Podarillu November 9 Episode: పొదరిల్లు.. ఆఫీసులో అందరి ముందూ మహాకు చక్రి ముద్దు.. తల్లితో గొడవ పడి కేశవకు శైలు గిఫ్ట్
Podarillu Serial November 9th Episode: పొదరిల్లు సీరియల్ నవంబర్ 9 ఎపిసోడ్ లో కేశవ, శైలు.. మాధవ, మనీషా రొమాన్స్ చూసి చక్రి తెగ బాధపడిపోతాడు. ఆఫీసుకెళ్లి మహాకు ముద్దివ్వాలనుకొని, ఆమె రియాక్షన్ ఊహించుకొని భయపడిపోతాడు.
Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ మొత్తం చక్రి తన జీవితంలో రొమాన్స్ కరువైందని బాధపడటం చుట్టే తిరిగింది. ఆ తర్వాత టాపిక్ కాస్తా కేశవ షాప్‌కి ఎవరి పేరు పెట్టాలన్న దానివైపు మళ్లుతుంది. ఈ విషయంలో శైలు పెద్ద రచ్చ చేసే సీన్ రాబోతుందని స్పష్టమవుతోంది.

మాధవకు మనీషా ముద్దు.. చక్రి షాక్
మాధవ, మనీషా రొమాంటిక్ గా మాట్లాడుకునే సీన్ తో సీరియల్ సోమవారం (నవంబర్ 9) ఎపిసోడ్ మొదలైంది. మాధవ ఏదో చెబుతూ ఉంటే మనీషా అతన్ని ప్రేమగా చూస్తూ ఉంటుంది. అప్పుడే చక్రి అక్కడికి వస్తాడు. మాధవకు మనీసా ముద్దు పెట్టే సీన్ చూసి షాక్ తింటాడు.
అక్కడ మెకానిక్ షాపులో అదే దారుణం అనుకుంటే.. ఇక్కడ ఇది మరీ దారుణం అనుకుంటాడు. వాళ్లిద్దరి జీవితాలు సెట్ అయ్యాయి.. తన జీవితమే ఇలా అయిపోయింది.. పెళ్లయినా కూడా కనీసం ముద్దు పెట్టుకోలేని పరిస్థితి ఉంది అని బాధపడతాడు.
మహాకు ముద్దు పెట్టినట్లు కల కని.. మాధవతో ఆడుకొని..
ఏది ఏమైనా మహాకు ముద్దు పెట్టాల్సిందే అని నిర్ణయించుకుంటాడు. నేరుగా ఆఫీసుకు వెళ్తాడు. అక్కడ విక్కీతోపాటు ఆఫీస్ స్టాఫ్ అందరూ ఉండగానే మహాకు ముద్దు పెడతాడు. అది చూసి విక్కీ షాకవుతాడు. మహా కూడా చక్రిని లాగి పెట్టి కొడుతుంది. దీంతో చక్రి నిజంలోకి వస్తాడు. అదంతా కల అని తెలుసుకొని ఊపిరి పీల్చుకుంటాడు. ఆమెకు ముద్దు పెడితే సీన్ ఎలా ఉంటుందో ముందే అర్థమైపోతుంది.
ఆ తర్వాత వెళ్లిపోతుంటే మాధవ వచ్చి ఎందుకొచ్చావని అడుగుతాడు. చూడకూడనిది చూడటానికే వచ్చినట్లున్నాను.. అక్కడ మెకానిక్ షాపులో వాడు ముద్దు.. ఇక్కడ కన్స్ట్రక్షన్ సైట్ ను నువ్వు శోభనం గది చేసేశావ్ అని చక్రి బాధపడతాడు. నిన్ను ఏదో అనుకున్నాను కానీ.. చాలా ముదురే అని అన్నతో అంటాడు. తన పెళ్లి జరిగినా ఇలాంటివి చేయలేకపోతున్నానని బాధపడి వెళ్లిపోతాడు.
మహా ఆఫీసుకు చక్రి.. ముద్దు సీన్ల గురించి చెప్పి.. బాధపడి..
