ఇండియన్ పాప్ లవర్స్ కు గుడ్ న్యూస్. పాప్ సెన్సేషన్ షకీరా మరోసారి మన దేశానికి వస్తోంది. ముంబై, ఢిల్లీ నగరాల్లో ఆమె పర్ఫామ్ చేయబోతోంది. "హిప్స్ డోంట్ లై" (Hips Don’t Lie) హిట్ సాంగ్ సృష్టికర్త అయిన ఆమె.. హెచ్‌ఎస్‌బీసీ సమర్పిస్తున్న ‘డిస్ట్రిక్ట్ బై జొమాటో’ వారి ఫీడింగ్ ఇండియా కాన్సర్ట్‌లో భాగంగా ఇండియాలో పర్ఫార్మ్ చేయబోతోంది.
ఇండియా టూర్‌పై షకీరా రియాక్షన్ ఇలా

"ఇండియాలో ప్రదర్శన ఇవ్వడం నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. ముంబై, ఢిల్లీలోని నా అభిమానులతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను" అని గ్రామీ అవార్డు గ్రహీత, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన కొలంబియన్ సింగర్ షకీరా ఒక ప్రకటనలో తెలిపింది.
లాభాపేక్ష లేని 'ఫీడింగ్ ఇండియా' (Feeding India) లైవ్ మ్యూజిక్ జర్నీలో భాగమైన ఈ కాన్సర్ట్ గురించి షకీరా మాట్లాడుతూ.. "ప్రతి బిడ్డ అభివృద్ధి చెందడానికి అవసరమైన పోషకాహారం వారికి అందేలా చూడటానికి మనమంతా కలిసి నిలబడటమే ఈ కార్యక్రమ ఉద్దేశం" అని పేర్కొంది.
షకీరా కాన్సర్ట్ తేదీ, వెన్యూ
షకీరా ఏప్రిల్‌లో ముంబై, ఢిల్లీ నగరాల్లో ప్రదర్శన ఇస్తుంది. వాటి వివరాలు ఇక్కడ చూడండి.
మహాలక్ష్మి రేస్‌కోర్స్, ముంబై: ఏప్రిల్ 10
జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం, ఢిల్లీ: ఏప్రిల్ 15
షకీరా కాన్సర్ట్: టికెట్లు ఇలా..
షకీరా కాన్సర్ట్ కోసం టికెట్లు ప్రత్యేకంగా 'డిస్ట్రిక్ట్' (District) యాప్‌లో అందుబాటులో ఉంటాయి. హెచ్‌ఎస్‌బీసీ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 48 గంటల ముందస్తు యాక్సెస్ లభిస్తుంది. హెచ్‌ఎస్‌బీసీ కస్టమర్లు ఫిబ్రవరి 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి మార్చి 1 మధ్యాహ్నం 12 గంటల వరకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే షకీరా కాన్సర్ట్ కోసం సాధారణ టిక్కెట్ విక్రయాలు మార్చి 1 మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతాయి.
షకీరా గురించి..
షకీరా బెస్ట్ సెల్లింగ్ లాటిన్ వుమెన్ ఆర్టిస్టులలో ఒకరిగా గుర్తింపు పొందింది. ఆమె 100 మిలియన్లకు పైగా రికార్డులను విక్రయించింది. అలాగే బిల్బోర్డ్ 'టాప్ ఫిమేల్ లాటిన్ ఆర్టిస్ట్ ఆఫ్ ది డికేడ్'గా రెండుసార్లు ఎంపికయ్యారు.
{{/usCountry}}షకీరా బెస్ట్ సెల్లింగ్ లాటిన్ వుమెన్ ఆర్టిస్టులలో ఒకరిగా గుర్తింపు పొందింది. ఆమె 100 మిలియన్లకు పైగా రికార్డులను విక్రయించింది. అలాగే బిల్బోర్డ్ 'టాప్ ఫిమేల్ లాటిన్ ఆర్టిస్ట్ ఆఫ్ ది డికేడ్'గా రెండుసార్లు ఎంపికయ్యారు.
{{/usCountry}}ఈ పాప్ ఐకాన్ ఇటీవల నిర్వహించిన 'లాస్ ముజెరెస్ యా నో లొరాన్' (Las Mujeres Ya No Lloran) టూర్, లాటిన్ ఆర్టిస్ట్ చేసిన అత్యధిక వసూళ్లు సాధించిన టూర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పింది. "వాకా వాకా" (Waka Waka), "వెన్ ఎవర్, వేర్ ఎవర్", "షీ వోల్ఫ్" వంటి చార్ట్‌బస్టర్‌లతో బాగా పేరు తెచ్చుకున్న ఆమె.. దాతృత్వ కార్యక్రమాల్లో కూడా ముందుంటుంది. ఆమె స్థాపించిన 'బేర్‌ఫుట్ ఫౌండేషన్' (Barefoot Foundation) ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాల పిల్లల విద్య, సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తోంది.
జొమాటో ఫీడింగ్ ఇండియా కాన్సర్ట్
గతంలో 2024లో దువా లిపా, 2022లో పోస్ట్ మలోన్ వంటి ఆర్టిస్ట్‌లను ముంబైకి తీసుకువచ్చిన తర్వాత 'మ్యూజిక్ ఫర్ ఛేంజ్' అనే ఈ అద్భుతమైన కాన్సెప్ట్ ను మరో నగరానికి కూడా విస్తరించబోతున్నారు.
"సంగీతానికి సరిహద్దులు దాటి ప్రజలను ఏకం చేసే ప్రత్యేక శక్తి ఉంది. జీవితాలను మార్చగల అర్థవంతమైన మార్పును తీసుకురావడానికి మేము దీనిని ఉపయోగించుకుంటున్నాము" అని డిస్ట్రిక్ట్ బై జొమాటో (District by Zomato) సీఈఓ రాహుల్ గంజూ తన ప్రకటనలో తెలిపారు.