...
...
Next Story

Podarillu September 15 Episode: పొదరిల్లు- షాకిచ్చిన పంతులు- మాధవకు దొరికిపోయిన తమ్ముళ్లు-జయంతి మాజీ భర్తతో చక్రి ప్లాన్

Podarillu Serial September 15th Episode: పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 15వ ఎపిసోడ్‌‌లో మాధవ నిశ్చితార్థం ఆపేందుకు నారాయణ తాగి పెద్ద రచ్చ చేస్తాడు. మందు కావాలంటాడు. దాంతో శశిపాల్ చాలా మందు బాటిల్స్ చూపించి తాగమంటాడు. డీల్ మాట్లాడిన పంతులు కేశవ, కన్నాకు పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. మాధవ అందరిని నిలదీస్తాడు.

Published on: Sep 15, 2026, 09:55:05 IST
Advertisement

Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నిశ్చితార్థం చెడగొట్టడానికి సంభావణకు మూడింతలు కావాలని పంతులు డిమాండ్ చేస్తాడు. దాంతో అడ్వాన్స్ కింద కొంత అమౌంట్ ఇస్తారు కన్నా, కేశవ. మిగతా అమౌంట్ తర్వాత ఇస్తామంటారు. సరే అని పంతులు చెబుతాడు.

నారాయణ బెదిరింపు

పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 15 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 15 ఎపిసోడ్

మరోవైపు చక్రి, నారాయణను జయంతి మాజీ భార్య కలుస్తాడు. నారాయణను బాబాయ్ అంటాడు. దాంతో కాలర్ పట్టుకుని నారాయణ బెదిరిస్తాడు. జయంతి మాజీ భర్త మనసు బాగాలేదు. మీ దగ్గర మందు చూశాను. కలిసి తాగుదామా అని అడుగుతాడు. నీతో కలిసి తాగను. పోరా అని తిడతాడు నారాయణ. భార్యలకు భర్త లోకువ అయితే బర్రెలకు కూడా లోకువ అవుతాడన్నమాట అని ఏడుస్తూ వెళ్లిపోతాడు జయంతి మాజీ భర్త.

ఇంతలో మహాలక్ష్మి, కేశవ, కన్నా వస్తారు. పంతులును పట్టుకుని మాట్లాడిన జాతకాల డీల్ గురించి చెబుతారు కేశవ, కన్నా. మాధవ నమ్మడని మహా అంటుంది. నాకో ఐడియా వచ్చింది. ఇంత టైమ్ ఇస్తే మందు తాగి రచ్చ రచ్చ చేస్తాను. దాంతో నిశ్చితార్థం ఆగిపోతుందని నారాయణ అంటాడు. తాగితే మీకు కంట్రోల్ ఉండదు. అసలు విషయం మర్చిపోతారు. తాగకుండా తాగినట్లు గొడవ చేసి రచ్చ చేయండని మహాలక్ష్మి ఐడియా ఇస్తుంది.

సరేనని నారాయణ వెళ్లి ఎవరు చూడట్లేదని కొంత మందు తాగుతాడు. ఒకడిని పట్టుకుని ఊరికే కొడతాడు. హాల్లో ఎవరు లేరేంటని శిశుపాల్ అంటూ శశిపాల్‌ను అరుస్తూ పిలుస్తాడు. శశిపాల్, జయంతి తండ్రి వస్తారు. మాకు సరిగా మర్యాదలు చేశారేంట్రా. అడుక్కోడానికి వచ్చామా అని నానా మాటలు అంటూ గొడవ చేస్తాడు నారాయణ.

నారాయణ మందు గోల

ఇప్పుడు మీ సమస్య ఏంటీ అని శశిపాల్ అడిగితే.. మందు కావాలి, మటన్ కూడా కావాలని నారాయణ అంటాడు. నాతో రండి అని నారాయణను తీసుకెళ్తాడు శశిపాల్. వాళ్లిద్దరినే మహాలక్ష్మి వాళ్లు ఫాలో అవుతారు. ఓ గదిలోకి తీసుకెళ్లి మందు బాటిళ్లు చూపించి మీకు నచ్చినంత తాగండి. ఫ్రెండ్స్ కోసం తెప్పించా. మీరు తాగి ఎంజాయ్ చేయండి అని శశిపాల్ చెప్పేసి వెళ్లిపోతాడు.

వీడేంటీ మందు అడిగితే.. మందు ఫ్యాక్టరీనే ఇప్పించాడని నారాయణ మందుకు టెంప్ట్ అవుతాడు. అంటే, ఈ ప్లాను ఫ్లాపేనా అని వెనక్కి తిరిగి వెళ్తాడు. అదే విషయం వెళ్లి మాహాకు చెబుతాడు. ఇంకా ఈ నిశ్చితార్థాన్ని ఆపలేమా అని మాట్లాడుకుంటాం. అది విన్న మాధవ వచ్చి ఏం మాట్లాడుకుంటున్నార్రా అని నిలదీస్తాడు. అంతా ఏదోటి చెప్పి కవర్ చేసి వెళ్తారు.

పెద్ద షాక్ ఇచ్చిన పంతులు

రెండు కుటుంబాలను కూర్చొబెట్టి జాతకాలు చూస్తాడు పంతులు. ఇంతకుముందు మీ జాతకాలు కలిస్తే మీ పెళ్లి ఎందుకు నిలబడలేదు. అందుకే మరోసారి చూస్తున్నా అని పంతులు అంటాడు. ఎలా ఉన్నాయి జాతకాలు అని జయంతి తండ్రి అడుగుతాడు. అద్భుతంగా ఉన్నాయని కేశవ, కన్నాకు పెద్ద షాక్ ఇస్తాడు పంతులు. జంట కలిస్తే ఆ వంశం ఎన్నో తరాలు నిలబడుతుంది అంటాడు.

నా పెళ్లానికి పెళ్లి జరుగుతోంది మళ్లీ మళ్లీ అని జయంతి మాజీ భర్త అనుకుని వెళ్లిపోతాడు. ఇక అందరూ ప్రశాంతంగా ఉండండి అని మాధవ అంటాడు. అంతా వెళ్లిపోతారు. ఏంటీ మీరు చేసిన పని. మేము చెప్పిందేంటీ మీరు చేసిందేంటీ అని కేశవ, కన్నా పంతులును నిలదీస్తారు. నేను నా వృత్తికి ద్రోహం చేయలేను. డబ్బుతో నన్ను కొనలేరు అని పంతులు ట్విస్ట్ ఇచ్చి వెళ్లిపోతాడు.

కేశవ, కన్నాను మాధవ పిలుస్తున్నాడని, కోపంగా ఉన్నాడని గాయత్రి చెబుతుంది. చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నారుగా అని మాధవ అంటాడు. ఏం చేశామని కేశవ అంటే.. ఏయ్ అని కోపంగా అరుస్తాడు మాధవ. అంతా భయపడతారు. నా పెళ్లి ఆపాలని ఎందుకు ఇంతగా ప్రయత్నం చేస్తున్నారని నిలదీస్తాడు. మీరు మీ కుటుంబం కోసం త్యాగం చేస్తున్నారు. అది మాకు ఇష్టం లేదని మహా అంటుంది.

మాధవకు నిజం చెప్పిన కేశవ

ఆవిడ పంతానికే పెళ్లి చేసుకుంటుంది తప్పా ఇష్టంతో కాదు. పెళ్లయ్యాకా మిమ్మల్ని మీ కుటుంబానికి దూరం చేస్తే ఉండగలరా అని మహా అంటుంది. నేను నచ్చజెప్పుకుంటాను. ఎందుకు భయపెడుతున్నారని మాధవ అంటాడు. శైలు మాటలు విని ఈ పెళ్లి చేసుకుంటున్నావని మాకు తెలిసిపోయింది అని కేశవ అంటాడు. దాంతో మాధవ షాక్ అవుతాడు.

మీ అందరిని చెడగొడుతోంది వీడే అని చక్రిని నిందిస్తాడు మాధవ. మన ఇంటికున్న పేరు పోవాలంటే నాకు ఎవరు అడ్డు పడొద్దు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అడ్డుపడకండి. నా వాళ్లే నాకు శత్రువులాగా మారారు ఛీ అనుకుంటూ పెద్ది వెళ్లిపోతాడు. ఇప్పుడు ఇక ఏ ప్లాన్ వేసినా అన్నయ్య ఊరుకోడు అని కన్నా అంటాడు.

జయంతి మాజీ భర్తతో చక్రి ప్లాన్

తర్వాత రాత్రి జయంతి మాజీ భర్తతో చక్రి తాగుతాడు. జయంతిపై ఉన్న ప్రేమను చెబుతాడు. అంత ప్రేమ ఉన్నప్పుడు వెళ్లి మీ భార్యతో మాట్లాడొచ్చుగా. నిశ్చితార్థం ఆపడానికి నా దగ్గర ఓ ఐడియా ఉందని చెబుతాడు చక్రి. జయంతి మాజీ భర్తతో పెద్ది నిశ్చితార్థం చెడగొట్టేందుకు వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో అని మహాతో అంటాడు చక్రి. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks