...
...
Next Story

Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేది ఆ రోజే.. అనౌన్స్‌మెంట్ పోస్టర్ అదుర్స్.. అతని స్టోరీ చాలా స్పెషల్ అంటూ..

Peddi Trailer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా 'పెద్ది' విడుదలకు సర్వం సిద్ధమైంది. జూన్ 4న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ట్రైలర్ డేట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

Published on: May 11, 2026 06:11 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Peddi Trailer: మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'పెద్ది' (PEDDI) ప్రపంచవ్యాప్త విడుదలకు ముహూర్తం ఖరారైంది. వైవిధ్యమైన కథాంశంతో, పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

మే 18న పెద్ది ట్రైలర్ బ్లాస్ట్

Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేది ఆ రోజే.. అనౌన్స్‌మెంట్ పోస్టర్ అదుర్స్.. అతని స్టోరీ చాలా స్పెషల్ అంటూ..
Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేది ఆ రోజే.. అనౌన్స్‌మెంట్ పోస్టర్ అదుర్స్.. అతని స్టోరీ చాలా స్పెషల్ అంటూ..

సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అత్యంత కీలకమైన 'పెద్ది' థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

"ఈ కథ చాలా ప్రత్యేకమైనది.. 'పెద్ది' మీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు" అని మేకర్స్ పేర్కొన్నారు. రామ్ చరణ్ ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారని, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

“అతని స్టోరీ చాలా స్పెషల్.. పెద్ది ట్రైలర్ మే 18 నుంచి” అనే క్యాప్షన్ తో మరో ట్వీట్ కూడా చేశారు.

జూన్ 4న గ్రాండ్ రిలీజ్

ఈ భారీ చిత్రాన్ని జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న మెగా అభిమానుల కోసం జూన్ 3వ తేదీనే భారీ ఎత్తున ప్రీమియర్ షోలను ప్లాన్ చేశారు. అంటే ఒక రోజు ముందే 'పెద్ది' మానియా బాక్సాఫీస్ వద్ద మొదలుకాబోతోంది. చరణ్ కెరీర్‌లోనే ఇది ఒక ల్యాండ్‌మార్క్ మూవీగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పెద్ది స్టోరీ ఏంటి?

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మే 18న రాబోతున్న ట్రైలర్ తో సినిమాపై ఉన్న హైప్ మరో స్థాయికి చేరుకోవడం ఖాయం. గేమ్ ఛేంజర్ బోల్తా పడిన తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు జూన్ 4 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

  1. 'పెద్ది' సినిమా ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుంది?

రామ్ చరణ్ 'పెద్ది' సినిమా అధికారిక ట్రైలర్ మే 18వ తేదీన విడుదల కానుంది.

2. పెద్ది సినిమా విడుదల తేదీ ఎప్పుడు?

ఈ చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతుంది. జూన్ 3న అమెరికా, ఇతర ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తారు.

3. పెద్ది సినిమా స్పెషాలిటీ ఏంటి?

ఇది రామ్ చరణ్ కెరీర్ లో ఒక ప్రత్యేకమైన యాక్షన్ డ్రామా. చిత్ర యూనిట్ చెబుతున్న ప్రకారం, ఈ కథ ప్రేక్షకుల హృదయాలకు చాలా దగ్గరగా ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe