...
...
Next Story

Collar Ey Etthara Song promo: కాలర్ ఎత్తిన పవన్ కల్యాణ్.. ఉస్తాద్ భగత్ సింగ్ థర్డ్ సింగిల్ ప్రోమో రిలీజ్.. అదిరింది

Collar Ey Etthara Song promo: పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి థర్డ్ సింగిల్ కాలరే ఎత్తరా సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. మాస్ బీట్, స్టెప్స్ తోపాటు పవన్ ఫ్యాన్స్ కాలరెగరేసేలా ఈ సాంగ్ ఉండబోతున్నట్లు ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది.

Published on: Mar 10, 2026 05:11 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh). ఉగాది పండుగ కానుకగా ఈ భారీ బడ్జెట్ మూవీ మార్చి 19న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ కాలరే ఎత్తరా సాంగ్ ప్రోమోను మంగళవారం రిలీజ్ చేశారు.

'కాలరే ఎత్తరా'.. మాస్ ట్రీట్ మొదలైంది

Collar Ey Etthara Song promo: కాలర్ ఎత్తిన పవన్ కల్యాణ్.. ఉస్తాద్ భగత్ సింగ్ థర్డ్ సింగిల్ ప్రోమో రిలీజ్.. అదిరింది
Collar Ey Etthara Song promo: కాలర్ ఎత్తిన పవన్ కల్యాణ్.. ఉస్తాద్ భగత్ సింగ్ థర్డ్ సింగిల్ ప్రోమో రిలీజ్.. అదిరింది

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి కాలరే ఎత్తరా అంటూ థర్డ్ సింగిల్ రానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన పవర్‌ఫుల్ బీట్స్, పవన్ కల్యాణ్ ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ ప్రోమో ఫ్యాన్స్‌కు ఒక ఊరమాస్ ట్రీట్ ఇస్తోంది.

థియేటర్లలో ఫ్యాన్స్ పవన్ కల్యాణ్ నుంచి ఎలాంటి ఎలివేషన్స్ కోరుకుంటారో, డైరెక్టర్ హరీష్ శంకర్ కరెక్ట్‌గా అదే ఇచ్చినట్లు ఈ ప్రోమో చూస్తే ఇట్టే అర్థమవుతోంది. ఈ ఎనర్జిటిక్ మాస్ సాంగ్‌ను సింగర్ రామ్ మిరియాల పాడగా, స్టార్ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ అద్భుతమైన సాహిత్యం అందించాడు.

ఈ పాట పూర్తి లిరికల్ ట్రాక్‌ను మార్చి 12 సాయంత్రం 5 గంటలకు మేకర్స్ అఫీషియల్‌గా రిలీజ్ చేయనున్నారు.

“సౌండ్ పెంచండి.. డ్యాన్స్ మొదలుపెట్టండి.. ఎత్తర ఎత్తర కాలరే ఎత్తర.. ఉస్తాద్ భగత్ సింగ్ థర్డ్ సింగిల్ కాలరే ఎత్తరా సాంగ్ ప్రోమో వచ్చేసింది.. పూర్తి పాట మార్చి 12న సాయంత్రం 5 గంటలకు.. రాక్ స్టార్ డీఎస్పీ మ్యూజిక్.. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను రామ్ మిరియాల పాడాడు” అనే క్యాప్షన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అధికారిక ఎక్స్ పేజీ ఈ విషయాన్ని వెల్లడించింది.

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విశేషాలు

ఇక ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. 2 గంటలు 29 నిమిషాల రన్ టైమ్ లాక్ చేశారు. దీనికి U/A సర్టిఫికెట్ ఇచ్చినట్లు మేకర్స్ వెల్లడించారు. మార్చి 19న ఉగాది సందర్భంగా ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఓజీతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న తర్వాత పవన్ నటిస్తున్న మూవీ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe