Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ తో చక్రి, గోపిక ప్రేమకు ఫుల్ స్టాప్ పడింది. చక్రితో బాగా ఆడుకున్న తర్వాత చివరికి మహా అతనికి అసలు నిజం చెప్పడంతోపాటు తనపై చక్రికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకుంటుంది. అదే సమయంలో నారాయణ జీవితంలో మరోసారి రెండో భార్య రాబోతోంది.
నలుగురు వస్తున్నారంటూ కేశవ ప్రాంక్..

చక్రితో కేశవ, మాధవ ఆడుకునే సీన్ తోనే సీరియల్ శనివారం (అక్టోబర్ 3) ఎపిసోడ్ మొదలైంది. కన్నాకు ఫోన్ చేసి గోపిక తరఫు వాళ్లు ఎంత మంది వస్తున్నారని అడుగుతాడు కేశవ. అతడు ఏమీ చెప్పకుండానే నలుగురు వస్తున్నారా? పెళ్లి కూతురు, వాళ్ల అమ్మా నాన్న, మిలిటరీ మేన మామ వస్తున్నారా అని తనకు తానే చెప్పుకొని కేశవ ఫోన్ పెట్టేస్తాడు.
దీంతో చక్రిలో టెన్షన్ మరింత ఎక్కువవుతుంది. మరోవైపు నారాయణ తాను ఏ షర్ట్ వేసుకోవాలి.. ఇది బాగుందా అంటూ చక్రిని అడుగుతాడు. దీంతో అతడు ఫ్రస్ట్రేషన్ లో కుర్చీ ఎత్తి నారాయణను కొట్టడానికి వస్తాడు. మాధవ, కేశవ అతన్ని అడ్డుకుంటారు.
గోపిక ఫ్రెండ్‌కు లైనేసిన కన్నా.. కూల్ అయిన గోపిక
మరోవైపు గోపిక దగ్గరికి మహాను తీసుకెళ్లిన కన్నా.. బయట ఆమె ఫ్రెండ్ కు లైన్ వేస్తుంటాడు. గోపిక విషయంలో మీ అన్నయ్య చేసింది తప్పే అని ఆమె ఫ్రెండ్ అంటుంది. అవును తప్పే.. నేనైతే గోపికను వదిలేసి నీకు లైన్ వేసేవాడిని అని అంటాడు. దీంతో ఆమె మొదట కోపంగా చూసినా.. తర్వాత కూల్ అవుతుంది. కన్నా ఫ్లర్టింగ్ కు పడిపోయినట్లే కనిపిస్తుంది. తర్వాత మనం మెచ్యూర్డ్ గా మాట్లాడుకుందాం అని అంటుంది.
వాళ్లు అలా మాట్లాడుకుంటుండగా.. లోపల గోపికను పూర్తిగా కూల్ చేస్తుంది మహా. దీంతో ఆమె భోజనం చేస్తుంది. ఈ బుట్ట బొమ్మ ఇక నుంచి ఎవరికీ అంత ఈజీగా పడొద్దు.. నిన్ను గెలుచుకోవాలంటే అవతలి వాళ్లు పెద్ద యుద్ధమే చేయాలన్నట్లుగా మహా మాట్లాడుతుంది. దీంతో వెంటనే తన ఫోన్ లో చక్రి నంబర్ బ్లాక్ చేయడంతోపాటు అతని ఫొటోలను డిలీట్ చేస్తుంది. అసలు చక్రి ఎవరు అని అడుగుతుంది. ఆ తర్వాత మహా వెళ్లిపోతుంది.
చక్రి మాటలను రికార్డు చేసిన కేశవ..
{{/usCountry}}వాళ్లు అలా మాట్లాడుకుంటుండగా.. లోపల గోపికను పూర్తిగా కూల్ చేస్తుంది మహా. దీంతో ఆమె భోజనం చేస్తుంది. ఈ బుట్ట బొమ్మ ఇక నుంచి ఎవరికీ అంత ఈజీగా పడొద్దు.. నిన్ను గెలుచుకోవాలంటే అవతలి వాళ్లు పెద్ద యుద్ధమే చేయాలన్నట్లుగా మహా మాట్లాడుతుంది. దీంతో వెంటనే తన ఫోన్ లో చక్రి నంబర్ బ్లాక్ చేయడంతోపాటు అతని ఫొటోలను డిలీట్ చేస్తుంది. అసలు చక్రి ఎవరు అని అడుగుతుంది. ఆ తర్వాత మహా వెళ్లిపోతుంది.
చక్రి మాటలను రికార్డు చేసిన కేశవ..
{{/usCountry}}ఇటు ఇంట్లో అందరూ తనను ఏడిపిస్తుండటంతో ఇక తాను ఇంట్లో ఉండనని, తాను వెళ్లిపోతే పెళ్లి ఎలా చేస్తారని చక్రి అంటాడు. అయితే నారాయణ మాత్రం అతన్ని అడ్డుకుంటాడు. అంతేకాదు చక్రి బయటకు వెళ్లకుండా కత్తి పట్టుకొని డోరు బయట కాపలా కాస్తుంటాడు. కనీసం టాయిలెట్ కు వెళ్తానన్నా కూడా చక్రిని బయటకు పంపించడు. దీంతో ఉండబట్టలేక చక్రి తన మనసులో మాట బయటపెడతాడు.
తాను జీవితంలో మహాను తప్ప మరెవరినీ భార్యగా ఊహించుకోలేదని, గోపికతో పెళ్లి తనకు అస్సలు ఇష్టం లేదని, మహాను ఎంతో ప్రేమిస్తున్నానని, ఆమెను ఉడికించడానికే ఇలా చేశాను తప్ప మరే ఉద్దేశం లేదని అంటాడు. కేశవ తెలివిగా ఇదంగా తన ఫోన్ లో వీడియో తీస్తాడు.
