...
...
Next Story

Podarillu October 2 Episode: పొదరిల్లు.. చక్రి రెండో పెళ్లికి సిద్ధమైన నారాయణ.. కత్తి పట్టుకొని.. గోపికను ఒప్పించిన మహా

Podarillu Serial October 2nd Episode: పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 2 ఎపిసోడ్ లో చక్రి రెండో పెళ్లి కోసం ఇంట్లో వాళ్లు సిద్ధమవుతారు. నారాయణ కొత్త బట్టలు వేసుకొని రెడీ అవుతాడు. అటు మహాలక్ష్మి సమయానికి వెళ్లి గోపికను కాపాడి ఆమెకు సర్ది చెబుతుంది.

Published on: Oct 2, 2026, 08:01:09 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో చక్రితో ఇంట్లో వాళ్లు ఆడుకోవడం, గోపిక ఆత్మహత్య చేసుకోకుండా మహా అడ్డుకోవడం చుట్టూ తిరిగింది. నిజంగానే మహా ఎక్కడ తనకు దూరమై గోపికను ఇచ్చి పెళ్లి చేస్తారో అని చక్రి టెన్షన్ పడటం ఈ ఎపిసోడ్ లో హైలైట్ గా చెప్పొచ్చు.

చక్రితో ఆడుకున్న నారాయణ, కేశవ, మాధవ

Podarillu October 2 Episode: పొదరిల్లు.. చక్రి రెండో పెళ్లికి సిద్ధమైన నారాయణ.. కత్తి పట్టుకొని.. గోపికను ఒప్పించిన మహా
Podarillu October 2 Episode: పొదరిల్లు.. చక్రి రెండో పెళ్లికి సిద్ధమైన నారాయణ.. కత్తి పట్టుకొని.. గోపికను ఒప్పించిన మహా

గోపికను తీసుకొస్తానని మహా వెళ్లడంతో చక్రి ఏం జరుగుతుందో అని ఆందోళన పడే సీన్ తో సీరియల్ శుక్రవారం (అక్టోబర్ 2) ఎపిసోడ్ మొదలైంది. అదే అదునుగా నారాయణ, కేశవ, మాధవ అతనితో ఆడుకుంటారు. మాధవ అన్ని రకాలుగా యోగ్యుడైనా కూడా వాడికి ఒక్క పెళ్లి జరగలేదు.. నీకు మాత్రం రెండేసి పెళ్లిళ్లు జరుగుతున్నాయి అని నారాయణ వెటకారంగా అంటాడు. అసలు ప్రపంచంలో ఓ పెళ్లామే వెళ్లి చేసే పెళ్లి ఇప్పుడే చూస్తున్నానని అని వెళ్లిపోతాడు.

ఆ తర్వాత మాధవ, కేశవ కూడా చక్రితో ఆడుకుంటారు. నువ్వే కదరా మహాకు విడాకులు ఇచ్చి గోపికను పెళ్లి చేసుకుంటానన్నావ్ అని మాధవ అంటాడు. అటు కేశవ కూడా అందుకుంటాడు. పెద్ద వదిన వెళ్లి చిన్న వదినను తీసుకొస్తుంది.. ఆమెతోపాటు వాళ్ల ఇంట్లో వాళ్లు కూడా వచ్చి ఓ తుండుగుడ్డ కప్పి, ఓ వెయ్యి నూటాపదహార్లు పెట్టి వెళ్తారంతే అని అంటాడు. ఆ తర్వాత కేశవ, మాధవ ఇద్దరూ ఇల్లు క్లీన్ చేసే పనిలో పడతారు. దీంతో చక్రిలో మరింత టెన్షన్ పెరుగుతుంది.

నిద్ర మాత్రలు మింగబోయిన గోపిక.. కాపాడిన మహాలక్ష్మి

కానీ అప్పుడే కన్నా, మహాలక్ష్మి అక్కడకిి వస్తారు. మహా కూడా డోరు కొట్టి తలుపు తీయమని అడిగినా ఆమె వినదు. చివరికి నేను చక్రి భార్యను వచ్చాను.. డోరు తీయు అని మహా అంటుంది. కన్నా తాను కూడా వచ్చానని, మా వదిన నీతో మాట్లాడుతుందట అని అనడంతో గోపిక మెల్లగా డోరు తీసి బయటకు వస్తుంది.

నాతో ఆడుకుంటున్నారా?

ఇటు ఇంట్లోవాళ్లు ఏర్పాట్లు చేస్తుండటంతో చక్రికి ఏం చేయాలో పాలుపోదు. నువ్వయినా మహాకు చెప్పి తిరిగి రమ్మనవా అని మాధవను అడుగుతాడు. కానీ అతడు వినడు. మరోవైపు కేశవ మాత్రం బన్సీకి ఫోన్ చేసి పెళ్లి బట్టలు తీసుకురమ్మను అని మాధవతో అంటాడు. ఎందుకు అని చక్రి అంటే.. పెళ్లి వాళ్లు వచ్చేసరికి నువ్వు తయారై కూర్చోవా అని మాధవ చెబుతాడు.

తర్వాత వాళ్లు మళ్లీ క్లీనింగ్ లో ఉంటే.. నాకు అర్థమైంది.. మీరంతా కలిసి నాతో ఆడుకుంటున్నారు అని చక్రి అంటాడు. నీతో ఆడుకోవడానికి నువ్వేమైనా నాకు బావవా, బామ్మర్దివా.. తమ్ముడివి అని మాధవ అంటాడు. అంత నమ్మకం లేకపోతే కన్నా కూడా వెళ్లాడు కదా వాడికి ఫోన్ చేసి అడుగు అని కేశవ చెబుతాడు.

కన్నాకు చక్రి ఫోన్.. చిన్న వదినను తీసుకొస్తామంటూ..

దీంతో వెంటనే కన్నాకు ఫోన్ చేస్తాడు చక్రి. ఎక్కడున్నావని అడిగితే.. గోపిక ఇంట్లో అని అతడు చెబుతాడు. అయినా చక్రి నమ్మడు. సెల్ఫీ తీసి పంపిస్తున్నా చూసుకో అని కన్నా ఓ ఫొటో పంపిస్తాడు. అది చూసి చక్రి షాకవుతాడు. ఫొటో చాలా.. వీడియో కాల్ కూడా చేయాలా అని కన్నా అంటాడు. వద్దులే.. అయినా అక్కడ ఏం చేస్తున్నారు అని చక్రి అడిగితే.. పెద్ద వదన చిన్న వదినను తీసుకురావడానికి వెళ్లింది.. తొందరగానే వస్తాం అని కన్నా కూడా చక్రితో ఆడుకుంటాడు. దీంతో చక్రికి ఏం చేయాలో అర్థం కాదు.

గోపికకు సర్ది చెప్పిన మహా..

ఇటు గోపికకు మహా సర్ది చెబుతుంది. అసలు చక్రి నీకు ఎన్నాళ్లుగా పరిచయం అని అడిగితే 20 రోజులుగా అని గోపిక చెబుతుంది. 20 రోజుల్లేనే చచ్చిపోవాలన్నంత ప్రేమ పుట్టిందా అని నిలదీస్తుంది. అయితే నిన్ను ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా చెప్పాడా అంటే గోపిక లేదంటుంది.

పోనీ రోజూ ఫోన్లో మాట్లాడేవాడా.. మెసేజ్ చేసేవాడా.. సినిమాలకు, పార్కులకు వెళ్లేవారా.. లాంగ్ డ్రైవ్ కు తీసుకెళ్లాడా అని మహా ప్రశ్నిస్తుంది. లేదు అన్నీ తానే చేశానని గోపిక అంటుంది. మరి నువ్వు ఎప్పుడైనా ప్రేమిస్తున్నానని చక్రితో చెప్పావా అని అడిగితే.. తన బర్త్ డే రోజు చెప్పానని, అప్పటి నుంచి తనను అవాయిడ్ చేస్తున్నాడని అంటుంది.

తప్పులన్నీ నీవే చేశావు కదా..

మరి చక్రి నిన్ను ఎక్కడ మోసం చేశాడు.. నువ్వు ప్రేమిస్తున్నావని తెలియగానే దూరంగా వెళ్లాడు కదా.. దానిని అడ్వాంటేజ్ గా తీసుకొని నీతో తప్పుగా ప్రవర్తించాడా.. నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత కూడా అప్పటికీ చెప్పకపోతే బాగుండదని తనకు పెళ్లయిందని చెప్పాడు అని మహా అంటుంది. ఫోన్ నంబర్ ఇస్తే అర్థం చేసుకుంటాడని అనుకున్నా.. నవ్వుతూ ప్రేమగా మాట్లాడితే అలాగే అనుకున్నా అని గోపిక అంటుంది. చక్రి చేసిన తప్పు అదొక్కటే..ఇన్ని తప్పులు నువ్వు చేసి చక్రి అదొక్క తప్పు చేస్తే క్షమించవా అని మహా అంటుంది.

అయినా నీకున్న అందానికి చక్రి ఏంటి ఎవరైనా పడిపోతారు.. అప్పుడు చక్రితో నువ్వు ఆడుకోవచ్చా.. మనల్ని వద్దనుకున్నవాళ్ల ముందు మనం గొప్పగా ఎదిగి చూపించాలి అని మహా చెప్పడంతో గోపిక మనసు మార్చుకుంటుంది. చక్రిని మరచిపోతానని అంటుంది. ఇద్దరూ నవ్వుతూ బయటకు వస్తారు. అది చూసి కన్నాతోపాటు వాళ్ల ఫ్రెండ్స్ కూడా షాకవుతారు.

ముస్తాబైన నారాయణ.. కత్తి పట్టుకొని గుమ్మం ముందు..

మరోవైపు ఇంట్లో చక్రి టెన్షన్ మరింత పెరుగుతుంది. నారాయణ కొత్త బట్టలతో రెడీ అవుతాడు. చక్రి ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంటే.. నారాయణ కత్తి పట్టుకొని గుమ్మం దగ్గర కూర్చొంటాడు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks