Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ మరోసారి రక్తి కట్టించేలా సాగింది. కన్నతల్లి కోసం పరితపించిపోతున్న కన్నాకు అసలు నిజం చెప్పకపోయినా.. నారాయణ విషయంలో అతడు చేస్తున్న తప్పు గురించి చెబుతూ మహా క్లాస్ పీకడం, చివరికి అసలు నారాయణ అతని తండ్రే కాదన్న నిజం మహా తెలుసుకోవడం పెద్ద ట్విస్టే ఇచ్చింది.
కన్నాకు క్లాస్ పీకిన మహా

అందరూ బిర్యానీ పార్టీ చేసుకోవడంతో నారాయణకు కూడా మహా బిర్యానీ తీసుకెళ్లి ఇచ్చే సీన్ తో సీరియల్ శుక్రవారం (అక్టోబర్ 23) ఎపిసోడ్ మొదలైంది. కేశవ షాపు ఓనర్ కు డబ్బులివ్వడానికి అందరం వెళ్లాం.. నువ్వెందుకు రాలేదంటే నారాయణను మహా నిలదీస్తుంది. రూ.30 వేలు ఇచ్చి ఎందుకు బిల్డప్ ఇవ్వడమని నారాయణ అంటాడు. ఇద్దరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటుండగా కన్నా వస్తాడు.
నారాయణ తన తల్లిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని, అలాంటి మనిషికి బిర్యానీ ఎందుకు అంటూ చేతిలోని ప్లేటు లాక్కొని పడేయడానికి వెళ్తాడు. దీంతో మహా అతనికి క్లాస్ పీకుతుంది. ఒక్క మెతుకు కింద పడినా.. నీకు మామూలుగా ఉండదు.. మీ అమ్మ వెళ్లిపోవడానికి ఆయనకు సంబంధం లేదని చెప్పాను కదా.. ఇంట్లోకి వెళ్లు అని అనడంతో కన్నా ప్లేటు తిరిగి ఇచ్చి వెళ్లిపోతాడు.
మహాను నిలదీసిన కన్నా.. తిట్టిన అన్నలు
వాడి మాటలేమీ పట్టించుకోకు అని నారాయణకు చెప్పి మహా ఇంట్లోకి వెళ్తుంది. లోనికి వెళ్లగానే కన్నా ఆమెను నిలదీస్తాడు. నా బాధను నువ్వు అర్థం చేసుకోవడం లేదు.. నారాయణనే సపోర్ట్ చేస్తున్నావ్.. ఈ ఇంట్లో అందరికంటే నేనంటేనే నీకు ఇష్టమని అనుకున్నాను.. కానీ ఇలా చేస్తావని అనుకోలేదు అని కన్నా అంటాడు.
మీ అమ్మ వెళ్లిపోవడానికి నారాయణకు ఎలాంటి సంబంధం లేదని ముందే చెప్పాను.. ఆమెను పంపించడం నువ్వు చూశావా.. నీకు తండ్రి అంటే గౌరవం లేదు.. అని మహా కూడా అంటుంది. అటు పెద్ది, చక్రి, కేశవ కూడా కన్నానే తిడతారు. వదినకే ఎదురు తిరిగి మాట్లాడతావా అని అంటారు. దీంతో కోపంతో మహా, ఆ తర్వాత కన్నా చెరో దిక్కుకి వెళ్లిపోతారు.
కన్నాను ఓదార్చిన మాధవ
{{/usCountry}}మీ అమ్మ వెళ్లిపోవడానికి నారాయణకు ఎలాంటి సంబంధం లేదని ముందే చెప్పాను.. ఆమెను పంపించడం నువ్వు చూశావా.. నీకు తండ్రి అంటే గౌరవం లేదు.. అని మహా కూడా అంటుంది. అటు పెద్ది, చక్రి, కేశవ కూడా కన్నానే తిడతారు. వదినకే ఎదురు తిరిగి మాట్లాడతావా అని అంటారు. దీంతో కోపంతో మహా, ఆ తర్వాత కన్నా చెరో దిక్కుకి వెళ్లిపోతారు.
కన్నాను ఓదార్చిన మాధవ
{{/usCountry}}పెరట్లోకి వెళ్లిన కన్నా దగ్గరికి మాధవ వెళ్తాడు. అతన్ని ఓదారుస్తాడు. వదినతో అలా మాట్లాడటం తప్పు అని అంటాడు. వదిన మాత్రం నారాయణకే సపోర్ట్ చేస్తోంది.. నా బాధను అర్థం చేసుకోవడం లేదు.. ఆయన ఆ అమ్మను కూడా చంపాడు కదా అని కన్నా అంటాడు. నువ్వు చూశావా అని మాధవ అడుగుతాడు.
అందరూ అనుకుంటున్నారు కదా అని కన్నా అంటాడు. అనుకోవడం వేరు, చూడటం వేరు.. అయినా చక్రి అన్నయ్య, మహా వదిన ఎప్పుడూ నీ ఆనందం కోసం ఆలోచిస్తారు.. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనే వెళ్లి మీ అమ్మను తీసుకొచ్చారు అని మాధవ సర్ది చెబుతాడు. అదంతా మహా వింటుంది.
