...
...
Next Story

Podarillu November 25 Episode: పొదరిల్లు.. మహా నా పిల్ల అన్న విక్కీ.. చక్రి గొడవ.. సార్ అంటూ కొత్త పిలుపు.. కేశవకు డౌట్

Podarillu Serial November 25th Episode: పొదరిల్లు సీరియల్ నవంబర్ 25 ఎపిసోడ్ లో మహా కోసం చక్రి, విక్కీ మధ్య ఫైట్ జరుగుతుంది. మహా నా పిల్ల అంటూ విక్కీ నోరు జారుతాడు. దీంతో చక్రి గొడవ పడతాడు. మరోవైపు చక్రి సంతోషం చూసి కేశవ డౌట్ పడతాడు.

Published on: Nov 25, 2026, 07:56:45 IST
Advertisement

Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో మహాను చక్రి కాపాడటం, ఆమె ఆనందంలో అతనికి హగ్ ఇవ్వడం, అతడు గాల్లో తేలిపోవడం, అదే సమయంలో అటు విక్కీని లక్కీ దూరం పెట్టడంలాంటి సీన్లతో సాగిపోయింది. అయితే చివర్లో లక్కీ నా పిల్ల అంటూ విక్కీ నోరు జారడంతో చక్రి ఆవేశం కట్టలు తెంచుకుంటుంది.

సీసీటీవీ ఫుటేజ్ చూసి ఆటో నంబర్ తెలుసుకున్న చక్రి..

పొదరిల్లు సీరియల్ నవంబర్ 25 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ నవంబర్ 25 ఎపిసోడ్

మహా ల్యాప్‌టాప్ కోసం చక్రి వెతికే సీన్ తో సీరియల్ బుధవారం (నవంబర్ 25) ఎపిసోడ్ మొదలైంది. ఆటో జాడ తెలియకపోవడంతో అతనికి సీసీటీవీ గుర్తుకు వస్తుంది. రోజూ ఎక్కినట్లే ఫ్రూట్ షాపు ముందే మహా ఆటో ఎక్కినట్లు తెలుసుకొని అక్కడి సీసీటీవీ ఫుటేజ్ చూడాలని అనుకుంటాడు. వెంటనే అక్కడికి వెళ్లి.. ఓనర్ ను బతిమాలి సీసీటీవీ ఫుటేజ్ చూస్తాడు. దాని ద్వారా ఆటో నంబర్ తెలుసుకుంటాడు.

ఆటో ఓనర్ ఇంటికెళ్లిన చక్రి.. డ్రైవర్ అడ్రెస్ తెలుసుకొని..

ఆ నంబర్ ను తనకు తెలిసిన ఫ్రెండ్ కు ఇచ్చి ఆటో వివరాలు తెలుసుకుంటాడు. ఆ ఫ్రెండ్ ఆటో ఓనర్ వివరాలు చక్రికి ఇస్తాడు. దీంతో నేరుగా ఓనర్ ఇంటికి వెళ్తాడు. ఆ ఆటో తనదే అయినా తాను రెంట్ కు ఇచ్చినట్లు చెబుతాడు. చక్రి అతనికి జరిగిన విషయం చెప్పి ఆటో డ్రైవర్ నంబర్ అడుగుతాడు.

ఆ ఓనర్ ఇస్తాడు. దీంతో చక్రి ఆ నంబర్ కు ఫోన్ చేస్తాడు. కానీ ఆ ఫోన్ ఇంట్లోనే ఉండటంతో అతని భార్య లిఫ్ట్ చేస్తుంది. ఫోన్ ఇంట్లో మరచిపోయాడని, మలక్‌పేట ఆటో స్టాండ్ లోనే ఉంటాడని, అక్కడికెళ్తే కలవచ్చని చక్రికి ఆమె చెబుతుంది.

మహా టెన్షన్.. ఆఫీసులో ఏడుస్తూ.. మళ్లీ తిట్టిన విక్కీ..

ఇంకా లేదని, వెతుకుతూనే ఉన్నారని చెబుతుంది. దీంతో విక్కీ మళ్లీ తిడతాడు. అప్పటి నుంచీ ఏం చేస్తున్నావ్.. అసలు నీకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ అనవసరంగా ఇచ్చానని అనిపిస్తోంది.. నువ్వు ఈ ప్రాజెక్టుకు అన్ ఫిట్.. నీకు ఆ అర్హతే లేదు అని విక్కీ తిట్టడంతో మహా మరింత ఏడుస్తుంది.

మహాను కాపాడిన చక్రి.. అదిరిపోయిన ప్రెజెంటేషన్

ఆ తర్వాత మహా తన ల్యాప్‌టాప్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెంటనే చక్రి దానిని పట్టుకొని వస్తాడు. మహాకు ఇస్తాడు. ఎక్కడ దొరికింది అని అడిగితే.. ఆ వివరాలన్నీ తర్వాత ఇస్తాను.. ముందు మీరెళ్లి ప్రెజెంటేషన్ ఇవ్వండని చెప్పి పంపిస్తాడు. మహా లోనికి వెళ్లి తన ప్రెజెంటేషన్ అదరగొడుతుంది. క్లైంట్ కూడా చాలా ఇంప్రెస్ అవుతాడు. ఆ ప్రాజెక్ట్ వాళ్ల కంపెనీకే వస్తుంది. దీంతో విక్కీ, లక్కీ చాలా సంతోషిస్తారు.

విక్కీని పట్టించుకోకుండా చక్రి దగ్గరికి మహా

ఆ సంతోషకరమైన వార్తను ఆఫీసులో అందరికీ చెబుతాడు విక్కీ. లక్కీకి కంగ్రాట్స్ చెప్పమని అంటాడు. అందరూ కంగ్రాట్స్ చెబుతారు. అందరికీ మహా నవ్వుతూ థ్యాంక్స్ చెబుతుంది. విక్కీ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పగా.. సీరియస్ గా చూస్తూ థ్యాంక్స్ అని చెప్పి చక్రి కోసం వెళ్లిపోతుంది.

మొత్తానికి మీ జీవితంలో మొదటిసారి ఓ మంచి పని చేశారని పొగుడుతుంది. ఇన్నాళ్లూ మంచి పనులు చేయలేదా అని చక్రి అంటే.. లేదని మహా అంటుంది. ఆంటీల స్టిక్కర్లు అంటించుకోవడం, అమ్మాయిలకు 50 పర్సెంట్ డిస్కౌంట్లు ఇవ్వడం అంటూ మొదలుపెడుతుంది. చివరికి అసలు ల్యాప్‌టాప్ ఎలా దొరికిందని అడుగుతుంది.

చక్రి శ్రమ గుర్తించి హగ్ ఇచ్చి..

తన జీవితంలో తాను ఇంతగా కష్టపడలేదంటూ ఆటో డ్రైవర్ ను తాను ఎలా కనిపెట్టానో చక్రి వివరిస్తాడు. ముందు ఫ్రూట్ షాప్ కి వెళ్లి ఆటో వివరాలు కనిపెట్టి డ్రైవర్ దగ్గరికి వెళ్లినా అతడు ల్యాప్‌టాప్ ఇవ్వడానికి అంగీకరించడు. ఆమె నా భార్య అని చక్రి చెప్పినా వినడు. ఏదైనా ప్రూఫ్ కావాలని అడుగుతాడు. దీంతో చక్రి తన ఫోన్ లో ఉన్న పెళ్లి ఫొటోను చూపిస్తాడు.

చివరికి ఆ ల్యాప్‌టాప్ ఇవ్వడానికి ఆటో డ్రైవర్ అంగీకరిస్తాడు. చక్రి శ్రమ గురించి తెలుసుకున్న మహా ఎమోషనల్ అయిపోయి అతన్ని హగ్ చేసుకుంటుంది. మరోసారి థ్యాంక్స్ చెప్పి నీకు మంచి ట్రీట్ ఇస్తానని చెప్పి వెళ్లిపోతుంది.

మాధవ, తమ్ముళ్ల ముందు చక్రి డ్యాన్స్.. కేశవలో డౌట్

దీంతో చక్రి మబ్బుల్లో తేలిపోతూ ఇంటికి వెళ్తాడు. మొదట ఇంట్లోనే ఉన్న కన్నాను పట్టుకొని సంతోషంగా గంతులేస్తాడు. అన్న మాధవ, తమ్ముడు కేశవలను కూడా ఫోన్ చేసి పిలుస్తాడు. వాళ్లు కంగారు పడుతూ వస్తారు. అన్న, తమ్ముళ్ల ముందు చక్రి డ్యాన్స్ చేస్తాడు. జరిగిన విషయమంతా చెప్పి మహా హగ్ చేసుకుందని అంటాడు.

తాము నమ్మమని, ఏదో షేక్ హ్యాండ్ ఇచ్చి ఉంటుందని కన్నా అనడంతో చక్రి నిజంగానే జరిగిన విషయం చెబుతాడు. అలా అయితే ఇక మహా వదిన ఎప్పటికీ మనతోనే ఉంటుందా అని కన్నా అడిగితే.. అంతేకదా మరి అని చక్రి అంటాడు. అయినా కేశవ మాత్రం తనకు ఎక్కడో డౌట్ కొడుతోందని అనుకుంటాడు. చక్రి అతన్ని అనుమానంగా చూస్తాడు.

విక్కీని సార్ అన్న లక్కీ.. ఆఫీసులోనే నిలదీసి..

ఇటు ఆఫీసులో లక్కీ దగ్గరికి వెళ్తాడు విక్కీ. చెప్పు విక్కీ అని మొదట అన్న లక్కీ.. తర్వాత సారీ సార్ అంటూ కొత్తగా పిలుస్తుంది. దీంతో సార్ ఏంటి అని విక్కీ అడుగుతాడు. మీరు నా బాస్ కదా అని ఆమె అనడంతో తిట్టినందుకు సారీ.. నువ్వు బాగా హర్ట్ అయినట్లున్నావని విక్కీ అంటాడు. తప్పు తనదే అని, ల్యాప్‌టాప్ మరచిపోయి ఉండాల్సింది కాదని, మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదని లక్కీ అంటుంది.

ప్రాజెక్ట్ విషయంలో టెన్షన్ లో అలా అన్నానని, ఏమీ అనుకోవద్దని విక్కీ చెబుతాడు. ఈ ప్రాజెక్ట్ విషయంలో మీరెంత కంగారు పడ్డారో తానూ అంతే పడ్డానని, అది తెలుసుకోకుండా.. అసలు ఈ ప్రాజెక్ట్ అనవసరంగా ఇచ్చానని, అసలు అర్హతే లేదని అన్నారని లక్కీ బాధపడుతుంది. ఒక్క తప్పుకు అంతకుముందు చేసిన వంద మంచి పనులను మరచిపోవడం కరెక్ట్ కాదని క్లాస్ పీకుతుంది.

లక్కీ మై గర్ల్ అన్న విక్కీ

ఆ తర్వాత లక్కీ, దివ్యకు విక్కీ ట్రీట్ ఇస్తాడు. రెస్టారెంట్ లో లక్కీ ప్లేట్ లో నుంచే విక్కీ షేర్ చేసుకోవడానికి వెళ్తాడు. కానీ లక్కీ మాత్రం తన ఫుడ్ ను ఎవరితోనూ షేర్ చేసుకోనని అంటుంది. అప్పుడే చక్రి వచ్చి మహాకు ఫోన్ చేసి లక్కీ రెస్టారెంట్ బయటే ఉన్నానని చెబుతాడు. విక్కీ ఆమెను బయటకు తీసుకొస్తాడు. వెనుక సీట్లో కూర్చోమని డోరు తెరుస్తాడు. కానీ మహా మాత్రం చక్రి పక్కనే ముందు సీట్లోనే కూర్చోవడానికి వెళ్తుంది. దీంతో విక్కీకి ఎక్కడో కాలుతుంది. నువ్వు మహా కజిన్ కదా.. ఆమెను జాగ్రత్తగా తీసుకెళ్లు.. లక్కీ నా పిల్ల అని విక్కీ అనడంతో చక్రికి కోపం వస్తుంది. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 

ABOUT THE AUTHOR

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks