Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో బృందావనంలోకి వచ్చీ రాగానే పరోక్షంగా అయినా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది జమున. కన్నాను దగ్గరికి తీసుకొని మాధవకు దూరం చేయడం, నారాయణకు కన్న కొడుకుతోనే వార్నింగ్ ఇచ్చేలా చేయడం చూస్తుంటే రానున్న రోజుల్లో బృందావనంలో గొడవలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మా ఇంటి విషయం అంటూ మహాపై నారాయణ ఆగ్రహం..

జమునను చూడగానే నారాయణ ఆవేశంతో ఊగిపోయే సీన్ తో సీరియల్ శనివారం (అక్టోబర్ 10) ఎపిసోడ్ మొదలైంది. అసలు దీన్ని ఎవరు తీసుకొచ్చారని అడిగితే నేనే తీసుకొచ్చానని మహా చెబుతుంది. నువ్వెందుకు తీసుకొచ్చావ్.. నువ్వు ఎన్నిసార్లు అడిగినా తన గురించి నేను ఎందుకు చెప్పలేదో తెలుసా.. అయినా నువ్వు ఎవరు ఆమెను తీసుకురావడానికి.. ఇది మా ఇంటి విషయం.. నీకు సంబంధం లేదు అని నారాయణ అనడంతో మహా షాకవుతుంది.
అది విని నువ్వసలు మనిషివేనా.. మహా ఈ ఇంటి మనిషి.. మా కంటే నిన్ను ఆమెనే బాగా చూసుకుంది అంటూ కొడుకులు చక్రి, కేశవ, మాధవ క్లాస్ పీకుతారు. దానిని తీసుకొచ్చినందుకు మీరు అనుభవిస్తారు.. కచ్చితంగా అనుభవిస్తారు అంటూ నారాయణ వెళ్లిపోతాడు.
కన్నా, జమున ఎమోషనల్.. పేరేంటని అడిగిన కన్న కొడుకు
ఆ తర్వాత కన్నా ఎక్కడ అంటూ అందరూ వెతుకుతారు. అతడు గదిలోకి వెళ్లి ఏడుస్తూ కూర్చొంటాడు. దీంతో మాధవ, చక్రి, మహా, జమున వెళ్లి అతన్ని బయటకు పిలుస్తారు. మాధవ పిలిచినా అతడు రాడు. దీంతో జమున పిలుస్తుంది. మీ అమ్మను పిలుస్తున్నాను రా నాన్న అని పిలవడంతో కన్నా బయటకు వస్తాడు. తల్లిని చూసి ఏడుస్తూ గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇద్దరూ ఎమోషనల్ అవుతారు.
అసలు కన్న కొడుకును వదిలేసి ఎలా వెళ్లిపోయావ్.. నేను గుర్తుకు రాలేదా అని కన్నా అడుగుతాడు. తప్పు చేశాను నాన్నా.. అయినా వెళ్లినా నేనేమో రాజభోగాలు అనుభవించలేదు.. ఇల్లువాకిలి లేక, తిండి లేక చాలానే బాధపడ్డాను అని జమున చెబుతుంది. ఆ తర్వాత తన కన్న కొడుకును పెంచిన మాధవకు థ్యాంక్స్ చెబుతుంది. నీ పేరేంటమ్మా అని కన్నా అడుగుతాడు. జమునా బాయి అని ఆమె చెప్పడంతో చాలా బాగుందని అంటాడు.
పరాయిదాన్నంటూ బాధపడిన మహా.. చక్రి సర్దిచెప్పినా వినకుండా..
{{/usCountry}}అసలు కన్న కొడుకును వదిలేసి ఎలా వెళ్లిపోయావ్.. నేను గుర్తుకు రాలేదా అని కన్నా అడుగుతాడు. తప్పు చేశాను నాన్నా.. అయినా వెళ్లినా నేనేమో రాజభోగాలు అనుభవించలేదు.. ఇల్లువాకిలి లేక, తిండి లేక చాలానే బాధపడ్డాను అని జమున చెబుతుంది. ఆ తర్వాత తన కన్న కొడుకును పెంచిన మాధవకు థ్యాంక్స్ చెబుతుంది. నీ పేరేంటమ్మా అని కన్నా అడుగుతాడు. జమునా బాయి అని ఆమె చెప్పడంతో చాలా బాగుందని అంటాడు.
పరాయిదాన్నంటూ బాధపడిన మహా.. చక్రి సర్దిచెప్పినా వినకుండా..
{{/usCountry}}ఆ తర్వాత మహా ఒంటరిగా బయటకు వెళ్తుంది. బాధపడుతూ ఉంటుంది. చక్రి ఆమె వెంటే వెళ్తాడు. నారాయణ అన్న మాటలకు బాధపడుతున్నారా అని అడుగుతాడు. అయినా ఆ తాగుబోతు మాటలను పట్టించుకోకండి అంటాడు. అయినా ఆయన అన్న మాటల్లో నిజం లేకపోలేదు.. అసలు నాకు, ఈ ఇంటికీ సంబంధం ఏముంది.. నా ఇంట్లో వాళ్లను వదులుకొని ఇక్కడికి వచ్చాను.. కానీ ఇప్పుడు పరాయిదాన్నని అనిపిస్తోంది.. అని మహా బాధపడుతుంది.
