...
...
Next Story

Podarillu November 18 Episode: పొదరిల్లు.. విడాకులు ఇవ్వడానికి చక్రి రెడీ.. మహాకు సూపర్ షాక్..కోర్టు కౌన్సిలింగ్‌లో గొడవ

Podarillu Serial November 18th Episode: పొదరిల్లు సీరియల్ నవంబర్ 18 ఎపిసోడ్ లో మహాకు విడాకులు ఇవ్వడానికి చక్రి కూడా సిద్ధపడతాడు. ఇదే విషయంలో ఇంట్లో చెబితే నారాయణ తిడతాడు. అటు కోర్టు కౌన్సిలింగ్ లో ఇద్దరూ జరిగిన విషయం చెబుతారు.

Published on: Nov 18, 2026, 08:14:33 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. చక్రి మనసు విరగ్గొట్టేలా మాట్లాడిన మహా.. అతన్ని విడాకుల కౌన్సిలింగ్ కు రావాల్సిందే అని చెబుతుంది. దీంతో చేసేది లేక కౌన్సిలింగ్ కు వెళ్లిన చక్రి.. విడాకులు ఇస్తానని స్పష్టం చేస్తాడు. దీంతో మహా షాకవుతుంది.

శైలుకి క్లాస్ పీకిన కేశవ

పొదరిల్లు సీరియల్ నవంబర్ 18 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ నవంబర్ 18 ఎపిసోడ్

శైలుకి కేశవ క్లాస్ పీకే సీన్ తో సీరియల్ బుధవారం (నవంబర్ 18) ఎపిసోడ్ మొదలైంది. తన షాపుకి వరుసగా బైకులు రిపేర్ కోసం రావడం వెనుక శైలుయే ఉందని తెలుసుకున్న కేశవ.. ఆమెను తిడతాడు. దీంతో శైలు ఫీలవుతుంది. నీకోసం ఇంత చేస్తే తిడతావా అని అంటుంది. కేశవ మొత్తబడతాడు. తనకు ఓ హగ్ ఇవ్వాలని శైలు అడగడంతో ఆమెను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటాడు.

సత్యను కలిసిన కన్నా.. ప్రేమలో పడి..

ఇటు గోపిక ఫ్రెండ్ సత్యను కన్నా బస్టాప్ లో కలుస్తాడు. ఇక్కడ ఉన్నావేంటి అని కన్నా అడుగుతాడు. ఆటో కోసం చూస్తున్నా.. నీకోసం అనుకున్నావా.. నువ్వు కూడా మీ అన్నలాగా ఫ్లర్ట్ చేస్తున్నావా అని అంటుంది. మా అన్న చాలా మంచోడు.. అందుకే గోపిక అంత అడ్వాన్స్ అవుతున్నా దూరం పెట్టాడు అని కన్నా అంటాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. తర్వాత ఇద్దరం ఇక నుంచి ఫ్రెండ్స్ అని సత్య వెళ్లిపోతుంది. తర్వాత మహా వస్తుంది. కన్నా బండిపై కూర్చొని సత్య గురించి చెబుతున్నా.. ఆమె కౌన్సిలింగ్ గురించే ఆలోచిస్తూ పట్టించుకోదు.

చక్రికి క్లాస్ పీకిన మహా.. విడాకులు అంటూ..

విడాకులు ఎందుకు అని చక్రి అంటే.. మీరు మంచోళ్లు అనుకున్నాను.. మీ గురించి మీ గర్ల్‌ఫ్రెండ్స్, కారు ఫ్రెండ్స్ చెప్పింది విన్న తర్వాత కూడా మీ భార్యను అని చెప్పుకుంటే నా పరువు పోతుంది.. నాకు విడాకులు కావాల్సిందే అని మహా క్లాస్ పీకి వెళ్లిపోతుంది.

ఆలోచనలో పడ్డ చక్రి.. మాధవ, కేశవ, కన్నాలని చూసి ఫీలై..

దీంతో చక్రి ఆలోచనలో పడతాడు. ఇంట్లో అందరినీ అర్థం చేసుకున్నా.. తనను అర్థం చేసుకోవడం లేదని బాధపడతాడు. అదే సమయంలో ఇటు మాధవ, అటు కేశవ, చివరికి కన్నా కూడా తమ గర్ల్‌ఫ్రెండ్స్ తో హ్యాపీగా మాట్లాడుకోవడం చూసి చక్రి మరింత బాధపడతాడు. తనకూ ఓ భార్య ఉంది ఏం లాభం.. ఏరోజూ ప్రేమగా మాట్లాడలేదు.. కారాలు రోట్లో కాకుండా నోట్లో నూరుతుంది అనుకుంటాడు.

స్వార్థం కోసం నటించారంటూ చక్రికి మహా క్లాస్..

ఆ తర్వాత మరోసారి మహా దగ్గరికి వెళ్తాడు. ఆమె అప్పటికే పని చేస్తుండటంతో.. ఇంత రాత్రి కూడా పనేంటి.. మీ విక్కీ మరీ అంత దుర్మార్గుడా అని అడుగుతాడు. మీలాగా కాదు.. విక్కీ మంచోడు అని మహా అంటుంది. నేనేం చేశానని అడుగుతాడు చక్రి. మీ స్వార్థం కోసం నటించారు.. ఓ అమ్మాయి నిస్సహాయ స్థితిలో ఉండటం చూసి ఆధార్ కార్డు ఉన్నా లేదని చెప్పి పెళ్లి చేసుకున్నారు అని క్లాస్ పీకుతుంది. తనకు విడాకులు కావాల్సిందేనని మరోసారి స్పష్టం చేస్తుంది. దీంతో చేసేది లేక చక్రి సరే అంటాడు.

కోర్టులో కౌన్సిలింగ్‌కు చక్రి, మహా

మరుసటి రోజు ఉదయం కోర్టుకు కౌన్సిలింగ్ కోసం వెళ్తారు మహా, చక్రి. అక్కడ వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చే వ్యక్తులు ఆడ, మగ అంటూ జడ్జి ముందే వాళ్లలో వాళ్లు గొడవ పడుతుంటారు. చక్రి, మహాకు ఎవరికి వాళ్ల సపోర్ట్ చేస్తుంటారు. అసలు విడాకులు ఎందుకు కావాలని అడిగితే.. మహా తన కారణాలు తాను చెబుతుంది. అసలు తమ పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో వివరిస్తుంది. చెప్పకూడని కారణమేదైనా ఉందా అని అడిగితే ఆమె అవును అంటుంది.

దీంతో చక్రి మగతనాన్నీ కౌన్సిలర్ సందేహిస్తుంది. చక్రికి అనుమానం వచ్చి అలాంటిదేమీ లేదని చెప్పండి అని మహాతో అంటాడు. మీకు విడాకులు ఇవ్వడానికి ఇష్టం లేనట్లుంది అని కౌన్సిలర్ అడిగితే.. లేదు ఆమెకు విడాకులు ఇవ్వడానికి నేను సిద్ధమే అని చక్రి చెప్పడంతో మహా షాకవుతుంది. అదే విషయంలో చక్రి ఇంట్లోనూ చెబుతాడు. దీంతో నారాయణ సహా ఇంట్లో వాళ్లందరూ షాకవుతారు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks