...
...
Next Story

Podarillu October 5 Episode: పొదరిల్లు.. కన్నా తల్లి జాడ కనిపెట్టిన చక్రి.. మహాకు ఎదురు తిరిగిన నారాయణ.. మాధవకు గాయం

Podarillu Serial October 5th Episode: పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 5 ఎపిసోడ్ లో కన్నా తల్లి విషయంలో నారాయణను మహా, చక్రి నిలదీసినా.. అతని నుంచి ఎలాంటి సమాధానం రాదు. దీంతో చక్రి తన ఫ్రెండ్స్ ద్వారా ఆమె జాడ కనిపెడతాడు.

Published on: Oct 5, 2026, 07:51:51 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. కన్నా తల్లిని తాను చూశానని చక్రికి మహా చెప్పడం, ఇద్దరూ కలిసి నారాయణను నిలదీయడం, అతడు బుకాయించడంలాంటి సీన్లతో సాగిపోయింది. మరోవైపు మాధవ కింద పడి కాలికి గాయం చేసుకుంటాడు. అతనికి మనీషా సేవలు చేస్తుంది.

కారులో చక్రి, మహా లాంగ్ డ్రైవ్..

Podarillu October 5 Episode: పొదరిల్లు.. కన్నా తల్లి జాడ కనిపెట్టిన చక్రి.. మహాకు ఎదురు తిరిగిన నారాయణ.. మాధవకు గాయం
Podarillu October 5 Episode: పొదరిల్లు.. కన్నా తల్లి జాడ కనిపెట్టిన చక్రి.. మహాకు ఎదురు తిరిగిన నారాయణ.. మాధవకు గాయం

కారులో చక్రి, మహా లాంగ్ డ్రైవ్ కు వెళ్లే సీన్ తో సీరియల్ సోమవారం (అక్టోబర్ 5) ఎపిసోడ్ మొదలవుతుంది. గాల్లో తేలినట్లుందే అంటూ చక్రి పాట పాడతాడు. మహా సీరియస్ గా చూస్తుంది. శృతి బాలేదా అని అడిగితే శృతి ఎవరు అని నిలదీస్తుంది. శృతి అంటే అమ్మాయి కాదు.. తాను పాడిన ట్యూన్ అని చక్రి అంటాడు. దీంతో గోపిక విషయంలో మరోసారి చక్రికి క్లాస్ పీకుతుంది. కాసేపటికి రోడ్డు పక్కనే కారు ఆపమంటుంది మహా.

కన్నా తల్లి గురించి చెప్పిన మహా

ఆ తర్వాత కన్నా గాడి తల్లిని తాను చూశానని మహా చెప్పడంతో చక్రి షాక్ తింటాడు. రెండు నెలల కింద ఒకసారి, గోపిక దగ్గరికి వెళ్లి వస్తుంటే మరోసారి చూసినట్లు చెబుతుంది. కన్నాకు ఈ విషయం చెప్పలేదని, గతంలో తన తల్లి గురించి చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడో తెలుసు కదా అని అంటుంది. ఆమె ఇక్కడే ఎక్కడో ఉంటుందని, ఆమె జాడ కనిపెట్టి కన్నా దగ్గరికి తీసుకెళ్తే వాడు సర్‌ప్రైజ్ అవుతాడని ఇద్దరూ అనుకుంటారు. తాను తన ఫ్రెండ్స్ సాయంతో ఆమె జాడ కనిపెడతానని చక్రి అంటాడు.

నారాయణను నిలదీసిన మహా, చక్రి.. కన్నా తల్లిని తీసుకొస్తానని..

నువ్వు ఉన్నావు కదా.. ఆమె ఎందుకు అవసరం లేదు.. అయినా ఆ విషయం గురించి తెలుసుకోకపోవడమే మంచిది అని నారాయణ గట్టిగా చెబుతాడు. ఈసారి చక్రి వినడు. మా అమ్మను చంపావంటున్నారు.. కన్నా గాడి తల్లిని పంపించేశావన్నారు.. అసలు నిజమేంటని అడుగుతాడు. అయినా నారాయణ చెప్పడు. సరే నేనే ఆమెను కనిపెట్టి ఇంటికి తీసుకొస్తానని మహాలక్ష్మి తేల్చి చెబుతుంది. ఇద్దరూ లోనికి వెళ్తుంటే నారాయణలో కంగారు మొదలవుతుంది.

మాధవతో ఆడుకున్న తమ్ముళ్లు

ఆ తర్వాత రాత్రికి అందరూ ఫోన్లు చూస్తూ ఉంటే.. మాధవ వచ్చి తిడతాడు. పడుకోండని వార్నింగ్ ఇవ్వడంతో తమ్ముళ్లందరూ భయపడి పడుకుంటారు. తర్వాత మాధవ తన ఫోన్లో మనీషా ఫొటో చూసి మురిసిపోయి పడుకుంటాడు. వెంటనే ఆమె నుంచి ఫోన్ రావడంతో అందరూ లేచి చూస్తారు. అన్నయ్యతో ఆడుకుంటారు.

క్యా జీ.. ఫోన్ లిఫ్ట్ చేయ్ జీ.. నిద్ర నహీ ఆరా జీ.. అంటూ వెటకారంగా అంటారు. దీంతో మాధవ వాళ్లను మరోసారి తిడతాడు. కిచెన్ లోకి వెళ్లి వచ్చీ రాని హిందీలో రేపు ఉదయం కాల్ చేస్తానని మనీషాకు చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత ముగ్గురు తమ్ముళ్లు కిచెన్ లోకి వెళ్లి ఆట పట్టిస్తారు. అతడు వెంట పడి కొట్టడంతో అందరూ పడుకుంటారు.

కిందపడిన మాధవ.. కాలికి గాయం

తర్వాత మాధవకు ఫోన్ రావడంతో పరుగెత్తుకుంటూ వస్తాడు. ఈ క్రమంలో చక్రి కాలు తగిలి కింద పడిపోతాడు. దీంతో అతనికి కాలు బెణుకుతుంది. నొప్పితో మాధవ విలవిల్లాడుతుంటే.. మహాతోపాటు అందరూ అతనికి దగ్గరికి వస్తారు. నారాయణ కూడా వచ్చి చూస్తాడు.

హాస్పిటల్ కు వెళ్దామని మహా అంటే.. ఈ మాత్రం దానికి అవసరం లేదు.. తానే నూనెతో మసాజ్ చేస్తానని నారాయణ అంటాడు. మాధవ నొప్పితో విలవిల్లాడుతున్నా మసాజ్ చేస్తూనే ఉంటాడు. చక్రి, కేశవ తిట్టడంతో సరే మీ ఇష్టం అని మధ్యలోనే వదిలేసి వెళ్తాడు. మరుసటి రోజు ఉదయం పెద్ది పని కోసం వెళ్లడానికి రెడీ అయితే మహా, చక్రి అడ్డుకుంటారు.

విలవిల్లాడిపోయిన మనీషా

గాయం పూర్తి మానే వరకు వద్దని వారిస్తారు. దీంతో బన్సీకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి పనికి రావడం లేదని మాధవ చెబుతాడు. బన్సీ సరే అంటాడు. మాధవ కాలికి గాయమైనట్లు బన్సీ చెప్పడంతో మనీషా విలవిల్లాడిపోతుంది. నూనె తీసుకొని తాను ఆయన దగ్గరికి వెళ్లి వస్తానని అంటుంది.

కన్నా తల్లి జాడ కనిపెట్టిన చక్రి

ఇటు మాధవకు గాయం కావడంతో అతన్ని వంటింట్లోకి రాకుండా మహా, కన్నా, కేశవ వంట చేస్తుంటారు. చక్రి వచ్చి తాను కూడా చేస్తానంటే అంట్లు తోమమంటారు. అప్పుడే చక్రికి ఫోన్ వస్తుంది. అతడు బయటకు వెళ్లి మాట్లాడి వచ్చి.. కన్నా తల్లి జాడ తెలిసిందని మహా చెవిలో చెబుతాడు. అది విని కన్నా షాక్ అవుతాడు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks