సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి రకరకాల పుకార్లు రావడం సహజమే. కానీ ఈ మధ్య హీరోయిన్ పూజా హెగ్డే గురించి ఒక షాకింగ్ న్యూస్ తెగ వైరల్ అయ్యింది. ఒక పాన్ ఇండియా స్టార్ హీరో షూటింగ్ సమయంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని, దీంతో పూజా అతన్ని చెంపదెబ్బ కొట్టిందన్నది ఆ వార్త సారాంశం. అయితే ఇందులో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
పూజా హెగ్డే కామెంట్స్ ఇలా

పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నా కెరీర్ ఆరంభంలో ఒక పెద్ద సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు.. ఒక స్టార్ హీరో అనుమతి లేకుండా నా క్యారవాన్‌లోకి వచ్చాడు. నన్ను అసభ్యంగా తాకడానికి ప్రయత్నించడంతో నేను అతన్ని కొట్టాను" అని చెప్పినట్లుగా కొన్ని సోషల్ మీడియా పోస్టులు వైరల్ అయ్యాయి. దీనికి ఏ వీడియో సాక్ష్యం లేకపోయినప్పటికీ, నెటిజన్లు ఆ హీరో ఎవరై ఉంటారా అని చర్చించుకోవడం మొదలుపెట్టారు.
అసలు నిజం ఏంటి?
ఈ వార్త పూర్తిగా అవాస్తవం అని తేలింది. పూజా హెగ్డే అసలు అలాంటి ఇంటర్వ్యూనే ఇవ్వలేదు. ప్రముఖ సినిమా ట్రాకర్, ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ఈ విషయంపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. "పూజా హెగ్డే గురించి సర్క్యులేట్ అవుతున్న ఆ ఇంటర్వ్యూ వార్త 100 శాతం ఫేక్. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మకండి, షేర్ చేయకండి" అని ఆయన ట్వీట్ చేశారు. ఇండస్ట్రీలోని ఇతర వర్గాలు కూడా ఇది కేవలం క్లిక్-బైట్ కోసం సృష్టించిన పుకారు అని కొట్టిపారేశాయి.
బిజీగా పూజా హెగ్డే..
ఒకప్పుడు టాలీవుడ్ ను ఊపేసిన హీరోయిన్ పూజా హెగ్డే. అయితే ఇప్పుడు మాత్రం అవకాశాలు రావడం లేదు. ఓ ఐరన్ లెగ్ అనే పేరు కూడా సంపాదించింది. అయితే పూజా హెగ్డేకు ఇండస్ట్రీలో సహనటులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆమె గతంలో ప్రభాస్, అల్లు అర్జున్, సల్మాన్ ఖాన్ వంటి అగ్ర హీరోలతో పనిచేసింది.
ప్రస్తుతం ఆమె దళపతి విజయ్ సరసన ‘జన నాయగన్’ అనే సినిమాలో నటించింది. సెన్సార్ ఇబ్బందుల కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. మూవీ రిలీజ్ పై ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ నెల 21న మరోసారి కోర్టులో విచారణ జరగనుంది.
{{/usCountry}}ప్రస్తుతం ఆమె దళపతి విజయ్ సరసన ‘జన నాయగన్’ అనే సినిమాలో నటించింది. సెన్సార్ ఇబ్బందుల కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. మూవీ రిలీజ్ పై ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ నెల 21న మరోసారి కోర్టులో విచారణ జరగనుంది.
{{/usCountry}}