక ప్రధాని మోదీ, అమిత్ షా ల అకుంఠిత దీక్ష ఉందని పవన్ కొనియాడారు. ఇక తమిళనాడులో టీవీకే (TVK) విజయ్ సాధించిన విజయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే ప్రజల మద్దతు కూడగట్టిన విజయ్‌ని పవన్ అభినందించారు.
విజయ్ రాజకీయ విజయంతో కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 'మొదట అనుమానించారు.. ఇప్పుడు కిరీటం దక్కింది. మన ఇంటి దగ్గర (ఏపీ) జరిగింది, ఇప్పుడు పక్క ఇంట్లోనూ (తమిళనాడు) రిపీట్ అయ్యింది. అది అబ్సల్యూట్ సినిమా!' అని నేచురల్ స్టార్ నాని ట్వీట్ చేస్తూ అభినందించారు.
'తొలి ప్రయత్నంలోనే ఇంతటి ప్రభావం చూపిన విజయ్ సార్‌కి అభినందనలు. సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ప్రజలకు సేవ చేయడం గర్వంగా ఉంది.' అని శివ కార్తికేయన్ పేర్కొన్నారు.
'ఈ అద్భుతమైన, ఘనమైన విజయం సాధించిన విజయ్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ క్షణం మీ దార్శనికతకు, మీ పట్టుదలకు, మరియు మీపై ప్రజలకు ఉన్న అచంచలమైన ప్రేమకు నిజమైన నిదర్శనం. తమిళనాడు ప్రజలు తమ తీర్పును బిగ్గరగా, స్పష్టంగా, అపారమైన గర్వంతో వెల్లడించారు. ఇది కేవలం ఒక విజయం మాత్రమే కాదు, లక్షలాది మందితో ఉన్న మీ లోతైన, శక్తివంతమైన అనుబంధానికి జరుపుకొనే వేడుక. మీరు ఈ స్ఫూర్తిదాయకమైన కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్నప్పుడు మీకు గొప్ప శక్తి, విజయం కలగాలని ఆకాంక్షిస్తున్నాం. ఎంతో మంది ఆశిస్తున్న మార్పును మీరు తీసుకురావాలని ఆశిస్తున్నాం. ఈ అద్భుతమైన విజయానికి మరోసారి అభినందనలు!' అని కాజల్ అగర్వాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
విజయ్ సాధించిన చారిత్రాత్మక విజయం పట్ల తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ దళపతికి శుభాకాంక్షలు తెలిపారు చియాన్ విక్రమ్, సూర్య, ధనుష్. విజయ్ దేవరకొండ, సాయి ధరమ్ తేజ్, నిఖిల్ వంటి యువ నటులు కూడా "జననాయగన్ (ప్రజా నాయకుడు)" అంటూ విజయ్‌ని ట్యాగ్ చేస్తూ తమిళ రాజకీయాల్లో కొత్త శకం మొదలైందని కొనియాడారు. మొత్తంమీద విజయ్ విజయం అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