మీరు ఈ ఇంటి మనిషి.. ఆ నారాయణ మాటలు పట్టించుకోకండి అని చక్రి చెబుతాడు. అయినా మహా వినదు. బాధపడుతూ లోనికి వెళ్లిపోతుంది. అన్నీ సర్దుకుంటున్నాయి అనుకున్న టైమ్ లో ఈ నారాయణ వల్ల మళ్లీ మొదటికొచ్చింది అని చక్రి అనుకుంటాడు.
మందు తాగుతూ నారాయణ ఎమోషనల్
అటు మహాను నానా మాటలు అన్నందుకు చాలా బాధపడుతాడు నారాయణ. పీకలదాకా మందు తాగుతాడు. దాన్ని అసలు ఎందుకు ఇంటికి తీసుకొచ్చారు.. ఈ పని నాకు చేయడం రాదా.. అయినా దానిని తీసుకొచ్చినందుకు కచ్చితంగా అనుభవిస్తారు.. నా మాట రాసి పెట్టుకోండి అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. కానీ దాని వల్ల మాతను తిట్టాను.. ఇప్పుడు ఆమె ముందుకు ఎలా వెళ్లాలి.. ఎంత తిడుతుందో.. ఏం తిట్టినా సరే ఆమెకు సారీ చెబుతాను అని అనుకొని ఇంటికి వెళ్తాడు.
జమునను నిలదీసిన కన్నా, చక్రి
ఇటు ఇంట్లో తల్లి పక్కన కూర్చున్న కన్నా.. తనను వదిలేసి ఎందుకు వెళ్లావని అడుగుతాడు. అటు చక్రి, కేశవ కూడా అదే విషయంపై ప్రశ్నిస్తారు. ఆయన మీ గురించి ఏవేవో చెబుతున్నాడేంటి అని అంటారు. ఆయనకు తిట్టినా కొట్టినా పడి ఉండే భార్య కావాలి.. తప్పనిసరి పరిస్థితుల్లో నేను వెళ్లాల్సి వచ్చింది.. అయినా తాగితే ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు.. ఆయన గురించి నా కంటే మీకే బాగా తెలుసు అని జమున అంటుంది. సరే దీని గురించి తర్వాత మాట్లాడదాం.. ముందు భోజనం చేద్దాం అని మాధవ అంటాడు.
కన్నాను మాధవకు దూరం చేసిన జమున
అందరూ రోజులాగే భోజనానికి కూర్చొంటాడు. జమున దూరంగా కూర్చొని తింటూ ఉంటుంది. అన్నలతో కలిసి భోజనానికి సిద్ధమైన కన్నాను జమున పిలుస్తుంది. తాను తినిపిస్తానని అంటుంది. మాధవ తనకు వడ్డిస్తున్నా పట్టించుకోకుండా కన్నా వెళ్లిపోతాడు. దీంతో మాధవ బాధ పడతాడు. ఆ బాధను చక్రి, కేశవ, మహా గమనిస్తారు. తన తమ్ముడు దూరం అవుతాడా అన్న ఆందోళన అతనిలో కనిపిస్తుంది.
పుట్టిన 20 ఏళ్ల తర్వాత నీకు తినిపించే అదృష్టం నాకు దక్కింది అని కన్నాకు తినిపిస్తూ జమున అంటుంది. కన్నాకు పొలమారడంతో మాధవ పరుగెత్తుకుంటూ వెళ్లి నీళ్లు ఇస్తాడు. తాను తాగిస్తానని జమున తీసుకుంటుంది. దీంతో మాధవ మరోసారి నిరాశగా వచ్చి కూర్చొంటాడు. అతన్ని చూసి మహా, చక్రి బాధపడతారు. క్రమంగా కన్నా తమకు దూరమవుతాడన్న బాధ వాళ్లలో కనిపిస్తుంది.
మహాకు సారీ చెప్పిన నారాయణ
ఆ తర్వాత ఇంటికిి వచ్చిన నారాయణ మాతా అంటూ మహా దగ్గరికి వస్తాడు. నీకు మాత ఎవరు.. నేనెవరో అని మహా అంటుంది. నన్నే నీ సుపుత్రుడిని అనుకో అని నారాయణ అంటాడు. ఆవేశంలో నోరు జారేసాను.. నన్ను క్షమించు మాతా అని నారాయణ చెప్పినా మహా పట్టించుకోదు. నేను పరాయిదాన్నే.. ఈ ఇంటికి, నాకు ఎలాంటి సంబంధం లేదు అని మహా బెట్టు చేస్తుంది. అయినా నారాయణ మాత్రం ఆమెను బతిమాలుతూనే ఉంటాడు.
నారాయణకు కన్నా వార్నింగ్
మరుసటి రోజు ఉదయమే జమున అందరికీ టీ పెట్టి ఇస్తుంది. ఆమె అలా చేయడం చూసి ఇంట్లో వాళ్లందరూ సంతోషిస్తారు. నారాయణకు ఇవ్వడానికి వెళ్తే జమునను చూసి అతడు మండిపడతాడు. మంచం ఎత్తి మరీ ఆమెను కొట్టడానికి వస్తాడు. అది చూసి కన్నా ఆవేశంతో రగిలిపోతాడు. వచ్చినప్పటి నుంచీ మా అమ్మను తిడుతూనే ఉన్నావు.. ఇలా చేస్తే ఆమెను కాదు.. నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తాను అని కన్నా తండ్రికి వార్నింగ్ ఇస్తాడు. అంతటితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.