Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో తన తమ్ముళ్లు, మహా ఎంత చెప్పినా మాధవ మాత్రం తన పెళ్లి విషయంలో వెనక్కి తగ్గడు. నిశ్చితార్థానికి రెడీ అయి.. తన అత్తను పిలవడానికి వెళ్లగా ఆమె అవమానించి పంపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
మాధవ నిశ్చితార్థం మాట విని మనీషా కంటతడి

మాధవ తన నిశ్చితార్థానికి రావాల్సిందిగా బన్సీ కుటుంబాన్ని ఆహ్వానించే సీన్ తో సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 9) మొదలైంది. అయితే మాధవ పెళ్లి గురించి విని బన్సీ చెల్లి మనీషా కంటతడి పెడుతుంది. తాను రాలేకపోయినా మనీషాను పంపిస్తానని బన్సీ చెబుతాడు. అది విని ఆమె మరింత బాధపడుతుంది. సరే అని మాధవ వెళ్లిపోతాడు. తర్వాత మనీషా కంట్లో నీళ్లు చూసి ఏమైందని బన్సీ అడిగినా ఆమె ఏమీ చెప్పదు.
జయంతి ఇల్లు ముక్కలు చేసే రకం అన్న మహా, చక్రి
అటు ఇంట్లో చక్రి, మహా కోసం కేశవ, కన్నా ఎదురు చూస్తుంటారు. వాళ్లు రాగానే ఏమైంది.. జయంతి గురించి ఏం తెలిసింది అని అడుగుతారు. ఎవరిని అడిగినా ఆమె గురించి నెగటివ్ గానే చెప్పారు.. జయంతి ఇంటిని ముక్కలు చేసే రకం అనే అన్నారని చక్రి, మహా చెబుతారు. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాల్సిందే.. లేదంటే మన ఇల్లు ముక్కలవడం ఖాయం అని వాళ్లు భయపడతారు.
పెళ్లి వద్దన్న మహా, చక్రి.. వెనక్కి తగ్గని పెద్ది
అప్పుడే పెద్ది ఇంట్లోకి వస్తాడు. తన నిశ్చితార్థానికి కావాల్సిన సామగ్రి మొత్తం తెచ్చుకుంటాడు. మాధవను చూడగానే మహా, చక్రి, కేశవ, కన్న కంగారు పడతారు. ఈ పెళ్లి వద్దు అని ఎలా చెప్పాలో తెలియక తికమకపడుతుంటారు. చివరికి అందరూ కలిసి మహాను ముందుకు తోస్తారు. ఆమె వెళ్లి ఈ పెళ్లి వద్దు అని పెద్దితో అంటుంది.
{{/usCountry}}అప్పుడే పెద్ది ఇంట్లోకి వస్తాడు. తన నిశ్చితార్థానికి కావాల్సిన సామగ్రి మొత్తం తెచ్చుకుంటాడు. మాధవను చూడగానే మహా, చక్రి, కేశవ, కన్న కంగారు పడతారు. ఈ పెళ్లి వద్దు అని ఎలా చెప్పాలో తెలియక తికమకపడుతుంటారు. చివరికి అందరూ కలిసి మహాను ముందుకు తోస్తారు. ఆమె వెళ్లి ఈ పెళ్లి వద్దు అని పెద్దితో అంటుంది.
{{/usCountry}}ఎందుకు వద్దు అని అడిగితే.. ఆ జయంతి ఇంటిని చీలుస్తుంది.. మిమ్మల్ని, మీ తమ్ముళ్లను వేరు చేస్తుందని చెబుతుంది. ఆ తర్వాత చక్రిని ముందుకు తోసి మిగతాది మీరు చెప్పండని అంటుంది. అవును అన్నయ్య.. ఈ పెళ్లి వద్దు అని చక్రి కూడా అంటాడు. అసలు ఆమె గురించి మీకేం తెలుసు.. అయినా నా తమ్ముళ్లతోనే కలిసి ఉంటానని ఆమెకు ముందే షరతు విధించానని పెద్ది అంటాడు.
ఎవరినడిగి ఎంక్వైరీ చేశావంటూ పెద్ది మండిపాటు.. చక్రి రివర్స్
తాము జయంతిని కలిశామని, అంతేకాదు ఆమె గురించి ఎంక్వైరీ కూడా చేశామని చక్రి, మహా చెబుతారు. ఎప్పుడు అని అడిగితే ఇవాళే అని అంటారు. దీంతో మాధవ సీరియస్ అవుతాడు. అసలు ఎవరిని అడిగి ఇలా చేశారు.. మన గురించి ఎవరినైనా అడిగినా ఎవరైనా పాజిటివ్ గా చెబుతారా.. అయినా పెళ్లికి ముందే మనం ఇలా చేశామని తెలిస్తే ఆమె ఏమనుకుంటుంది? ఇంత అనుమానిస్తారా అని అనుకోదా అని మాధవ వాళ్లకు క్లాస్ పీకుతాడు. ఎవరెన్ని చెప్పినా తాను మాత్రం వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెబుతాడు.
దీంతో చక్రి కూడా రివర్స్ అవుతాడు. అది విని నా పెళ్లిని అడ్డుకుంటావా అని మాధవ అంటాడు. చక్రి ఎదురు తిరుగుతాడు. ఏం మాట్లాడుతున్నావ్.. నేను నీపెళ్లిని అడ్డుకోవడమేంటి.. సరే చేసుకో.. తర్వాత నిన్నూ, మమ్మల్ని ఆమె వేరు చేస్తుంది.. అప్పుడు నా కంటే కూడా నువ్వే ఎక్కువ బాధ పడతావ్.. అందుకే ఈ పెళ్లి వద్దంటున్నాం.. అయినా సరే చేసుకుంటానంటే చేసుకో.. అని చక్రి అంటాడు.
అప్పుడే నారాయణ వచ్చి ఎందుకు గొడవ పడుతున్నారని అడిగితే.. పెళ్లి విషయంలోనే అని చెబుతారు. సరే పెద్ది ఇష్టపడి చేసుకుంటున్నాడు కదా.. దీనిని ఇంతటితో వదిలేయండి.. మన తరఫున ఎవరిని పిలవాలని అని మహా అంటుంది. అత్తయ్య, గాయత్రిని పిలవాలని ఆమె చెబితే.. తానైతే వెళ్లనని నారాయణ వెళ్లిపోతాడు. తాను వెళ్లి పిలుస్తానని పెద్ది వెళ్తాడు.
నిశ్చితార్థానికి అత్తను పిలిచిన మాధవ.. అవమానించిన తాయారు
అత్త తాయారు ఇంటికి మాధవ వెళ్తాడు. అతన్ని చూడగానే గాయత్రి పరుగెత్తుకుంటూ వెళ్లగా తాయారు అడ్డుకుంటుంది. ఇంట్లో శుభకార్యం గురించి పిలుద్దామని వచ్చానని మాధవ చెబుతాడు. ఏం శుభకార్యం అని గాయత్రి అడిగితే నా నిశ్చితార్థం అని అంటాడు. దీంతో గాయత్రి అతనికి కంగ్రాట్స్ చెబుతుంది. అయినా తాయారు మాత్రం అతన్ని అవమానించేలా మాట్లాడుతుంది.
ఆడబిడ్డ అని నాకు కనీస గౌరవం ఇవ్వలేదు.. రాఖీ కట్టి పేపర్లపై సంతకం చేయమంటే ఆ తాగుబోతు సచ్చినోడు చేయలేదు.. ఇప్పుడెందుకు మీ ఇంటికి రావాలి.. నేను రాను అని ఆమె తెగేసి చెబుతుంది. ఆమె రాకపోయినా నేను వస్తాను అని చెప్పి మాధవను పంపిస్తుంది గాయత్రి. తర్వాత తల్లికి క్లాస్ పీకుతుంది. నా పెళ్లి సమయంలో బావ కాళ్లు పట్టుకున్నావ్.. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావ్.. నువ్వు ఇలాగే ఉంటే నా పెళ్లి సీక్రెట్ వాళ్లతో చెబుతాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.
నిశ్చితార్థానికి పెద్ది రెడీ.. చక్రి ఎమోషనల్..
మరుసటి రోజు పెద్ది నిశ్చితార్థం కోసం కొత్త బట్టలతో రెడీ అవుతాడు. అతన్ని చూసి మహా, కన్నా మురిసిపోతారు. కానీ చక్రి, కేశవ మాత్రం మొహాలు అదోలా పెడతారు. చేసుకో.. ఆమె వచ్చిన తర్వాత మమ్మల్ని దూరం చేసుకో అని చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత చక్రి దగ్గరికి వెళ్లి మాధవ బతిమాలుతాడు. దీంతో చక్రి ఎమోషనల్ అవుతాడు. వచ్చేది సీతమ్మో, కైకమ్మో తెలియదు.. నిన్ను మాకు ఎక్కడ దూరం చేస్తుందో అన్నదే మా బాధ.. నీ పెళ్లి వద్దనడం లేదు.. ఈ అమ్మాయితో మాత్రమే వద్దంటున్నాం అని చక్రి అంటాడు.
దీంతో ఒక క్షణం పాటు మాధవ కూడా ఆలోచనలో పడతాడు. ఆమె తన తమ్ముళ్లను దూరం చేస్తుందా అని అనుకుంటూనే అదే సమయంలో శైలు అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత తమ్ముళ్లందరూ అన్నను పట్టుకొని ఎమోషనల్ అవుతారు.
ఇంటిని చీల్చడానికి జయంతి ప్లాన్
అసలు ఆ ఇల్లు, మనుషులు నీకు ఎలా నచ్చారు.. అక్కడెలా ఉంటావని జయంతిని ఆమె తమ్ముడు అడుగుతాడు. అక్కడ ఎవరు ఉంటారు.. పెళ్లవగానే వేరు కాపురం పెడతాను అని జయంతి అంటుంది. నిశ్చితార్థం కోసం జయంతి ఇల్లు ముస్తాబవుతుంది. అక్కడే ఆమె మాజీ భర్తను చూసి అందరూ షాక్ తింటారు. అతడు వాళ్లకు వార్నింగ్ కూడా ఇస్తాడు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.