Anna Konidala: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భార్య అన్నా కొణిదెల చేసిన లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. తన పేరు విషయంలో మీడియా, నెటిజన్లు పదే పదే చేస్తున్న ఒక పెద్ద పొరపాటుపై ఆమె స్పందిస్తూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

తనను అందరూ ఇప్పటికీ 'అన్నా లేజ్నెవా' అని పిలవడంపై ఆమె స్పష్టత ఇచ్చారు. తన పుట్టినరోజు త్వరలోనే రాబోతున్న సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా చెప్పడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
"నా పెళ్లి రోజే ఇంటి పేరు మారిపోయింది!"
సోషల్ మీడియాలో అన్నా కొణిదెల స్పందిస్తూ.. "ఒక వ్యక్తికి పేరు అనేది చాలా పర్సనల్ విషయం. నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ప్రారంభించినప్పటి నుంచి ఈ విషయం చెప్పాలనుకుంటున్నా. చాలాసార్లు రాసి డిలీట్ చేశా. ఇప్పుడు నా బర్త్‌డే రాబోతున్న వేళ ఓపెన్‌గా చెప్తున్నా. మా పెళ్లి వార్తలు బయటకు వచ్చినప్పుడు నన్ను అందరూ అన్నా లేజ్నెవాగానే గుర్తించారు" అని రాసుకొచ్చారు.
అయితే తమ వివాహ ధ్రువీకరణ పత్రంలో మాత్రమే ఆ పేరు చివరిసారిగా కనిపిస్తుందని ఆమె తెలిపారు. "మా పెళ్లి జరిగిన ఆరోజే నేను నా భర్త ఇంటి పేరును స్వీకరించి అన్నా కొణిదెలగా మారాను. ఇప్పటివరకు ఈ పోస్ట్ చదివిన వారందరికీ నాదొక చిన్న విన్నపం. దయచేసి నన్ను అన్నా కొణిదెల అని మాత్రమే పిలవండి. అది నా పేరు, ఆ పేరులోనే నేను కంప్లీట్‌గా ఫీలవుతున్నా" అని ఎమోషనల్ అయ్యారు.
రష్యా ట్రిప్ జ్ఞాపకాలు.. పవన్ కళ్యాణ్‌తో స్పెషల్ ఫోటో
ఈ ఎమోషనల్ పోస్ట్‌తో పాటు పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఒక బ్యూటిఫుల్ ఫోటోను కూడా ఆమె షేర్ చేశారు. తామిద్దరం కలిసి రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరానికి వెళ్లిన మొదటి ట్రిప్‌లో ఈ పిక్ తీశామని ఆమె క్యాప్షన్ లో జోడించారు. పవన్ కళ్యాణ్ కోటు ధరించి, బ్లాక్ సన్‌గ్లాసెస్‌తో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుండగా, ఆయన పక్కన అన్నా కొణిదెల నవ్వుతూ కనిపించారు.
{{/usCountry}}ఈ ఎమోషనల్ పోస్ట్‌తో పాటు పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఒక బ్యూటిఫుల్ ఫోటోను కూడా ఆమె షేర్ చేశారు. తామిద్దరం కలిసి రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరానికి వెళ్లిన మొదటి ట్రిప్‌లో ఈ పిక్ తీశామని ఆమె క్యాప్షన్ లో జోడించారు. పవన్ కళ్యాణ్ కోటు ధరించి, బ్లాక్ సన్‌గ్లాసెస్‌తో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుండగా, ఆయన పక్కన అన్నా కొణిదెల నవ్వుతూ కనిపించారు.
{{/usCountry}}ఈ పిక్ చూసిన మెగా ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు. పోస్ట్ పెట్టిన కొద్ది గంటల్లోనే 60 వేలకు పైగా లైకులు, వేలాది కామెంట్లు వచ్చాయి. "ఖచ్చితంగా వదినమ్మ.. ఇకపై మిమ్మల్ని అన్నా కొణిదెల అనే పిలుస్తాం" అంటూ జనసేన సైనికులు, పవన్ ఫ్యాన్స్ కామెంట్ల రూపంలో తమ మద్దతు తెలుపుతున్నారు.
పిఠాపురం నుంచి డిప్యూటీ సీఎం వరకు.. అన్నా కొణిదెల సపోర్ట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక విజయం సాధించి, ఏపీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రచారంలో, అలాగే జనసేన విజయవంతమైన సందర్భాల్లో అన్నా కొణిదెల ఆయన వెంటే ఉంటూ పూర్తి సపోర్ట్ అందించారు. అన్నా కొణిదెల చేసిన ఈ పర్సనల్ అప్‌డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మెగా ఫ్యాన్స్ అందరూ ఆమెకు ముందస్తు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు.