Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో ఓవైపు మాధవ, మనీషా రొమాన్స్ తోపాటు కేశవకు ఓ కొత్త సమస్య రావడం, దానికి ఇంట్లో వాళ్లంతా అండగా ఉండి పరిష్కరించడం చూడొచ్చు. అటు భార్య మహా కోసం చక్రి పర్ఫ్యూమ్ తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
లక్కీకి రూ.25 కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చిన విక్కీ

లక్కీకి విక్కీ రూ.25 కోట్ల ప్రాజెక్ట్ అప్పగించే సీన్ తో సీరియల్ బుధవారం (అక్టోబర్ 7) ఎపిసోడ్ మొదలైంది. అదే ఆనందంతో మహా ఎగిరి గంతేస్తుంది. విక్కీ ముద్దు పెట్టాడా ఏంటీ అని కొలీగ్ అడగడంతో మహా సీరియస్ అవుతుంది. విక్కీకి నీపై ప్రేమ ఉంది కాబట్టే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చాడని అంటుంది. అప్పుడే విక్కీ వచ్చి తాను పని విషయంలో పక్కాగా ఉంటానని, ఇష్టాయిష్టాలతో పని లేదని అంటాడు. దీంతో ఆమె వెళ్లిపోతుంది.
ఆ తర్వాత మహాను నీ పర్ఫ్యూమ్ ఏంటని విక్కీ అడుగుతాడు. ఎందుకని అడిగితే.. నీలాగే చాలా మైల్డ్ గా ఉందని అని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో మహా కొలీగ్ ఆమెను మరింత ఆట పట్టిస్తుంది. ఫోకస్ విక్కీపై కాదు పనిపై పెట్టు అని క్లాస్ పీకుతుంది.
కన్నా తల్లి జాడ కోసం చక్రి వెతుకులాట
మరోవైపు కన్నా తల్లి జాడ కోసం చక్రి తన ఫ్రెండ్ తో కలిసి వెతుకుతుంటాడు. ఆమె బస్తీలో ఉంటుందని తెలిసి అక్కడికి వెళ్లి ఆమె ఫొటో చూపిస్తూ అందరినీ అడుగుతాడు. కానీ ఎవరూ ఆమెను చూడలేదని అంటారు. దీంతో చక్రి నిరాశ చెందుతాడు. అయినా ఆమె కోసం వెతుకులాట కొనసాగిస్తుంటాడు.
కాలు నొప్పితోనే మాధవ పని.. మనీషా క్లాస్
అటు మాధవ కాలి నొప్పితోనే పనికి వెళ్తాడు. నొప్పి తగ్గకుండా ఎందుకు వచ్చారని బన్సీ అడుగుతాడు. అప్పుడే మనీషీ కూడా వస్తుంది. మాధవకు క్లాస్ పీకుతుంది. నొప్పితో రావాల్సిన అవసరం ఏంటని అడుగుతుంది. ఆ తర్వాత అందరి ముందే మాధవ కాలికి మళ్లీ సేవలు చేస్తుంది. తాను తెచ్చిన స్వీట్ పోహాను తినమంటుంది. తనకూ తినిపించమంటుంది. దీంతో అక్కడున్న అందరూ మాధవను నవ్వుతూ చూస్తారు. అయినా మనీషాకు మాధవ స్వీట్ తినిపిస్తాడు.
కేశవకు షాక్.. షాపు ప్లేస్ అమ్మేస్తానన్న ఓనర్
{{/usCountry}}అటు మాధవ కాలి నొప్పితోనే పనికి వెళ్తాడు. నొప్పి తగ్గకుండా ఎందుకు వచ్చారని బన్సీ అడుగుతాడు. అప్పుడే మనీషీ కూడా వస్తుంది. మాధవకు క్లాస్ పీకుతుంది. నొప్పితో రావాల్సిన అవసరం ఏంటని అడుగుతుంది. ఆ తర్వాత అందరి ముందే మాధవ కాలికి మళ్లీ సేవలు చేస్తుంది. తాను తెచ్చిన స్వీట్ పోహాను తినమంటుంది. తనకూ తినిపించమంటుంది. దీంతో అక్కడున్న అందరూ మాధవను నవ్వుతూ చూస్తారు. అయినా మనీషాకు మాధవ స్వీట్ తినిపిస్తాడు.
కేశవకు షాక్.. షాపు ప్లేస్ అమ్మేస్తానన్న ఓనర్
{{/usCountry}}ఇంకోవైపు కేశవకు పెద్ద సమస్యే వస్తుంది. అతడు షాపు నడిపుతున్న స్థలం ఓనర్ కేశవ దగ్గరికి వస్తాడు. తనకు డబ్బు అవసరం ఉందని, అందుకే ఈ స్థలాన్ని అమ్మేద్దామనుకుంటున్నట్లు చెబుతాడు. అలా చేస్తే తనకు సమస్య వస్తుంది కదా అని కేశవ అంటాడు. ఏం కాదు.. వచ్చిన కొత్త ఓనర్ నీకు ఇస్తాడులే అని అతడు చెబుతాడు.
ఒకవేళ ఇవ్వకపోతే ఎలా అని కేశవ అంటాడు. అలా అయితే ఎవరికో అమ్మడం ఎందుకు.. నువ్వే ఈ స్థలం తీసుకో.. చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నావు కదా.. నీకోసం రూ.50 వేలు తగ్గిస్తాను అని అంటాడు. కానీ అంత డబ్బు తన దగ్గర లేదని కేశవ చెబుతాడు. అయితే కాస్త సమయం ఇవ్వాలని, ఇంట్లో వాళ్లతో మాట్లాడి చెబుతానని అంటాడు.
ఇంట్లో షాపు విషయం చెప్పిన కేశవ.. అన్నదమ్ముల సపోర్ట్
అటు ఇంట్లో అప్పటికే మాధవను కన్నా, చక్రి కలిసి ఆడుకుంటూ ఉంటారు. చెపాతీ చేయాలా అని అడగడంతో నార్త్ ఇండియా కూరలు వద్దంటూ వచ్చీరాని హిందీలో కన్నా, చక్రి కలిసి మాధవను ఎగతాళి చేస్తుంటారు. అప్పుడే ఇంటికి దీనంగా వస్తాడు కేశవ. అతని ముఖం చూసి చక్రి, కన్నా ఆట పట్టిస్తారు. నీకు, బుస్సుకు బ్రేకప్ అయిందా అని, పెళ్లి కాకుండా తండ్రివి అవుతున్నావా అని అంటారు. మహా వచ్చి క్లాస్ పీకడంతో కామవుతారు.
ఆ తర్వాత షాపు దగ్గర జరిగిన విషయం కేశవ చెబుతాడు. అది నీకు గుడ్ న్యూసే కదరా.. షాపుకు నువ్వే ఓనర్ అవుతావు కదా అని మాధవ అంటాడు. అంత డబ్బు తన దగ్గర లేదని కేశవ అంటే.. డబ్బు సంగతి వదిలెయ్.. అందరం కలిసి చూద్దాం అని చక్రి, మాధవ అతనికి అండగా నిలబడతారు. ఆ తర్వాత ఓనర్ అంటూ కన్నా, చక్రి మరోసారి కేశవను ఆట పట్టిస్తారు.
మహాకు చక్రి పర్ఫ్యూమ్..
మహా కోసం చక్రి ఓ పర్ఫ్యూమ్ తీసుకొస్తాడు. దానిని చేతిలో పట్టుకొని డ్యాన్స్ చేస్తుంటాడు. దానిని ఆమెకు ఇస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆలోచిస్తుంటాడు. ఒకప్పుడు నైటీ తీసుకొస్తే పెద్ద గొడవ చేసింది.. ఇప్పుడిది ఇస్తే ఏమంటుందో అని అనుకుంటాడు. ఆమె వచ్చి తనను తిట్టినట్లు, పర్ఫ్యూమ్ వద్దన్నట్లు కల కంటాడు. అయితే ఆ తర్వాత మహా నిజంగానే వస్తుంది. చక్రి చేతుల్లో ఉన్న పర్ప్యూమ్ చూసి తనకోసమే తీసుకొచ్చావా అంటూ దానిని తీసుకెళ్లిపోతుంది.
మాధవ దగ్గర ఇరికించిన మహా
మరుసటి రోజు చక్రి ఫోన్ చూస్తూ ఉండగా.. మాధవ దగ్గరికి వెళ్లి అతన్ని మహా ఇరికిస్తుంది. కేశవ గురించి మాట్లాడాలని, ఈ ఇంట్లో మీ తర్వాత పనికొచ్చే పని చేసేది అతడే కదా అని మాధవతో మహా అంటుంది. అంటే నేను పనికి రాని వాడినా అని చక్రి అంటాడు. ఇప్పటికీ ఫోన్ పట్టుకొని అమ్మాయిలు, ఆంటీలతో చాటింగ్ చేస్తున్నాడని మహా చెప్పడంతో మాధవ అతన్ని మందలిస్తాడు.
ఆ తర్వాత కేశవ గురించి మాట్లాడుతుంది మహా. మనమందరం కలిసి కేశవకు ఆ స్థలాన్ని గిఫ్ట్ గా ఇద్దామని చెబుతుంది. తాను కూడా అదే ఆలోచిస్తున్నట్లు మాధవ అంటాడు. దీంతో కేశవ తన షాపుకు ఓనర్ అయిపోవడం, అతని జీవితం మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు కన్నా తల్లి కోసం వెతుకుతూనే ఉన్న చక్రి.. చివరికి ఆమె జాడ కనిపెట్టేస్తాడు. ఆమె తన రెండో భర్తతో ఉండటం చూసి మహాకు ఫోన్ చేస్తాడు. అయితే ఈ విషయం తెలిసిన కన్నా, నారాయణ షాకవుతారు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.