హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.
Podarillu November 23 Episode: పొదరిల్లు.. నా విక్కీ అన్న మహా.. లక్కీని అవమానించిన విక్కీ.. కనకతార ఎవరో చెప్పిన చక్రి
Podarillu Serial November 23rd Episode: పొదరిల్లు సీరియల్ నవంబర్ 23 ఎపిసోడ్ లో కనకతార పేరు చెప్పి మహా అసూయపడేలా చేస్తాడు చక్రి. మరోవైపు ఇంట్లో నా విక్కీ అంటూ మహా వెనుకేసుకురాగా.. ఆఫీసులో అందరి ముందే విక్కీ ఆమెను అవమానించేలా మాట్లాడతాడు.
Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో మహాకు యాక్సిడెంట్ విషయం తెలిసి ఇంట్లో వాళ్లు కంగారుపడటం, అది చూసి ఆమె ఎమోషనల్ అవడం, ఆ తర్వాత మ్యాట్రిమొని పేరుతో మహాను చక్రి అసూయపడేలా చేయడంలాంటి సీన్లు చూడొచ్చు.

మహాకు నారాయణ సేవలు
మహాకు గాయమైన విషయం తెలుసుకొని ఆమెకు నారాయణ సేవలు చేసే సీన్ తో సీరియల్ సోమవారం (నవంబర్ 23) ఎపిసోడ్ మొదలైంది. ఆమె చిన్న నొప్పిని భరించలేక విలవిలలాడటం చూసి నారాయణ ఎగతాళి చేస్తాడు. మీకు దెబ్బ తగిలినప్పుడు కూడా ఓ క్వార్టర్ వేస్తే గానీ తట్టుకోలేకపోయారు కదా అని మహా అంటుంది.
నీకు కూడా కావాలా అని నారాయణ అడిగితే.. ఇద్దరం గుమ్మం దగ్గర కూర్చొని మందేద్దామా అని మహా అంటుంది. ఇక నుంచి ఆ పాత బండి వాడొద్దని, చక్రితో కారులోనో ఆటోలోనో వెళ్లాలని నారాయణ హుకుం జారీ చేస్తే మహా సరే అంటుంది.
మాధవ, మనీషా కాఫీ డేట్.. పొదుపు ముచ్చట్లు
ఇటు మాధవ, మనీషా కాఫీ డేట్ కు వెళ్తారు. వాళ్లను ఫాలో అవుతూ వెళ్లిన చక్రి కూడా కాస్త దూరంగా కూర్చొని వాళ్ల మాటలు వింటుంటాడు. మెనూ చూసిన మాధవ.. అన్ని రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఇంట్లోనే కాఫీ తాగితే అయిపోయేదని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత మనీషా మెనూ తీసుకొని తక్కువ రేటు ఉన్న ఐటెమ్స్ చెప్పడంతో మాధవ మెచ్చుకుంటాడు.
తమ ఇంట్లో బన్సీ జీతం కూడా తక్కువే కదా అందుకే పొదుపు అలవాటని చెప్పడంతో మాధవ కూడా సంతోషిస్తాడు. ఇద్దరూ కాసేపు పొదుపు ముచ్చట్లు మాట్లాడుకుంటారు. దీంతో పక్కనే ఉన్న చక్రి.. వీళ్ల పొదుపు పాఠాలు విని తలపట్టుకుంటాడు.
డేట్ గురించి కేశవకు చెప్పిన చక్రి, కన్నా.. క్లాస్ పీకిన మహా
ఆ తర్వాత కన్నా, చక్రి ఇంటికి తిరిగి వస్తారు. బయటే ఉన్న కేశవకు మాధవ, మనీషా డేట్ గురించి చెబుతారు. అతనికి అన్నీ వివరించి చెబుతారు. అప్పుడే బయటకు వచ్చిన మహా.. వాళ్లకు క్లాస్ పీకుతుంది. వాళ్లు డేట్ కు వెళ్తే వాళ్లను ఫాలో అవుతారా.. మీకు అసలు బుర్ర ఉందా అని తిడుతుంది. వీడే కారణం అని కన్నా మీదికి చక్రి.. అంతా అన్నయ్యే చేశాడని చక్రి గురించి కన్నా ఫిర్యాదులు చేసుకుంటారు. ముగ్గురిని మహా తిడుతుంది.
అన్నను ఆటపట్టించిన తమ్ముళ్లు.. కాపాడిన మహా
అప్పుడే మాధవ వస్తాడు. తనతోపాటు బిర్యానీ కూడా తెస్తాడు. ఎక్కడి నుంచి తెచ్చారని అడిగితే.. తనకు తెలుసని కన్నా అంటాడు. తన లవర్ పడిపోతుంటే వెనుక నుంచి పట్టుకునే ఫొటో ఉంది కదా.. ఆ రెస్టారెంట్ నుంచి తెచ్చాడని కన్నా పరోక్షంగా మాధవ, మనీషా రొమాంటిక్ మూమెంట్ గురించి చెబుతాడు. దీంతో మాధవ ఇబ్బంది పడతాడు.
ఇక మనీషా ఇచ్చిన షర్ట్ చూసి కూడా తమ్ముళ్లు ఆటపట్టిస్తారు. ఏదో చెవులు కుట్టే ఫంక్షన్ కు వెళ్లానన్నావ్.. అక్కడ ఇలా బట్టలు కూడా పెడతారా.. అన్నయ్య మనకు చెవులు కుడుతున్నాడు అని చక్రి అంటాడు. దీంతో మహా రంగంలోకి దిగి మాధవను కాపాడుతుంది. పెద్దిని ఆట పట్టిస్తున్న తమ్ముళ్లను వారించి లోనికి పంపిస్తుంది.
మహా యాక్సిడెంట్ విషయం తెలిసి ఇంట్లో వాళ్ల కంగారు.. మహా ఎమోషనల్
లోపలికి వెళ్లిన తర్వాత కూడా అన్నయ్యతో తమ్ముళ్లు ఆడుకుంటూనే ఉంటారు. లేడీస్ కాలేజీల చుట్టూ తిరిగే మీరు.. గంటలకొద్దీ ఫోన్ లో పనికిమాలిన కబుర్లు చెప్పే మీరు కూడా పెద్దిని అంటారా అని చక్రి, కేశవలకు మహా క్లాస్ పీకుతుంది. అప్పుడే నారాయణ వస్తాడు. ఈ సన్నాసులు ఇంకా ఇక్కడే ఉన్నారా.. ఇంత జరిగినా కనీసం తెలుసుకోలేకపోయారా అని అంటాడు. ఏం జరిగిందని అడిగితే.. మహాకు యాక్సిడెంట్, గాయమైన విషయం చెబుతాడు.
దీంతో ఆమె గాయం చూసి చక్రి, కేశవ, మాధవ కంగారు పడతారు. హాస్పిటల్ కు వెళ్దామని ఒకరు.. తాను బ్యాండేడ్ తెస్తానని మరొకరు.. తాను కారు తీస్తానని ఇంకొకరు ఇలా హడావిడి చేస్తారు. వాళ్లను చూసిన మహా.. ఇప్పటి వరకూ ఇంత తిట్టాను మీకు కోపంగా లేదా అని అంటుంది. మీరు తిడితేనే బాగుంటుంది.. మీరు తిడితే అమ్మ తిట్టినట్లు ఉంటుందని కేశవ అనడంతో మహా ఎమోషనల్ అవుతుంది.
ఆ తర్వాత ఆమె చేతికి చక్రి బ్యాండేడ్ వేస్తాడు. ఇక నుంచి తాను రోజూ పికప్, డ్రాప్ చేస్తానని చక్రి అంటాడు. అవసరం లేదు.. తాను బండి తీసుకెళ్తానని మహా అంటే.. తాను ఈఎంఐలో కొత్త బండి తీసుకుంటానని చక్రి చెబుతాడు. మీరు మా ఇంటి మహాలక్ష్మి.. మీకు ఏమైనా అయితే తట్టుకోలేమని అనడంతో మహా మరింత ఎమోషనల్ అవుతుంది.
చక్రి మ్యాట్రిమొని ప్రొఫైల్.. మహాకు అసూయ
ఆ తర్వాత మహా ఇంట్లోనూ ఆఫీసు పని చేసుకుంటూ ఉంటుంది. చక్రి వచ్చి ఆమె ఎదురుగా కూర్చొని ఫోన్ చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. రీల్స్ చూస్తున్నారా అని మహా అడిగితే.. కాదు మ్యాట్రిమొని సైట్ లో ప్రొఫైల్ క్రియేట్ చేశాను.. కనకతార అనే అమ్మాయి తగిలింది అని చక్రి చెబుతాడు. మీ మొదటి భార్యకు ఎందుకు విడాకులు ఇచ్చారని అడుగుతోంది.. దానికి మీరే కారణమని చెబుతాను అని చక్రి అంటాడు.
దీంతో మహా అసూయతో రగిలిపోతూ లోనికి వెళ్లిపోతుంది. ఆమెను చూసి చక్రి సంతోషిస్తాడు. తాను మ్యాట్రిమొని అనగానే ఈర్శ్య పడిందని, ఓ కోతి ఫొటో చూస్తూ కనకతార అని చెబితే అలా వెళ్లిపోయిందంటే ఇంకా తనపై ఆమెకు ప్రేమ ఉన్నట్లే అని అనుకుంటాడు. అలాగే మురిసిపోతూ ఉంటాడు. మరోవైపు లోనికి వెళ్లిన మహా మాత్రం.. నేను ఇంతగా అసూయ పడుతున్నానేంటి.. ఈ తింగరోడు ఎవరిని చేసుకుంటే నాకేంటి అని అనుకుంటుంది.
మా విక్కీ మంచోడన్న మహా
అప్పుడే చక్రి లోనికి వస్తాడు. మహా ఇంకా పని చేస్తూనే ఉండటం చూసి.. మీ విక్కీ ఇంతలా వేధిస్తున్నాడేంటి.. అర్ధరాత్రి వరకూ పని చేయిస్తున్నాడు అని తిడతాడు. దీంతో విక్కీని సపోర్ట్ చేస్తూ మహా మాట్లాడుతుంది. మా విక్కీ చాలా మంచోడు.. అతడు నాకేమీ పని చెప్పడం లేదు.. నేనే నా టార్గెట్ పూర్తి చేయడానికి పని చేస్తున్నాను అని అంటుంది. దీంతో చక్రి ముఖం వాడిపోతుంది.
లక్కీకి ఆఫీసులో అవమానం
మరుసటి రోజు ఉదయం ఆఫీసులో లక్కీ చేసిన కొత్త ప్రాజెక్ట్ గురించి విక్కీ అడుగుతాడు. క్లైంట్ కి చూపించే ముందు ఒకసారి ఫైనల్ గా చెక్ చేద్దామని అంటాడు. అయితే లక్కీ మాత్రం తన ల్యాప్‌టాప్ ఆటోలోనే మరచిపోతుంది. దీంతో కంగారు పడుతూ ఆమె చక్రికి ఫోన్ చేస్తే.. తాను చూసుకుంటానంటూ అన్ని ఆటోలూ వెతుకుంటాడు.
ఇటు ఆఫీసులో విక్కీ మాత్రం అందరి ముందే లక్కీని అవమానించేలా మాట్లాడతాడు. ఇంత ముఖ్యమైన ప్రాజెక్ట్ గురించి ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా.. ల్యాప్‌టాప్ మరచిపోయాను.. బ్యాకప్ లేదు అంటూ చిన్న పిల్లల్లా సమాధానాలు చెబుతావా అని తిడతాడు. దీంతో లక్కీ బాధపడుతుంది. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper
