Podarillu September 26 Episode: పొదరిల్లు.. చక్రి నాటకానికి ది ఎండ్.. ఇంటికొచ్చిన గోపిక ఫ్రెండ్స్.. మంచాన పడ్డ నారాయణ

Podarillu Serial September 26th Episode: పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 26 ఎపిసోడ్ లో గోపిక విషయంలో చక్రి పూర్తిగా ఇరుక్కుంటాడు. బయటకు రాలేని పరిస్థితుల్లో కూరుకుపోతాడు. మరోవైపు నారాయణ మంచాన పడతాడు.

Published on: Sep 26, 2026, 07:09:50 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ చక్రి లవ్, అందులో నుంచి తప్పించుకునేందుకు అతడు చేసే ప్రయత్నాలు చుట్టూ తిరుగుతుంది. చక్రి తనకు ప్రపోజ్ చేశాడని అపోహ పడిన గోపిక అతడే తన కాబోయే వాడని చెప్పేస్తుంది. దీంతో పూర్తిగా ఇరుక్కుపోయానని భావించిన చక్రి.. ఆమె నుంచి దూరం జరగడానికి ప్రయత్నిస్తాడు.

Podarillu September 26 Episode: పొదరిల్లు.. చక్రి నాటకానికి ది ఎండ్.. ఇంటికొచ్చిన గోపిక ఫ్రెండ్స్.. మంచాన పడ్డ నారాయణ
Podarillu September 26 Episode: పొదరిల్లు.. చక్రి నాటకానికి ది ఎండ్.. ఇంటికొచ్చిన గోపిక ఫ్రెండ్స్.. మంచాన పడ్డ నారాయణ

గోపికకు చక్రి లవ్ ప్రపోజ్.. అతడే కాబోయేవాడన్న గోపిక

గోపిక బర్త్ డే సెలబ్రేషన్స్ సీన్ తోనే సీరియల్ శనివారం (సెప్టెంబర్ 26) ఎపిసోడ్ మొదలైంది. గోపిక ఫ్రెండ్స్ బలవంతంతో మొదట కేక్ చక్రికే తినిపించడంతోపాటు చక్రి కూడా గోపికకు కేక్ తినిపించాల్సి వస్తుంది. ఆ తర్వాత తనకు ఏం గిఫ్ట్ తీసుకొచ్చారని చక్రిని ఆమె ఆశగా అడుగుతుంది. తాను ఏమీ తీసుకురాకపోవడంతో అందరినీ కళ్లు మూసుకోమని పక్కనే ఉన్న బొకే నుంచి ఓ రోజ్ తీసి ఇస్తాడు.

అది చూసి గోపికకు చక్రి లవ్ ప్రపోజ్ చేస్తున్నాడని ఫ్రెండ్స్ ఆట పట్టిస్తారు. గోపిక మాత్రం చక్రిని సీరియస్ గానే తన లైఫ్ పార్ట్‌నర్, తన కాబోయే వాడు అని అందరి ముందు అనౌన్స్ చేసింది. దీంతో చక్రికి చెమటలు పడతాడు. ఏం చేయాలో అర్థం కాక మెల్లగా పార్టీ నుంచి జారుకుంటాడు. తన నాటకానికి ది ఎండ్ కార్డ్ వేయాలన్న ఆలోచనలో పడతాడు.

ఫొటోలు చూసి మహా కుళ్లు.. చక్రిని ఆట పట్టించి.. పెద్ది వార్నింగ్

ఇటు ఇంట్లో అందరూ తినడానికి కూర్చుంటారు. చక్రి ఎక్కడ అని పెద్ది అడిగితే.. బస్టాప్ అమ్మాయి బర్త్ డేకు వెళ్లాడని మహా అంటుంది. వాడికి దెబ్బ పడాలి అని మాధవ అంటాడు. ఆ తర్వాత కన్నా ఫోన్ చూస్తుంటే గోపిక ఫ్రెండ్ సత్య సోషల్ మీడియాలో షేర్ చేసిన బర్త్ డే ఫొటో కనిపిస్తుంది. దానిని చూసిన మహా మరింత కుళ్లుకుంటుంది. అప్పుడే చక్రి వస్తాడు.

టైమ్ కు వచ్చానా అని తినడానికి కూర్చొంటాడు. మీ గోపిక పెట్టలేదా అని మహా వెటకారంగా అడుగుతుంది. స్టార్ హోటల్లో పార్టీ ఇచ్చారు.. కానీ నేనే మా అన్నయ్య చేతి వంటే తినాలని ఫిక్సయిపోయి ఇంటికి వచ్చాను కవర్ చేసుకుంటాడు. కానీ పెద్ది మాత్రం అతనికి వార్నింగ్ ఇస్తాడు. చాలా ఎక్కువైపోయింది.. ఇక చాలని అంటాడు. అప్పుడే గోపిక చక్రికి ఫోన్ చేస్తుంది. అతడు తీయకపోయినా పదేపదే చేస్తూనే ఉండటంతో చక్రి తినకుండానే మధ్యలో లేచి వెళ్లిపోతాడు.

పెద్ది నార్త్ ఇండియా వంటకం.. ఆట పట్టించిన తమ్ముళ్లు

ఇక మరుసటి రోజు ఉదయాన్నే మాధవ దగ్గరికి వెళ్లి అతన్ని హగ్ చేసుకుంటాడు కన్నా. ఎందుకురా ఏమైనా కావాలా అని అడిగితే.. ఏం లేదు నువ్వు సంతోషంగా ఉన్నావ్.. అందుకే మేమూ సంతోషంగా ఉన్నామంటాడు. మహా కూడా అదే అంటుంది. చక్రి ఎక్కడ అని పెద్ది అడిగితే.. గదిలో ఉన్నాడు.. ఎందుకో నిన్నటి నుంచి డల్లుగా ఉన్నాడని కన్నా చెబుతాడు.

పిలువు మాట్లాడదామని మాధవ చెప్పడంతో చక్రి వస్తాడు. ఏం జరిగిందని పెద్ది అడిగితే ఏం లేదు.. కాస్త తలనొప్పిగా ఉందని చక్రి చెబుతాడు. ఆ తర్వాత ఏం వండావ్ అని మాధవను కేశవ అడుగుతాడు. చోలే మటర్ కర్రీ అని చక్రి అంటాడు. సౌత్ కాస్తా నార్త్ ఇండియన్ అయిందే అని మహాతోపాటు తమ్ముళ్లు ఆట పట్టిస్తారు. తర్వాత బైంగన్ కా సాలన్, పావ్ బాజీ కూడా చేస్తావా అంటూ కన్నా, కేశవ అన్నతో ఆడుకుంటారు.

నారాయణకు అనారోగ్యం.. కేశవకు క్లాస్ పీకిన మహా

అటు ఉదయాన్నే నిద్ర లేచిన నారాయణకు తీవ్రంగా జ్వరం వస్తుంది. కనీసం లేచి నీళ్లు తాగలేని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మహా అతనికి దగ్గరికి వెళ్లి సేవలు చేస్తుంది. జ్వరం చాలా ఉంది.. లీవ్ పెట్టి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానని మహా అంటే.. ఈ మాత్రం దానికేనా అవసరం లేదని నారాయణ అంటాడు. రాత్రి మందు పడలేదా అని కేశవ అనడంతో మహాకు ఒళ్లు మండుతుంది.

ఎందుకంత వెటకారం.. నారాయణకు నలుగురు కొడుకులు ఉన్నారు ఏం తక్కువ అని అందరూ అనుకోవాలి కానీ.. నలుగురు ఉన్నా ఏం లాభం అని అనుకోకూడదు.. మమకారం చూపించకపోయినా.. వెటకారం వద్దు అని క్లాస్ పీకడంతో కేశవ సారీ చెబుతాడు. తర్వాత మాధవ ట్యాబ్లెట్ తీసుకొచ్చి వేస్తాడు. కానీ నారాయణ మాత్రం మంచం దిగలేకపోతాడు. ఆ తర్వాత అందరూ ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోతారు.

చక్రి ఇంటికొచ్చిన గోపిక ఫ్రెండ్స్

ఆ తర్వాత గోపిక విషయంలో చక్రిని ఇంట్లో వాళ్లు ఆట పట్టిస్తూనే ఉంటారు. చక్రి డ్రైవింగ్ కు వెళ్లిన సమయంలోనూ ఆమె ఫోన్ చేస్తూనే ఉంటుంది. కానీ చక్రి తీయడు. పదల సంఖ్యలో మిస్డ్ కాల్స్ చూసిన తర్వాత అతడు ఫోన్ చేస్తాడు. ఎందుకన్నిసార్లు ఫోన్ చేస్తున్నావని అడుగుతాడు.

ఎందుకు ఫోన్ తీయడం లేదు.. ఎందుకు పార్టీ నుంచి మధ్యలోనే వెళ్లిపోయారని అడిగినా చక్రి సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేస్తాడు. దీంతో గోపిక ఫ్రెండ్స్ నేరుగా చక్రి ఇంటికే వస్తారు. ఆమెను మోసం చేయాలనుకుంటున్నావా అని అతన్ని నిలదీస్తారు. అది మహా, మాధవ కూడా చూస్తారు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More