Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఇంట్లో అందరికి జమున భోజనం వడ్డిస్తుంది. చక్రికి ఎక్కువ వేస్తుంది. కొత్తగా పెళ్లయిందిగా బాగా తినాలని జమున అంటుంది. చక్రిని కోపంగా చూస్తుంది మహాలక్ష్మి. అత్త చేస్తే తినే భాగ్యం నీకు దక్కిందని మహాను అంటుంది జమున.
కోటి రూపాయలు కూడా లేవు

వదిన వాళ్లు కోటీశ్వరులు అందుకే వంట నేర్చుకోలేదని కన్నా అంటాడు. ఎంత కోటీశ్వరులు అయితే ఏం లాభం. గదిలో కోటీ రూపాయలు కూడా లేవు అని జమున మనసులో అనుకుంటుంది. ఇంతలో నారాయణ పార్సల్ తెచ్చుకుని తింటాడు. చపాతీలు కూడా ఉన్నాయని చక్రి, మాధవ అంటారు. ఏం కలిపిందో మీరు జాగ్రత్త. అది చేసిన వంట నేను తినను అని నారాయణ అంటాడు.
కన్నా కోపంగా అరవబోతుంటే చక్రి ఆపుతాడు. మూడు పూటల బయట తిను. మా అమ్మ వండింది తినే అర్హత లేదని కన్నా అంటాడు. నువ్వు తినరా పిల్లా బచ్చా. ఎన్ని రోజులు ఇలా గోరుముద్దలు తింటావో నేను చూస్తాను అని నారాయణ అంటాడు. అంతా తింటారు. తర్వాత జమునకు ఇవి మా అమ్మ గాజులు. మీ చేతులు బోసిగా ఉన్నాయి. ఇవి వేసుకోండని మాధవ ఇస్తాడు.
లోపల కావాలని ఉన్నా బయటకు మాత్రం వద్దంటుంది జమున. ఇంతలో నారాయణ వచ్చి ఇవి మీ అమ్మ గాజులురా. ఈ దారినపోయినా దానికి ఇస్తావేంటీ. ఆ దేవత గాజులు ఇస్తే మహాకు ఇవ్వు, మనీషాకు ఇవ్వు. లేదంటే వీడు ప్రేమించిన అమ్మాయికి పెళ్లయ్యాక ఇవ్వు. అంతేగానీ ఇలాంటి పనికిమాలినదానికి మీ అమ్మ గాజులు ఇస్తావేంటీ అని నారాయణ కోప్పడుతాడు.
నిజమేంటో కనుక్కోవాలి
కన్నా కోప్పడతాడు. దాన్ని తల్లిగా కూడా చూడలేను. మట్టి గాజులు కానీ బంగారు గాజులు కానీ వేసుకునే అర్హత దీనికి లేదు. నన్ను కాదని దీనికి ఈ ఇంట్లో ఒక్క రూపాయి ఇచ్చిన ఊరుకోను. జాగ్రత్త అని నారాయణ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఇందుకే నేను రానన్నంది అని జమున అంటే.. ఎందుకంత కోపమో మీరు కూడా చెప్పట్లేదని మహా అంటుంది.
{{/usCountry}}కన్నా కోప్పడతాడు. దాన్ని తల్లిగా కూడా చూడలేను. మట్టి గాజులు కానీ బంగారు గాజులు కానీ వేసుకునే అర్హత దీనికి లేదు. నన్ను కాదని దీనికి ఈ ఇంట్లో ఒక్క రూపాయి ఇచ్చిన ఊరుకోను. జాగ్రత్త అని నారాయణ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఇందుకే నేను రానన్నంది అని జమున అంటే.. ఎందుకంత కోపమో మీరు కూడా చెప్పట్లేదని మహా అంటుంది.
{{/usCountry}}ఇది నా రాత అని లోపలికి వెళ్లిపోతుంది జమున. తర్వాత నారాయణ చేస్తున్న దాని గురించి మహాను చక్రి అడుగుతాడు. ఇద్దరు చెప్పట్లేదు ఏం జరిగిందో అని అనుకుంటారు. భార్యాభర్తలు గొడవలు పడతారు. భర్త ఊరుకోవాలి. మీరు అంటే నేను ఊరుకోవట్లేదా అని చక్రి అంటాడు. హా అని మహా అంటే.. ఏం లేదంటాడు చక్రి.
సుపుత్రుడు మనం అనుకున్నంత చెడ్డవాడు కాదు. ఇందాక మీ అమ్మ గాజులు తెచ్చి ఇస్తుంటే మీ అమ్మ గారిని దేవత అన్నాడు. మీ నాన్నగారి దృష్టిలో మీ అమ్మ దేవత అంటే హత్య ఎందుకు చేస్తాడు. మీ నాన్నగారు చెడ్డవారు కాదు. ఏం జరిగిందో తెలుసుకోవాలి అని మహా అంటుంది. బంగారం లాంటి అవకాసం చేజారిందని జమున అనుకుంటుంది.
నారాయణ పళ్లు రాలగొడతాను
ఎంతలేదన్నా రెండు లక్షలు వచ్చేవి. నా మొగుడి అప్పుల్లో ఎంతైన కొంత తీరేది అని పైకే అనుకుంటుంది జమున. ఇంతలో కన్నా వస్తాడు. కన్నాను చూసి జమున షాక్ అవుతుంది. నన్ను క్షమించమ్మా.. అని కన్నా అంటే.. వీడు నేను మాట్లాడుకుంది వినలేదన్నమాట అనుకుంటుంది జమున. నారాయణ బంగారు గాజులు ఇవ్వనివ్వకుండా నొప్పించాడు కదమ్మా అని కన్నా అంటాడు.
నీకోసం వచ్చాను. అవన్ని వద్దన్నట్లుగా జమున మాట్లాడుతుంది. ఆ నారాయణ పళ్లు రాలగొడతాను చూడు అని కన్నా అంటే.. తండ్రిని అలా అనకూడదని జమున డ్రామా ఆడుతుంది. నా జీవితం ఎప్పుడు ఇంతే. నిన్ను వదిలేసి వెళ్లడానికి కూడా కారణం మీ నాన్నే. ప్రాణం పోసిన కన్నా ఈ కన్నాను కూడా వదిలేసి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడెలా చూశాడో ఇప్పుడు అలాగే ద్వేషిస్తున్నాడు అని నారాయణపై కన్నాకు ద్వేషం పెంచుతుంది జమున.
నీకోసం నేనున్నా అమ్మా అని జమున ఒడిలో పడుకుంటాడు. నేను వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్లడానికి వీడు ఒక్కడు చాలు. వీడిని నమ్మిస్తే చాలు నా పని సులువు అవుతుందని జమున అనుకుంటుంది. జమున కాల్ చేయట్లేదేంటని కాల్ చేస్తాడు ముఖేష్. జమునకు కాల్ రావడం మహా వింటుంది. జమున బయటకెళ్లి మాట్లాడుతుంది.
లాటరీలో కోటి రూపాయలు
ఏంటయ్యా అని జమున అడిగితే.. బజారులో లాటరీ పెడితే కోటి రూపాయలు వచ్చాయని చెప్పడానికి కాల్ చేశానని ముఖేష్ వెటకారం ఆడతాడు. అది అర్థం చేసుకున్న జమున వచ్చిన పనిలోనే ఉన్నానని చెబుతుంది. జమున కాల్ మాట్లాడుతున్నది చూసిన మహాలక్ష్మి ఈ టైమ్లో ఎవరితో మాట్లాడుతుందని అనుకుంటుంది.
ఇక్కడ పని చేస్తుంటే పుణ్యకాలం గడిచిపోతుంది. ఇప్పటివరకు చిల్లరే దొరికింది. ప్రతిసారి ఫోన్ చేయకు. ఆ నారాయణకు దొరికితే చస్తామని కాల్ కట్ చేసి వెనక్కి తిరుగుతుంది జమున. మహా ఉంటుంది. మహాను చూసి షాక్ అవుతుంది. ఏం చేస్తున్నారని అడిగితే.. నిద్రపట్టకపోతే ఇలా వచ్చానని జమున అబద్ధం చెబుతుంది. అబద్ధం. మీరు ఫోన్లో మాట్లాడటం విన్నాను. ఏం జరిగింది. డబ్బు దొరకగానే కాల్ చేస్తానని ఎందుకు అన్నారు. అసలు ఎవరితో మాట్లాడారు నిలదీస్తుంది మహా.
దానికి మరింత షాక్ అవుతుంది జమున. ఏమైనా సమస్య అని మహా అంటే.. సమస్య అంటది ఏంటీ.. ఆ ఒక్కమాటే విందా. బ్రతికిపోయాను అని జమున అనుకుంటుంది. నేను పని చేసిన ఒకావిడ దగ్గర డబ్బు తీసుకున్నాను. ఇప్పుడు కావాలని ఇబ్బందిపెడుతుంది. ఐదు వేలు అని జమున అంటుంది. నేను ఇస్తాను రేపు వెళ్లి ఇచ్చేయండని మహా అంటుంది.
జమునకు మహా 5 వేలు
సరేనంటుంది జమున. మహాకు జమున 5 వేలకు టోకర వేసినట్లు తెలుస్తోంది. చక్రి గురించి అడిగితే.. తెలియదని మహా అంటుంది. మీ ఆయన గురించి నీకు తెలియకపోవడం ఏంటీ. పెళ్లాయ్యాక తమ్ముళ్లలతో పడుకోవడం ఏంటీ. పెద్దబాబు ఉండగా మీరు చేసుకున్నారేంటీ అని జమున అడుగుతుంది. మాది లవ్ మ్యారేజ్. ప్రేమించి పెళ్లిచేసుకున్నాం అని మహా చెబుతుంది.
ఆ మాటలు చక్రి విని నా మీద ప్రేమ ఉంది అనుకుంటాడు. చక్రి సిగ్గుపడిపోతాడు. మీకు పెళ్లిచూపులు జరుగుతున్నాయా ఎందుకు సిగ్గుపడిపోతున్నారు. మూతి మీద వాతపెడతాను మహా అంటుంది. నా సిగ్గుకు కారణం మీరే. ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్పారుగా అని చక్రి అంటాడు.
మరుసటి రోజు ఉదయం కేశవకు షాప్ కోసం రెండు లక్షలు ఇస్తాడు మాధవ. నా వైపు నుంచి లక్షా 50 వేలు అని చక్రి ఇస్తాడు. మహాలక్ష్మి నుంచి లక్షా 50 వేలు. నారాయణ కూడా డబ్బు ఇస్తాడు. అదంతా చూసిన జమున నా పంటపండబోతుంది. మంచి టైమ్లోనే అడుగుపెట్టాను అని డబ్బువైపు ఆశగా చూస్తుంది.
కేశవ షాప్ డబ్బు దొంగతనం
అది మహా గమనిస్తుంది. మొత్తానికి కేశవ షాప్ కోసం అన్నదమ్ములు, మహా, నారాయణ కూడబెట్టిన 5 లక్షల డబ్బును కొట్టేయాలనుకుంటుంది జమున. అక్కడితో పొదరిల్లు సీరియల్ నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.