దారిలో కన్నా తల్లిని చూసిన మహా
ఆ తర్వాత కన్నా, మహా ఇద్దరూ బండిపై వస్తుంటారు. గోపికను ఎలా కన్విన్స్ చేశారు అని కన్నా అడుగుతాడు. మీ అన్నయ్య ఎంత పెద్ద ఫ్రాడో చెప్పానని ఆమె అంటుంది. కాదు.. మీరు అన్నయ్య గురించి నెగటివ్ గా చెప్పకుండా గోపికనే తప్పు ఎలా చేసిందో చెప్పి కన్విన్స్ చేసి ఉంటారని కన్నా అంటాడు. అలాగే అనుకో అని మహా అంటుంది.
ఇంట్లో చక్రితో అందరూ ఆడుకుంటున్నారట అని కూడా చెప్పడంతో మనం కూడా వెళ్లిన తర్వాత దానిని కంటిన్యూ చేద్దాం అని మహా అంటుంది. అదే సమయంలో కన్నా తల్లి రోడ్డుపై నడుస్తూ వస్తుండటం మహా చేస్తుంది. తాను ఇంట్లో ఆమె ఫొటో చూడటంతో గుర్తు పడుతుంది. కన్నా ఆమెను చూస్తే గొడవ అవుతుందని అనుకొని ఆమె వెళ్లేంత వరకూ దారి మళ్లిస్తుంది. తర్వాత తిరిగి ఇంటికి వెళ్తారు.
చక్రితో మరింత ఆడుకున్న మహా, కన్నా..
మహా ఇంటికి రాగానే నారాయణ వాళ్లు ఎక్కడ అని అడుగుతాడు. నీ రెండో భార్య కనిపించింది.. మీ సంగతి తర్వాత చెబుతాను అని మనసులో అనుకొని మహా లోనికి వెళ్తుంది. ఆ తర్వాత వాళ్లు వెనుక కారులో వస్తున్నారు అని మహా చెప్పడంతో చక్రి మరింత టెన్షన్ పడతారు. దీంతో రూమ్ లోకి వెళ్లి దాక్కొంటానని చక్రి వెళ్లిపోతాడు. ఆ తర్వాత గోపికను కన్విన్స్ చేశానని, ఇక ఆమె మన జోలికి రాదని మాధవ, నారాయణ, కేశవలకు మహా చెబుతుంది.
నన్ను ఉడికించడానికి చక్రి ఆమెతో నవ్వుతూ మాట్లాడటం తప్ప మరే తప్పూ చేయలేదు.. నేను లేకపోతే ఆమెతో మాట్లాడేవాడు కాదు అని కూడా అంటుంది. ఆ తర్వాత చక్రికి మీపై ఎంత ప్రేమ ఉందో చూడండి అంటూ అతని వీడియోను కేశవ చూపిస్తాడు. అది చూసి మహా కూడా ఎమోషనల్ అవుతుంది.
అసలు నిజం చెప్పేసిన మాధవ.. నీకో గుణపాఠం అంటూ..
ఇది చాలదన్నట్లు చక్రితో మరింత ఆడుకోవాలని అతన్ని బయటకు పిలుస్తుంది మహా. పెళ్లి వాళ్లు వచ్చేశారని అంటుంది. బయటకు వచ్చిన తర్వాత ఎవరూ లేకపోవడంతో వాళ్లెక్కడ అని చక్రి అడుగుతాడు. ఎవరూ లేరు.. నీ ముఖానికి రెండో పెళ్లి అవసరమా అని నారాయణ వెళ్లిపోతాడు. ఇది నీకో గుణపాఠం అని, కావాలనే ఇలా చేశామని మాధవ చెబుతాడు.
దీంతో చక్రి ఫుల్ ఖుష్ అవుతాడు. గోపికతో పెళ్లి చేయరా అయితే అంటూ మురిసిపోతాడు. మహా కాస్త పక్కకెళ్లగానే చూశారా ఆమెకు నాపై ఎంత ప్రేమ ఉందో.. అందుకే వెళ్లి గోపికను కన్విన్స్ చేసి వచ్చింది అని బిల్డప్ ఇస్తాడు. అది మహా విని బయటకు వచ్చి చూస్తుంది. అయినా కేశవతో చక్రి అలా బిల్డప్ ఇస్తూ మాట్లాడుతూనే ఉంటాడు. మహా కోపంగా అతని దగ్గరికి వచ్చి మనం సాయంత్రం బయటకు వెళ్లాలి అని చెప్పి వెళ్తుంది. దీంతో చక్రి ఎగిరి గంతేస్తాడు.
కన్నా తల్లి గురించి చెప్పిన మహా
బయటకు వెళ్లిన తర్వాత తాను కన్నా తల్లిని చూసినట్లు చక్రితో మహా చెబుతుంది. దారిలో వస్తుంటే ఆమె కనిపించిందని, ఆమె అడ్రెస్ తెలిస్తే కన్నాకు సర్‌ప్రైజ్ ఇవ్వొచ్చని మహా అనడంతో చక్రి కూడా సరే అంటాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి కన్నా వాళ్ల అమ్మను ఎక్కడ పెట్టారు అని నారాయణను మహా అడుగుతుంది. మా అమ్మను చంపేశావన్నారు.. మరి రెండో భార్యను ఏం చేశావ్ అంటూ చక్రి కూడా నిలదీస్తాడు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.