Pawan Kalyan Son: నా కొడుకు ఆ రోజు చనిపోయేవాడే.. ఇది మాకు చాలా ఎమోషనల్ డే: పవన్ కళ్యాణ్ భార్య అన్నా పోస్ట్

Pawan Kalyan Son: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా అకిరా నందన్ పుట్టినరోజుతో పాటు మార్క్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న క్షణాలను అన్నా లెజినోవా గుర్తుచేసుకుంది.

Published on: Apr 8, 2026, 16:03:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Pawan Kalyan Son: నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబానికి నేడు (ఏప్రిల్ 8) అత్యంత భావోద్వేగపూరితమైన రోజు. పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకిరా నందన్ నేడు తన 22వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అయితే అదే సమయంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా పవన్ భార్య అన్నాలెజినోవా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విషయాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.

Pawan Kalyan Son: నా కొడుకు ఆ రోజు చనిపోయేవాడే.. ఇది మాకు చాలా ఎమోషనల్ డే: పవన్ కళ్యాణ్ భార్య అన్నా పోస్ట్
Pawan Kalyan Son: నా కొడుకు ఆ రోజు చనిపోయేవాడే.. ఇది మాకు చాలా ఎమోషనల్ డే: పవన్ కళ్యాణ్ భార్య అన్నా పోస్ట్

అకిరాకు శుభాకాంక్షలు.. మార్క్ కు 'రెండో పుట్టినరోజు'

తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్‌లో అన్నా తన ఇద్దరు కుమారుల గురించి ప్రస్తావించింది. "నేడు మా కుటుంబానికి చాలా ఎమోషనల్ డే. అకిరా పుట్టినరోజు.. తను ఎదుగుతున్న తీరు చూస్తుంటే గర్వంగా ఉంది. అదే సమయంలో సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజు అగ్నిప్రమాదంలో మార్క్ ప్రాణాలు కోల్పోయేవాడే. ఈ రోజు మార్క్ కు ఇది రెండో పుట్టినరోజు లాంటిది" అని ఆమె రాసుకొచ్చింది.

సింగపూర్ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి

గతేడాది ఏప్రిల్ 8న సింగపూర్‌లోని రివర్ వ్యాలీ రోడ్‌లో ఒక షాప్‌హౌస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సమ్మర్ క్యాంప్‌లో ఉన్న మార్క్ సహా పలువురు చిన్నారులు ఇందులో తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ అన్నా భయంకరమైన నిజాలను బయటపెట్టారు. "ప్రమాదం జరిగి ఏడాది గడిచినా విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. 10 ఏళ్ల చిన్నారి ఫ్రేయా ప్రాణాలు కోల్పోవడానికి, 18 మంది చిన్నారులు ఆసుపత్రి పాలవడానికి కారణమెవరో మాకు ఇంకా తెలియలేదు. కొందరికి ఇప్పటికీ సర్జరీలు అవసరమవుతున్నాయి" అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

"మార్క్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే.."

ప్రమాదం జరిగిన సమయంలో మార్క్ ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని అన్నా వెల్లడించింది. "దేవుడి దయ వల్ల మార్క్ బతికాడు. ఆసుపత్రిలో మార్క్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే పక్కనే కూర్చుని నేను పడ్డ వేదన ఏ తల్లికీ రాకూడదు. నేడు మార్క్ ఆరోగ్యంగా మా మధ్య ఉండటమే మాకు అన్నింటికంటే ముఖ్యం" అని ఆమె పేర్కొంది.

ఆ సమయంలో ఫైర్ ఫైటర్లు రాకముందే 15 మంది చిన్నారులను రక్షించిన నిర్మాణ కార్మికులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఇంటి వద్ద అగ్నిమాపక పరికరాలు ఉంచుకోవాలని అందరికీ సూచించింది.

గతేడాది మార్క్ ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతో అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు రేణు దేశాయ్ ద్వారా అకిరా నందన్, ఆద్య.. అన్నా లెజినోవా ద్వారా పోలెనా అంజనా, మార్క్ శంకర్ అనే నలుగురు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: మార్క్ శంకర్ పవనోవిచ్‌కు అగ్నిప్రమాదం ఎప్పుడు జరిగింది?

జవాబు: ఏప్రిల్ 8, 2025న సింగపూర్‌లోని ఒక సమ్మర్ క్యాంప్‌లో మార్క్ ఉన్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.

ప్రశ్న: మార్క్ శంకర్ ప్రస్తుత పరిస్థితి ఏమిటి?

జవాబు: ప్రమాదం జరిగిన సమయంలో అతని ఊపిరితిత్తులు దెబ్బతిన్నప్పటికీ, ఏడాది చికిత్స అనంతరం ప్రస్తుతం మార్క్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు.

ప్రశ్న: అకిరా నందన్ వయస్సు ఎంత?

జవాబు: అకిరా నందన్ నేడు (ఏప్రిల్ 8, 2026) తన 22వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More