మహాకు జమున, ముకేష్ గురించి చెప్పిన చక్రి
ఇటు మహా గదిలోకి వెళ్లిన తర్వాత చక్రి ఆమె దగ్గరికి వెళ్తాడు. కన్నా మాటల గురించి పట్టించుకోవద్దని ఆమెకు చెబుతాడు. అదే సమయంలో జమున గురించి మరో షాకింగ్ నిజం చెబుతాడు. ఆమెతో పాటు ఓ వ్యక్తి ఉన్నాడని చెప్పాను కదా.. అతడు ఎవరో కాదు ఆమె భర్తే.. అతడు అస్సలు మంచివాడు కాదు.. ఆమెను కొడుతూనే ఉంటాడు.. ఊరంతా అప్పులు చేస్తాడని అక్కడి వాళ్లు చెప్పారు.. అసలు ఆ ఇద్దరి గురించి ఒక్కరు కూడా మంచిగా చెప్పలేదని చక్రి అంటాడు.
దీంతో మహా షాక్ తింటుంది. ఇళ్లలో పనులు చేసుకుంటూ బతుకుతోంది.. ఇక్కడికి తీసుకొస్తే అందరితో ఆనందంగా ఉంటుంది కదా అనుకుంటే.. మరీ కొడుకు ఇంట్లోనే దొంగతనం చేసేంతలా దిగజారింది అని మహా అసహ్యించుకుంటుంది. ఆ తర్వాత చక్రి వెళ్లిపోతాడు.
కేశవకు శైలు ఫోన్.. మళ్లీ క్లాస్
అటు కేశవకు శైలు ఫోన్ చేస్తుంది. షాపు కోసం డబ్బులు ఇవ్వడానికి మీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్లావ్.. నన్ను ఎందుకు తీసుకెళ్లలేదు.. అంటే నేను నీ ఫ్యామిలీ కాదా.. నీ కోసం ఇక్కడ ఇంట్లో వీళ్లతో తిట్టించుకుంటున్నాను.. కానీ నువ్వు మాత్రం నన్ను పట్టించుకోలేదు అని క్లాస్ పీకుతుంది. ఇక ఫ్యామిలీ అందరం కలిసి బయటకు వెళ్లి లంచ్ చేశామని కేశవ చెప్పడంతో శైలు మరింత మండిపడుతుంది. అతన్ని తిట్టి ఫోన్ పెట్టేస్తుంది.
వదినను బతిమాలిన కన్నా.. తండ్రి గురించి చెప్పిన మహా
మరుసటి రోజు ఉదయం కన్నా మెల్లగా వదిన దగ్గరికి వెళ్తాడు. వెళ్దామా అని అడుగుతాడు. నీతో మాట్లాడను.. నీలాంటి మెచ్చూరిటీ లేనివాళ్లతో ఫ్రెండ్షిప్ చేయను అని మహా బెట్టు చేస్తుంది.
తండ్రంటే నీకు గౌరవం లేదు.. ఎలా మాట్లాడాలో తెలియదు.. నన్ను కూడా మాటలన్నావ్.. 20 ఏళ్ల వయసు లేదు.. 60 ఏళ్ల వయసున్న వ్యక్తితో అలాగేనా మాట్లాడేది.. అయినా నీపై మీ అమ్మకు ప్రేమ ఉంటే నిన్ను వదిలేసి మళ్లీ ఎందుకు వెళ్తుంది.. నువ్వు పుట్టగానే వదిలేసి వెళ్లి 20 ఏళ్లకు తిరిగొస్తే ఆయన ఆ మాత్రం మాటలు అనడా.. ఆయనను అర్థం చేసుకోవడం నీవల్ల కాదు.. మొదటి భార్యను చంపాడన్నారు.. మీ అమ్మను కూడా చంపాడన్నారు.. అది నిజమా.. ఆయనను తాగుతాడు అని అంటారు.. తాగి నిన్నేమైనా అన్నాడా.. నీ అన్నలను ఏమైనా అన్నాడా అని మహా నిలదీస్తుంది.
వీటికి కన్నా దగ్గర సమాధానం ఉండదు. నీలాంటివాడితో నేను మాట్లాడను అని కన్నాను మళ్లీ మహా తిట్టి పంపిస్తుంది.
మాధవ ఎమోషనల్.. కంటతడి
అటు ఇదంతా దూరం నుంచి వింటూ ఉంటారు మాధవ, చక్రి, కేశవ. కన్నా తిరిగి వస్తుండటంతో అందరూ లోనికి వెళ్తారు. మహా మాటలు విని మాధవ ఎమోషనల్ అవుతాడు. కన్నీళ్లతో దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఎందుకు ఏడుస్తున్నావని చక్రి అడుగుతాడు. నా తర్వాత నాన్ను బాగా అర్థం చేసుకున్నది మహానే.. ఆమెను చూస్తుంటే గత జన్మలో ఆమే మనకు అమ్మనేమో అని మాధవ అంటాడు. దీంతో చక్రి షాకవుతాడు. నారాయణ కూడా ఆమెను అమ్మ అంటాడు.. నువ్వూ అమ్మ అంటే.. నాకు వరసలు మారిపోతాయ్.. ఆమె నా భార్య అని చక్రి అనడంతో అందరూ నవ్వుకుంటారు.
కన్నా తండ్రి నారాయణ కాదు..
ఆ తరవాత జమునను వెతుక్కుంటూ వెళ్తుంది మహా. రోడ్డుపై ఆమెను అడ్డగించి కన్న కొడుకు ఇంట్లో దొంగతనం ఎందుకు చేశారని నిలదీస్తుంది. అసలు నారాయణ మిమ్మల్ని ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లగొట్టాడని అడుగుతుంది. దీంతో కన్నా తండ్రి నారాయణ కాదు అని జమున అసలు నిజం చెబుతుంది. మహా షాకవుతుంది. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.