ఆ తర్వాత చక్రి నేరుగా మహా ఆఫీసుకు వెళ్తాడు. ఎందుకొచ్చారు అని ఆమె అడిగితే.. తాను చూసిన దారుణాల గురించి చెబుతాడు. మెకానిక్ షాపు మీ బుర్రుపిట్ట తన లవర్ కు ముద్దు పెట్టాడు.. అదే దారుణమంటే మీ పెద్దికి ఆ మనీషా కూడా ముద్దు పెట్టింది అని చెప్పడంతో మహా ఆశ్చర్యపోతుంది. నా బతుకేమో ఇలా అయింది.. ఈ ఇంట్లో వాళ్లను కాదని బయటకు వచ్చిన మిమ్మల్ని నేను పెళ్లి చేసుకున్నా ఇప్పటి వరకూ ముద్దూముచ్చట ఏమీ లేదు అని చక్రి బాధపడతాడు.
మీకు కూడా త్వరలో మంచి అమ్మాయి దొరుకుతుంది.. కాకపోతే అప్పటి వరకూ ఎవరిని పడితే వాళ్ల వెంట తిరగడం మానెయ్యాలి అని మహా అంటుంది. చక్రి తమ పెళ్లి గురించి మాట్లాడుతుండటంతో మహా టాపిక్ మారుస్తుంది. కేశవ షాపు సంగతి ఎంత వరకూ వచ్చింది.. ఏం పేరు పెడుతున్నాడు అని అడుగుతుంది. షాపుకి వెళ్దామని చక్రిని తీసుకెళ్తుంది.
కేశవకు శైలు గిప్ట్.. వరాలుతో గొడవ
మరోవైపు కేశవ కోసం శైలు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటుంది. తన కిడ్డీ బ్యాంకులో డబ్బు తీసి మంచి డ్రెస్ తీసుకుందామని డిసైడ్ అవుతుంది. కిడ్డీ బ్యాంక్ పగలగొడుతుంది. ఇంతలో తల్లి వరాలు వస్తుంది. ఏం చేస్తున్నావ్ అని అడిగితే.. కిడ్డీ బ్యాంక్ పగలగొట్టానని అంటుంది. ఆ మెకానిక్ గాడి కోసమేనా అంటూ మరోసారి కేశవను అవమానించేలా మాట్లాడుతుంది.
నువ్వేమైనా బిల్ గేట్స్ కూతురివా.. మనది కూడా అలాంటి జీవితమే కదా అని శైలు అంటుంది. కేశవ కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నాడు.. అతనికి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నానని, అందుకే కిడ్డీ బ్యాంకులో డబ్బు తీసినట్లు చెబుతుంది. అతని దగ్గరికి వెళ్తే బాగుండదు.. మీ అన్నకు చెబుతానని బెదిరించినా శైలు వినదు. తల్లితో గొడవ పడి వెళ్లిపోతుంది.
కేశవకు శైలు షర్ట్.. షాప్‌కి వచ్చిన చక్రి, మహా.. పేరుపై చర్చ
శైలు నేరుగా కేశవ షాప్ కి వెళ్తుంది. అతని కోసం తీసుకొచ్చిన షర్ట్ ఇస్తుంది. అక్కడే కన్నా కూడా ఉంటాడు. ఈ షర్ట్ వేసుకొనే రేపు లక్ష్మీ పూజలో కూర్చోవాలని ఆర్డర్ వేస్తుంది. కేశవ సరే అంటాడు. అప్పుడే మహా, చక్రి కూడా అక్కడికి వస్తారు. పనులు ఎలా జరుగుతున్నాయో చూస్తారు. షాప్‌కి ఏం పేరు పెడుతున్నావ్ అని మహా అడుగుతుంది. ఇప్పటికే ఓ పేరు అనుకున్నానని, అదే పెడతానని కేశవ అంటాడు. అది కచ్చితంగా తన పేరే అయి ఉంటుందని శైలు మనసులో అనుకుంటుంది.
మాధవ పేరు పెట్టాలని మహా అంటే.. అది చాలా పాత పేరులాగా అనిపిస్తుందని.. మహాలక్ష్మి పేరు పెట్టాలని చక్రి అంటాడు. దీంతో శైలు ముఖం వాడిపోతుంది. అది గమనించిన మహా.. ఇంటికి వెళ్లి దీనిపై మాట్లాడి నిర్ణయం తీసుకుందాం అని వెళ్లిపోతుంది. కేశవ కూడా వెళ్తుంటే తాను కూడా వస్తానని, ఏం పేరు డిసైడయ్యారో తానూ చూస్తానని శైలు వెంట వెళ్తుంది. ఇంట్లో షాపు పేరుపై చర్చ జరుగుతుంది. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


