Podarillu September 8 Episode: జయంతిపై ఎంక్వైరీ- చక్రిని కత్తితో వెంటాడిన ఆంటీ- మాజీ భర్త వార్నింగ్- మనీషా హార్ట్ బ్రేక్

Podarillu Serial September 8th Episode: పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 8వ ఎపిసోడ్‌‌లో జయంతిపై చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తారు చక్రి, మహా. జయంతి భర్తని కేర్ చేయదని, ఇల్లు ముక్కలు చేస్తారని చెబుతారు. మాధవ ఎంగేజ్‌మెంట్ తెలిసి ప్రేమించిన మనీషా హార్ట్ బ్రేక్ అవుతుంది. జయంతి మాజీ భర్త హెచ్చరిస్తాడు.

Published on: Sep 8, 2026, 09:45:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జయంతితో ఇల్లు, మాధవ గురించి చక్రి, మహాలక్షి మాట్లాడుతారు. నా మొదటి భర్త నన్ను అన్నింటికి గ్రాంటెడ్‌గా తీసుకున్నాడు. తను వదిలేస్తే నాకు పెళ్లి కాదన్నాడు. అది నేను తప్పని నిరూపించాలి. విడాకులు తీసుకున్న వెంటనే రెండో పెళ్లి చేసుకోవాలి. అది కూడా తనకంటే ముందే నా పెళ్లి జరగాలి. అంతకుమించి పెళ్లి మీద ఎలాంటి ఆశలు లేవు అని తన పంతం గురించి చెబుతుంది జయంతి.

పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 8 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 8 ఎపిసోడ్

రెండో పెళ్లి ప్రయోగం

జయంతి వెళ్లిపోతుంది. ఈవిడ మొదటి మొగుడు మీద పగ తీర్చుకోడానికి ఈ రెండో పెళ్లి అనే ప్రయోగం చేస్తున్నట్లు అనిపిస్తోంది నాకు అని చక్రి అంటాడు. అవును, ఇలాంటి పొగరు, అహంకారం, ఆవేశం, స్వార్థం ఇన్ని ఉన్న అమ్మాయిని సున్నితమైన పెద్ది తట్టుకోలగడా, భరించగలడా. సరే ఏం చేద్దాం. కొంత టైమ్ తీసుకుందామని మహా అంటుంది.

మరోవైపు శైలు కంగారుపడుతుంది. కేశవకు కాల్ చేసి ఉదయం పడిన గొడవకు ఇప్పటివరకు ఎందుకు కాల్ చేయలేదని, ఈ బుస్సు మీద కొంచెమైనా ప్రేమ అనురాగం ఉందా అని తిడుతుంది శైలు. నేనే నీ వెంట పడాలి, ప్రేమించాలి. చివరికి నేనే అవమానపడాలి అని తిట్లపురాణం మొదలుపెడుతుంది శైలు. ముందు నాకు సారీ చెప్పురా అని ఆర్డర్ వేస్తుంది శైలు.

ఉదయం నన్ను సెల్ఫిష్ అన్నందుకు సారీ చెప్పమని శైలు అంటుంది. కేశవ చెప్పనంటాడు. మాధవ పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. నాకు ఇద్దరు ముఖ్యమే అంటాడు కేశవ. కావాలనే పెళ్లి వాయిదా వేస్తున్నావని గొడవ పడుతుంది శైలు. నీలాంటి వాన్ని ప్రేమించినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలని శైలు అంటే.. ముందు ఆ పని చేయి. బుర్రకు పట్టిన బూజు పోతుందని కేశవ అంటాడు.

మీరే విడిపోతున్నారు

ఆ మాటలు విన్న శైలు అన్న సురేష్ సంతోషిస్తాడు. మిమ్మల్ని ఎలా విడదీయాలని ఆలోచిస్తుంటే మీరే విడిపోతున్నారు. గొడవ పడ్డారుగా అని సురేష్ అంటాడు. శైలు తిడుతుంది. ఇంతలో తల్లి పిలవడంతో సురేష్ వెళ్లిపోతాడు. మరుసటి రోజు చక్రి, మహాలక్ష్మి ఇంటికి కావాల్సిన వస్తువుల షాపింగ్ చేస్తారు. మహా చేసిన పనులు చూసి ఇదేం శాడిజం అనుకుంటాడు చక్రి.

అదే షాప్‌కి గోపిక వస్తుంది. పైనుంది తీసుకోలేకపోతుంది. అది చూసి ఇస్తాడు చక్రి. గోపికను చూసి మీరా అని ఆశ్చర్యపోతాడు చక్రి. కావాలనే మహాకు వినిపించేలా గోపికతో మాట్లాడుతాడు చక్రి. ఆ మాటలు విన్న మహా పక్కనున్న వస్తువుతో బలంగా కొడుతుంది. ఏంటా సౌండ్ అని గోపిక అడిగితే.. అల్ట్రా సౌండ్ అని పక్కకు వెళ్దామంటాడు చక్రి.

ఇంకా ఏం కావాలో తీసుకో గోపిక. బిల్ నేనే కడతానని చక్రి అంటాడు. వద్దు అని సిగ్గుపడుతుంది. సూపర్ మార్కెట్‌కు నన్ను చూసే వచ్చావుగా అని చక్రి అంటాడు. మళ్లీ చక్రిని కొడుతుంది మహాలక్ష్మి. తర్వాత నేనేంటీ ఇంత పొసెసివ్ అవుతున్నాను అని పక్కకు వెళ్లిపోతుంది మహా. కాఫీ, జ్యూస్ ఇలా వెళ్దామని గోపిక అంటే.. ఇప్పుడు కాదని చక్రి అంటాడు.

జయంతిపై ఎంక్వైరీ

బాగా చదువుకుని పాస్ అవ్వు. అప్పుడే నాకిష్టం అని చక్రి అని గోపికను పంపిస్తాడు. తర్వాత గోపిక విషయం మహాకు చెబుతాడు. ఇవన్ని ఎందుకుని చక్రి అడిగితే.. పెద్ది పెళ్లికి అని బిల్ కట్టి తీసుకుంటుంది మహాలక్ష్మి. జయంతి గురించి చుట్టుపక్కల ఇళ్లలో ఎంక్వైరీ చేయండని చక్రికి చెబుతుంది మహాలక్ష్మి.

నా భార్యల మాట్లాడుతుంది. దూరం పెడుతుంది అని చక్రి అనుకుంటాడు. జయంతి ఇంటి దగ్గరికి వెళ్తారు ఇద్దరు. జయంతి వాళ్లకు తెలియకుండా ఎంక్వైరీ చేయాలనుకుంటారు. ఒకావిడ ముగ్గేస్తుంటుంది. ఆవిడను అడుగుదామని మహా అంటే.. మీరెందుకు నేను వెళ్తానంటాడు చక్రి. ఆడ వాసన తగిలితే చాలు ఎగురుకుంటూ వెళ్తారు అని మహాలక్ష్మి అంటుంది.

రెండు కొప్పులు కలవవండి. నేను కనుక్కుని వస్తాను అని చక్రి వెళ్లిపోతాడు. ఎందుకు ఎడమ కన్ను అదురుతుంది. ఎందుకైన మంచిది పారిపోయేందుకు రెడీగా ఉండాలని మహా అనుకుంటుంది. ఆంటీ దగ్గరికి వెళ్లిన చక్రి ముగ్గు బాగుంది. మీరు కూడా సూపర్‌గా ఉన్నారు ఆంటీ అని చక్రి అంటాడు. దాంతో లోపలికి వెళ్లిన ఆంటీ చక్రిపైకి కత్తి పట్టుకుని వస్తుంది.

చక్రిపై కత్తితో ఆంటీ

దాంతో చక్రి పరుగెత్తుతాడు. మహా, చక్రి ఇద్దరు తప్పించుకుంటారు. ముందు పొగడాలని సూపర్‌గా ఉన్నారని అన్నాను. కత్తి పట్టుకుని వచ్చిందని చక్రి చెబుతాడు. దాంతో మహాలక్ష్మి నవ్వుతుంది. ఇప్పుడు నేను వెళ్తానని మహాలక్ష్మి వెళ్తుంది. అక్కడ ఆజన్మ బ్రహ్మచారి. ఆడవాళ్లకు ప్రవేశం లేదు అని రాసి ఉంటుంది. అది చక్రి చూస్తాడు. మహాకు చెప్పేందుకు ప్రయత్నిస్తే వినిపించుకోకుండా ఇంట్లోకి వెళ్తుంది. కట్ చేస్తే మహా పరుగెత్తుకుంటూ వస్తుంది.

మహాపై పసుపు నీళ్లు పడేస్తాడు బ్రహ్మాచారి. దాంతో మహాను చూసి చక్రి నవ్వుతాడు. ఇస్త్రీ షాపు వాడికి అన్ని తెలుస్తాయంటని వెళ్లి చక్రి అడుగుతాడు. ఫొటో చూపించి జయంతి గురించి అడుగుతారు. అమ్మో ఈవిడ, మొగుడుతో కాపురం చేసిందే లేదు. ఎప్పుడు పుట్టింట్లోనే ఉంటుంది. ఈవిడ తల్లి నాలుగు ఆకులు ఎక్కువే చదివింది. అల్లున్ని పోరా ఎధవ అని తిడుతుందని ఇస్తీ వాడు చెబుతాడు.

ఇంటికొస్తే తల్లీకూతుళ్లు కలిసి ఎగబడి మరి వెళ్లగొడుతారు. ఆ అల్లుడు ఒక పిచ్చిమాలోకం. అల్లుడిని విడగొట్టి వేరే కాపురం పెట్టించారు అని ఇస్త్రీ వాడు చెబుతాడు. అప్పుడే ఇస్త్రీవాడి భార్య వస్తుంది. ఆవిడ కూడా జయంతి గురించి చెడుగానే చెబుతుంది. నాతో కలిపి ఇప్పటికీ 20 మంది పని మనుషులు మారారు అని అంటుంది.

వేరు కాపురం పెట్టిస్తా

ఆమెను పెళ్లి చేసుకుంటే ఇల్లు ముక్కలు చేస్తుంది అని ఆవిడ చెబుతుంది. ఎలాగైనా ఈ సంబంధం క్యాన్సిల్ చేయాలని చక్రి, మహా అనుకుంటారు. బన్సీ ఇంటికి మాధవ వెళ్తాడు. అక్కడ బన్సీ చెల్లి మనీషా ఉంటుంది. లోపలికి రండి మాధవజీ అంటూ తీసుకెళ్తుంది. బన్సీ వచ్చి మాట్లాడుతాడు. మనీషా టీ పెడుతుంటుంది. రేపు నా ఎంగేజ్‌మెంట్ అని మాధవ చెబుతాడు.

ఆ మాట విన్న మనీషా హార్ట్ బ్రేక్ అవుతుంది. షాక్‌తో టీ గ్లాస్ కింద పడేస్తుంది. ఏమైందని బన్సీ అడుగుతాడు. ఏం కాలేదని చెబుతుంది మనీషా. మాధవను మనీషా ప్రేమించినట్లుగా అర్థమైపోతుంది. తర్వాత మాధవ ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది. పెళ్లయ్యాకా మాధవతో వేరు కాపురం పెడతానుగా అని తమ్ముడితో జయంతి అంటుంది.

చెరో దిక్కు అవుతారు

తర్వాత జయంతి మాజీ భర్తను పరిచయం చేస్తాడు జయంతి తమ్ముడు. ఇప్పుడే అందరిని బాగా చూసుకోండి. పెళ్లయ్యాకా వరదల్లో కొట్టుకుపోయినట్లు చెరో దిక్కు అవుతారని జయంతి మాజీ భర్త హెచ్చరిస్తాడు. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More