Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు మళ్లీ అస్వస్థత.. ఆసుపత్రిలో పరీక్షలు.. ఎట్ హోమ్ కార్యక్రమానికి దూరం
Pawan Kalyan Health: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం రాజ్‌భవన్ లో జరిగే ప్రతిష్టాత్మక “ఎట్ హోమ్” కార్యక్రమానికి పవన్ దూరమయ్యారు.
Pawan Kalyan Health: ఏపీ డిప్యూటీ సీఎం, స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కు వరుస ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఇటీవల కుడి భుజానికి సర్జరీ చేయించుకున్న ఆయన మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం బారిన పడ్డారు. దీంతో భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా షెడ్యూల్ చేసిన ఈవెంట్లను క్యాన్సిల్ చేసుకున్నారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఇవాళ (ఆగస్టు 15) పవన్ కళ్యాణ్ కాకినాడలోని పరేడ్ మైదానంలో భార స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్నారు. అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాసేపు అక్కడే గడిపారు.
పవన్ కళ్యాణ్ కు జ్వరం
కాకినాడలో కార్యక్రమం ముగించుకుని పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం వెళ్లారు. అక్కడ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో జ్వరం తీవ్రత పెరగడంతో కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపివేశారు.
వైద్య పరీక్షలు
రాజమహేంద్రవరంలో వైద్య నిపుణులు పవన్ కళ్యాణ్ ను పరీక్షించారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో తన కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఆనవాయితీగా నిర్వహించే ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి కూడా ఆయన దూరం కానున్నారు. జ్వరం కొంత తగ్గగానే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ బయలుదేరనున్నారు.
భుజం శస్త్రచికిత్స
పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ఇటీవల శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. వరుస రాజకీయ పర్యటనలు, అధికారిక సమీక్షలు, స్వాతంత్య్ర దినోత్సవ బిజీ షెడ్యూల్ వల్ల ఆయనకు తగినంత విశ్రాంతి లభించలేదు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ చేరుకున్న వెంటనే భుజం శస్త్రచికిత్స అనంతర ఫిజియోథెరపీ ప్రోటోకాల్‌పై నిపుణులైన వైద్యుల సలహాలు స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్.
తీవ్ర జ్వరం, శస్త్రచికిత్స తర్వాతి అలసట వల్ల రాబోయే 2-3 రోజుల పాటు ఆయన తన అధికారిక సమీక్షలు, పాలనా పరమైన భేటీలను వాయిదా వేసుకునే అవకాశం ఉంది.
సినిమాలు ఎప్పుడు?
కంటిన్యూయస్ పొలిటికల్ షెడ్యూల్స్, ప్రభుత్వ బాధ్యతలతో పాటు సర్జరీ తర్వాతి రికవరీ కాలంలో సరైన విశ్రాంతి లేకపోవడమే పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ప్రభావం చూపింది. స్వల్ప విరామం అనంతరం ఆయన తిరిగి కోలుకుని పాలనా వ్యవహారాల్లో క్రియాశీలకం కానున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ నుంచి నెక్ట్స్ సినిమా ఎప్పుడు వస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో ఓజీ 2 పట్టాలెక్కాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ కు అరోగ్యం పరంగా సవాళ్లు ఎదురవుతున్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


