Ustaad Bhagat Singh: ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు.. ఉస్తాద్ భగత్ సింగ్ సర్ ప్రైజ్ టీజర్.. అసలు గిఫ్ట్ ఎప్పుడో?
Ustaad Bhagat Singh: పవన్ కల్యాణ్ అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి క్రేజీ సర్ ప్రైజ్ వచ్చేసింది. ట్రైలర్ కు ముందు ఫ్యాన్స్ ను ఊరించేందుకు టీజర్ రిలీజ్ అయింది.
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అదిరే సర్ ప్రైజ్ వచ్చింది. అయితే ఇది కేవలం స్టార్టర్ లాంటిదే. అసలు మీల్స్ ముందుంది. మూవీ ట్రైలర్ ను ఇంకా రిలీజ్ చేయలేదు. దీని రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. దానికంటే ముందు ట్రైలర్ టీజ్ గా ఇవాళ ఓ వీడియోను మేకర్స్ వదిలారు. పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ లుక్స్ తో ఈ వీడియో అదిరిపోయింది.

ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీజర్ రిలీజైంది. అసలైన ట్రైలర్ కు ముందు చిన్న సర్ ప్రైజ్ గా ఈ టీజర్ వచ్చేసింది. శనివారం (మార్చి 7) ఉదయం నుంచి బిగ్ అప్ డేట్ అంటూ ఊరిస్తూ వచ్చిన మేకర్స్ చివరకు రాత్రి ఈ టీజర్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో పవర్ ఫుల్ గా పవన్ కల్యాణ్ కనిపించాడు. తమన్ బీజీఎంను ఇంట్రడ్యూస్ చేసేలా ఈ వీడియోలో మ్యూజిక్ ఉంది.
భగత్ గీత
బ్యాక్ గ్రౌండ్ లో ‘ధర్మ సంరక్షణకు ప్రతి యుగాన అవతారం ఎత్తుతాను’ అని భగవద్గీత ప్లే అవుతుండగా పవర్ ఫుల్ యాక్షన్ తో కార్లో హీరో ఎంట్రీ ఉంది. కౌబాయ్ గెటప్ లో పవన్ లుక్ అదిరిపోయింది. ‘ఇందాక విన్నది భగవద్గీత. ఇది భగత్ గీత. దమ్మున్నోడు దాటొచ్చు’ అని పవన్ డైలాగ్ వేరే లెవల్ గా ఉంది. ఆ తర్వాత ఫైటింగ్ సీన్స్ తో వీడియో కొనసాగింది.
ట్రైలర్ కమింగ్ సూన్
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ట్రైలర్ టీజ్ అంటూ ఓ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్ మాత్రం కమింగ్ సూన్ అంటూ పేర్కొన్నారు. మరి ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడు వస్తుందనే దానిపై క్లారిటీ లేదు. ఈ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ అప్ కమింగ్ యాక్షన్ థ్రిల్లర్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మార్చి 19, 2026న రిలీజ్ కానుంది. ఉగాది సందర్భంగా థియేటర్లకు రానుంది. ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. తమన్ బీజీఎం అందిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఓజీ సక్సెస్ తో జోష్ లో ఉన్న పవన్ కల్యాణ్.. ఉస్తాద్ భగత్ సింగ్ తో జోరు కొనసాగిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


