Podarillu October 28 Episode: పొదరిల్లు.. చక్రి, కేశవకు నిజం చెప్పేసిన మహా.. నారాయణ కాళ్ల దగ్గర కన్నా.. మహా ఉగ్రరూపం
Podarillu Serial October 28th Episode: పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 28 ఎపిసోడ్ లో మహా ఉగ్రరూపం చూపించింది. కన్నా లాగిపెట్టి కొట్టడంతోపాటు చక్రి, కేశవలకు నారాయణ గురించి అసలు నిజం చెప్పేస్తుంది. దీంతో వాళ్లు షాకవుతారు.
Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ రక్తి కట్టించింది. నారాయణతో మరోసారి కన్నా గొడవ పడి కాలర్ పట్టుకోగా.. అతడు చచ్చిపోవాలని కోరుకోగా.. మహా తన ఉగ్రరూపం చూపిస్తుంది. అది చూసి అటు చక్రి కూడా మహాతో గొడవ పడతాడు. దీంతో మాధవ వద్దంటున్నా మహా అసలు నిజం చెప్పేస్తుంది.

మనీషా జీవితంలోకి విలన్‌గా బావ టెట్లీ.. మాధవ ధైర్యం
మనీషాకు తన బావ ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చే సీన్ తో సీరియల్ బుధవారం (అక్టోబర్ 28) ఎపిసోడ్ మొదలైంది. తనను పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తున్నాడని ఫోన్ పెట్టేసిన తర్వాత బన్సీకి ఏడుస్తూ చెబుతుంది మనీషా.
పక్కనే ఉన్న మాధవ అతడు ఎవరు అని అడిగితే తమ బావ అని, గతంలో ఒకసారి వచ్చి ఇలాగే బెదిరించాడని చెబుతాడు. దీంతో మాధవ ధైర్యం చెబుతాడు. తాను ఉన్నానని, తన కుటుంబం ఉందని, ఇది తమ ఏరియా అని, ఈసారి వస్తే గట్టిగా బుద్ధి చెప్పి పంపిస్తానని మనీషా, బన్సీలకు ధైర్యం చెప్పి వెళ్తాడు.
నారాయణతో కన్నా మళ్లీ గొడవ.. మాధవకూ ఎదురు తిరిగి..
ఇటు కన్నా తన తల్లికి ఇచ్చిన బొమ్మను మళ్లీ అతికించి టేబుల్ పై పెడతాడు. అయితే మళ్లీ కింద పడి పగిలిపోతుంది. అది నారాయణే కావాలని చేశాడని కన్నా భావిస్తాడు. అందరి ముందే అతన్ని నిలదీస్తాడు. కాలర్ పట్టుకొని అడుగుతాడు.
మా అమ్మను ఇంట్లో నుంచి వెళ్లగొట్టావ్.. కనీసం బొమ్మనైనా ఉండనీయవా.. ఏం బతుకు నీది.. ఆ అమ్మను చంపావ్.. ఈ అమ్మను వెళ్లగొట్టావ్.. అంటూ వాగుతుంటాడు. మాధవ వారిస్తే అతనికీ ఎదురు తిరుగుతాడు. మహా కూడా జోక్యం చేసుకుంటూ మీ అమ్మ వెళ్లిపోవడానికి ఆయనకు సంబంధం లేదని చెబుతున్నా వినడు.
20 ఏళ్ల తర్వాత వచ్చిన మీ అమ్మ రెండు రోజుల్లోనే ఎందుకు వెళ్లిపోయిందని మహా అడుగుతుంది. ఈ మనిషి గొంతు పట్టుకొని చంపబోవడం వల్లే ఆమె ఉండకుండా వెళ్లిపోయిందని కన్నా అంటాడు. అసలు ఈ నారాయణ ఉండి ఏం లాభం.. తాగి తాగి ఏదో ఒక రోజు చచ్చిపోతే బాగుండని చూస్తున్నామని కన్నా అంటాడు.
కన్నా చెంప పగలగొట్టిన మహా.. అందరికీ క్లాస్ పీకి..
దీంతో మహా ఆవేశంతో రగిలిపోతుంది. కన్నాను చెంపపై లాగిపెట్టి కొడుతుంది. దీంతో అతడు వెళ్లి నారాయణ కాళ్లపై పడతాడు. వేలెడంత లేవు.. మహా వృక్షంలాంటి మనిషిని చచ్చిపోమంటావా.. ఆయనను మనిషి కాదంటే దేవుడిని దేవుడు కాదు అన్నట్లే అని మహా అంటుంది. కన్నాకు క్లాస్ పీకుతున్న సమయంలో చక్రి, కేశవ అడ్డు పడితే వాళ్లనూ తిడుతుంది.
