Podarillu September 16 Episode: పొదరిల్లు.. చక్రి ప్లాన్ సక్సెస్.. శేఖర్‌తో వెళ్లిపోయిన జయంతి.. మనీషాతో మాధవ పెళ్లి ఖాయం
Podarillu Serial September 16th Episode: పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 16 ఎపిసోడ్ లో మాధవ, జయంతి నిశ్చితార్థాన్ని ఆపడంలో చక్రి సక్సెస్ అవుతాడు. ఆమె శేఖర్ తో కలిసి వెళ్లిపోతుంది. ఇటు మనీషాతో మాధవ పెళ్లి ఖాయమవుతుంది.
Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో పెద్ది నిశ్చితార్థం ఆపడానికి చక్రి, మహా చేసిన ప్లాన్స్ మొత్తానికి సక్సెస్ అవుతాయి. చివరి నిమిషంలో రంగంలోకి దిగిన మాజీ భర్త శేఖర్ సీన్ మొత్తాన్ని మార్చేస్తాడు. జయంతి అతనితో వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

ఆవేశంతో రగిలిపోయిన శేఖర్.. అటు నుంచి నరుక్కొచ్చిన చక్రి
ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోవడంతో ఇక పెద్ది నిశ్చితార్థం ఆపలేమని మహాలక్ష్మి ఫీలయ్యే సీన్ తో సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 16) ఎపిసోడ్ మొదలైంది. అయితే అప్పుడే శేఖర్ ను చూస్తాడు చక్రి. మరో ప్లాన్ వేస్తాడు. అటు శేఖర్ ఆవేశంతో రగిలిపోతుంటాడు.
ఫుల్ బాటిల్ తీసుకెళ్లి తాగుతాడు. తన ముందే జయంతి మరొకరిని పెళ్లి చేసుకోబోతుండటాన్ని జీర్ణించుకోలేకపోతాడు. అప్పుడే చక్రి కూడా గ్లాసు పట్టుకొని ఎంట్రీ ఇస్తాడు. మీ బాధ అర్థం చేసుకోగలను అంటూ శేఖర్ తో మాట కలుపుతాడు. దీంతో శేఖర్ కూడా అతనికి మందు పోసి తన బాధ చెప్పుకోవడం ప్రారంభిస్తాడు.
జయంతి అంటే ప్రాణమన్న శేఖర్.. విడాకుల స్టోరీ చెప్పి..
తాను, జయంతి ప్రేమించుకొని, పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నామని శేఖర్ చెబుతాడు. జయంతి అంటే తనకు ప్రాణమని, ఇష్క్, ప్రేమ, కాదల్ అంటూ ఫుల్లుగా తాగి మాట్లాడుతాడు. అలాంటి అమ్మాయిని ఎందుకు దూరం చేసుకుంటున్నారు అని చక్రి అడుగుతాడు. జయంతి చాలా మంచిదని, అయితే ఆమెకు ఉన్నఒకే ఒక్క సమస్య పొగరు అని శేఖర్ చెబుతాడు.
తాను కూడా చాలా భరించానని, అయితే ఇక కుదరకపోవడంతో ఇద్దరం పోట్లాడుకున్నామని అంటాడు. అందుకే విడాకులు ఇస్తానని బెదిరించానని, అంతేకాదు నీ కంటే ముందే మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాననీ చెప్పానని శేఖర్ చెబుతాడు. దీంతో ఆమె పంతానికి పోయి ఇలా మీ అన్నయ్యతో నిశ్చితార్థానికి రెడీ అయిందని, ఇప్పుడేం చేయాలో ఏంటో అని బాధపడతాడు.
దీంతో చక్రి ఈ నిశ్చితార్థాన్ని చెడగొట్టే ప్లాన్ తన దగ్గర ఉందని, మీరు కాస్త సిగ్గు విడిచి ఆ పని చేయాలని అంటాడు. జీవితమే పోతుంటే సిగ్గేంటి బ్రదర్.. చెప్పండి చేస్తా అనడంతో చక్రి తన ప్లాన్ చెబుతాడు.
పెద్ది తాంబూలాలు అందుకున్న చక్రి, మహా
అటు నిశ్చితార్థానికి అంతా సిద్ధమవుతుంది. పీటలపై జయంతి, మాధవ కూర్చుంటారు. నీ ప్లాన్ ఏమైందని చక్రిని మహా నిలదీస్తుంది. తాను చేయాల్సిందంతా చేశానని, ఆయనకు ఏం చెప్పాలో అది చెప్పానని, ఇక అంతా ఆ దేవుడి దయ, మన అదృష్టం అని చక్రి అంటాడు. అప్పుడే మాధవ తరఫున తాంబూలాలు ఎవరు అందుకుంటారని పంతులు అడుగుతాడు. తన భర్త రాలేదని గాయత్రి చెబుతుంది.. తన భార్య లేదని నారాయణ అంటాడు.
చివరికి చక్రి, మహా వైపు చూస్తూ మీరు భార్యాభర్తలే కదా మీరే తీసుకోండి అని అనడంతో వాళ్లు సరే అంటాడు. తాంబూలాలు మార్చుకుంటుండగా కూడా ఈ పెళ్లి మీకు సమ్మతమేనా.. మరోసారి ఆలోచించుకోండి అని జయంతి తండ్రి అడుగుతాడు. అప్పుడు కూడా వాళ్లు ఇద్దరూ ఇష్టమే అంటారు. దీంతో తాంబూలాలు మార్చుకుంటారు. తర్వాత ఇద్దరూ బట్టలు మార్చుకోవడానికి వెళ్తారు. ఇక నిశ్చితార్థం అయిపోయినట్లే అని తాయారు అంటుంది.
పెద్ద ట్విస్టే ఇచ్చిన జయంతి.. నిశ్చితార్థానికి నో చెప్పి..
మొదట మాధవ బట్టలు మార్చుకొని వస్తాడు. ఆ తర్వాత జయంతి కోసం అందరూ వేచి చూస్తుంటారు. అప్పుడే జయంతి వస్తుంది. ఈ నిశ్చితార్థం జరగడం లేదని ఆమె అనడంతో అందరూ షాక్ తింటారు. చక్రి, మహా, నారాయణ, కేశవ తెగ సంతోషిస్తారు. ఏమైందని ఆమెను తల్లి నిలదీస్తుంది. అటు మాధవ కూడా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు.
తాను చేసిన తప్పును శేఖర్ తెలుసుకున్నాడని, ఇక అతనితోనే తాను కలిసి ఉండాలని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పడంతో మాధవ షాక్ తింటాడు. ఇంత వరకూ వచ్చిన తర్వాత నిశ్చితార్థం రద్దు చేసుకుంటున్నందుకు జయంతి క్షమాపణ చెబుతుంది. ఇందులో ఎవరి తప్పూ లేదని, తనకు తానుగా ఈ నిర్ణయం తీసుకున్నానని అంటుంది. పైకి బాధ నటిస్తూ లోపల చాలా సంతోషిస్తారు మాధవ ఫ్యామిలీ మెంబర్స్.
చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చిన శేఖర్.. వెళ్లిపోయిన జయంతి
అటు శేఖర్ చివరి నిమిషంలో ఎంట్రీ ఇస్తాడు. అవును.. నేను చేసిన తప్పును తెలుసుకున్నాను.. ఇక నుంచి జయంతితో కలిసి ఉంటాను.. విడాకుల నిర్ణయం మార్చుకున్నాను అని అంటాడు. చివరి నిమిషంలో తనకు జ్ఞానోదయం కలిగేలా చేసిన ఆ అజ్ఞాత దేవుడికి నమస్కారం అని చక్రిని చూస్తూ శేఖర్ అంటాడు.
అప్పుడే పెద్దికి అనుమానం వస్తుంది. అది చక్రి పనే అని అర్థమవుతుంది. ఆ తర్వాత శేఖర్ తో కలిసి జయంతి వెళ్లిపోతుంది. అయితే ఇదేమైనా పిల్లలాట అనుకుంటున్నారా.. తాంబూలాలు మార్చుకున్న తర్వాత నిశ్చితార్థం అయిపోయినట్లే అని తాయారు గొడవకు దిగుతుంది.
ఇంట్లో నుంచి వెళ్లిపోయిన పెద్ది.. మనీషాతో పెళ్లి
అటు మాధవ బాధలో కూరుకుపోతాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. చక్రి, కేశవ ఎంత వెతికినా దొరకడు. అయితే మాధవ బన్సీ ఇంటికి వెళ్తాడు. బాధగా కూర్చొన్న అతన్ని బన్సీ వచ్చి మనీషాను పెళ్లి చేసుకుంటారా అని అడుగుతాడు.
మనీషాను అడగకుండా నువ్వు అలా అడగడం కరెక్ట్ కాదు.. ఆమెను పిలవండి అని పెద్ది అంటాడు. మనీషా కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది అని బన్సీ చెప్పడంతో ఇద్దరూ చాలా సంతోషిస్తారు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