మీ నాన్నను అన్నేసి మాటలు అంటుంటే మీరు ఏమీ అనరా.. ఆయన చచ్చిపోవాలని కోరుకుంటున్నాడు.. ఎవరు అవునన్నా, కాదన్నా ఈ ఇంటి పెద్ద నారాయణే.. ఆయనను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మనే హక్కు ఎవరికీ లేదు.. ఇష్టం ఉన్నవాళ్లు ఉండొచ్చు.. లేనివాళ్లు వెళ్లిపోవచ్చు అని మహా తేల్చి చెబుతుంది.
వినని కన్నా.. ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. మహాతో చక్రి గొడవ
మహా ఉగ్రరూపం చూసి కూడా కన్నా వెనక్కి తగ్గడు. ఇప్పటికీ మీరు ఈ మనిషికే సపోర్ట్ చేస్తున్నారు.. నేను ఉండను.. ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాను అని చెప్పి కన్నా వెళ్లిపోతాడు. నాకు ఇదంతా కామనే కదమ్మా.. ఇవాళ ఎందుకింతలా ఆవేశపడుతున్నావ్ అని మహాతో అని కన్నా వెంట వెళ్తాడు నారాయణ. అటు చక్రి, కేశవ కూడా కన్నాను తీసుకురావడానికి వెళ్తే మహా అడ్డుపడుతుంది. దీంతో మహాతో చక్రి గొడవ పడతాడు.
వాడేదో చిన్న పిల్లాడు వాగితే అలా కొడతారా.. మీరంటేనే వాడికి ఎంతో ఇష్టం.. అయినా ఆ మనిషి ఎప్పుడూ మాకేమీ చేయలేదు.. ఎందుకు వాడిపై అంతలా విరుచుకుపడ్డారు.. ఎందుకు చేయి చేసుకున్నారు.. ఎందుకు వాడు వెళ్లిపోతున్నా ఆపనివ్వడం లేదంటూ మహాను నిలదీస్తాడు. మహా ఏం చేసినా అందులో అర్థం ఉంటుందని మాధవ అంటాడు. అదేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నామని కేశవ అంటాడు.
ఆ కోపం వెనుక అధికారం ఉందా.. ఆ మందలింపు వెనుక మమకారం ఉందా అని మహాను అడుగుతాడు చక్రి. తెలుసుకొని ఏం చేస్తారని మహా అంటుంది. అయినా ఆ నారాయణ అన్నింటికీ తట్టుకొని నిలబడ్డాడు కాబట్టే ఈ బృందావనం ఇంకా బృందావనంలా ఉంది.. లేదంటే మీ అత్తవాళ్లు తన్నుకుపోయేవాళ్లు అని మహా చెబుతుంది. అయినా చక్రి, కేశవ వినకపోవడంతో నిజం చెబుతాను రండంటూ వాళ్లను లోనికి తీసుకెళ్తుంది.
చక్రి, కేశవకు అసలు నిజం చెప్పేసిన మహా
మాధవ వద్దని వారిస్తున్నా.. మహా వినదు. నారాయణలాంటి తాగుబోతును ఈమె ఎందుకు మహావృక్షం, దేవుడు అంటుందో తెలియాలని చక్రి అంటాడు. దీంతో మహా అసలు నిజం చెప్పేస్తుంది. మనిషి ఔన్నాత్యాన్ని చాటిన వ్యక్తి ఆయన.. మీరంతా నాన్న అనకుండా ఆ మనిషి అంటున్నారే.. ఆ మనిషి నిజంగా గొప్పవాడే.. ఆ మనిషి చనిపోతే బాగుండని కన్నా అన్నాడే.. అసలు ఆ మనిషే లేకపోతే కన్నా ఏమయ్యేవాడో ఎవరికీ తెలియదు అని మహా అంటుంది. ఆమె ఏం మాట్లాడుతుందో చక్రికి అర్థం కాదు.
అసలు మీరు ముగ్గురు అన్నదమ్ములే.. కన్నా అసలు మీ తమ్ముడు కాదు.. అతనికి ఈ ఇల్లు కాదు.. తల్లి వేరు, తండ్రి వేరు.. ఆయన లేకపోతే కన్నా ఓ అనాథలా బతికేవాడు.. అతని జీవితం రోడ్డుపాలయ్యేది.. ఎక్కడో గుజరాత్ లో భర్త వదిలేసి వెళ్లిన జమునాబాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని బాగా చూసుకున్నాడు.. కానీ ఆమె మాత్రం నెలల కొడుకుకు వదిలేసి ఎవరో దొరికితే వాడితో వెళ్లిపోయింది.. అని మహా చెప్పడంతో చక్రి, కేశవ షాకవుతారు.
తర్వాత ఇంటికి తిరిగొచ్చిన కన్నా ఆవేశంతో అసలు మీరు నా సొంత అన్నదమ్ములేనా అని అడుగుతాడు. అతనికి అసలు విషయం తెలిసిపోయిందా అని అందరూ అనుకుంటారు. ఇంట్లో ఉండాలంటే నాన్నను నాన్నలా గౌరవించాల్సిందే అని మహా అంటుంది. ఆపండి అంటూ ఆమెపై కన్నా గట్టిగా అరుస్తాడు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


