Prabhas Japan Fans: 'పాన్ ఇండియా' అనే పదానికి నిలువెత్తు రూపంగా మారిన రెబెల్ స్టార్ ప్రభాస్ ఈరోజు (అక్టోబర్ 23) తన 47వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఉన్న ఆయన అభిమానులు గురువారం రాత్రి నుంచే పుట్టినరోజు సంబరాలను పండగలా ప్రారంభించారు.

సోషల్ మీడియా వేదికగా హ్యాష్‌టాగ్స్ విపరీతంగా ట్రెండ్ అవుతుండగా, ఇటు ఇండియాలో, అటు విదేశాల్లోనూ ప్రభాస్ మానియా పీక్స్‌కు చేరింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద మొదలుకొని జపాన్ వీధుల వరకు డార్లింగ్ బర్త్‌డే వేడుకలు అంబరాన్నంటాయి.
జపాన్‌లో డార్లింగ్ మానియా.. 'ప్రభాస్-సాన్'కు స్పెషల్ వీడియో
'బాహుబలి', 'సాహో' చిత్రాల నుంచి జపాన్‌లో ప్రభాస్‌కు మైండ్ బ్లాకింగ్ క్రేజ్ సొంతమైంది. గత ఏడాది ప్రభాస్ జపాన్ పర్యటన తర్వాత అక్కడి అభిమానులకు ఆయనపై ఉన్న ప్రేమ రెట్టింపైంది. ప్రభాస్ 47వ బర్త్‌డే సందర్భంగా జపాన్‌కు చెందిన అభిమానులు ప్రత్యేకంగా నలుపు, బంగారు వర్ణం (Black and Gold) దుస్తులను ధరించి బర్త్‌డే పార్టీ చేసుకున్నారు.
పుట్టిన రోజు శుభాకాంక్షలు డార్లింగ్ ప్రభాస్ అంటూ వాళ్లు తెలుగులో విషెస్ చెప్పడం విశేషం. అంతేకాదు కేకులు, బెలూన్లు, డార్లింగ్ సినిమాల పోస్టర్లతో అలంకరించిన వేదికపై 'హ్యాపీ బర్త్‌డే ప్రభాస్-సాన్' అంటూ జపనీస్ భాషలో పాటలు పాడి శుభాకాంక్షలు తెలిపారు. "గత ఏడాది మీరు జపాన్ రావడం మా హృదయాలను తాకింది. మీ కొత్త సినిమా విడుదల కాగానే భారతదేశం వచ్చి థియేటర్లలో చూస్తాం" అంటూ నెట్టింట షేర్ చేసిన వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది.
జూబ్లీహిల్స్ నివాసం వద్ద ఫ్యాన్స్ రచ్చ
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రభాస్ నివాసం వద్ద అర్ధరాత్రి 12 గంటల ముందే వేల సంఖ్యలో అభిమానులు క్యూ కట్టారు. డార్లింగ్ ఫ్లాగ్‌లు, భారీ కటౌట్లతో జూబ్లీహిల్స్ వీధులన్నీ ప్రభాస్ నినాదాలతో హోరెత్తిపోయాయి. కొంతమంది అభిమానులు ఏకంగా కదులుతున్న ట్రక్కులపై నిలబడి ఫ్లాగ్‌లు ఊపుతూ సందడి చేయగా, భీమవరంలో అభిమానులు బ్లోటార్చ్లు, బైక్ ఇంజన్ల శబ్దాలతో వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
'ఈశ్వర్' నుంచి ప్రపంచ స్థాయి సూపర్ స్టార్ వరకు..
{{/usCountry}}హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రభాస్ నివాసం వద్ద అర్ధరాత్రి 12 గంటల ముందే వేల సంఖ్యలో అభిమానులు క్యూ కట్టారు. డార్లింగ్ ఫ్లాగ్‌లు, భారీ కటౌట్లతో జూబ్లీహిల్స్ వీధులన్నీ ప్రభాస్ నినాదాలతో హోరెత్తిపోయాయి. కొంతమంది అభిమానులు ఏకంగా కదులుతున్న ట్రక్కులపై నిలబడి ఫ్లాగ్‌లు ఊపుతూ సందడి చేయగా, భీమవరంలో అభిమానులు బ్లోటార్చ్లు, బైక్ ఇంజన్ల శబ్దాలతో వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
'ఈశ్వర్' నుంచి ప్రపంచ స్థాయి సూపర్ స్టార్ వరకు..
{{/usCountry}}2002లో 'ఈశ్వర్' సినిమాతో వెండితెరకు పరిచయమైన ప్రభాస్, 'వర్షం' (2004), 'ఛత్రపతి' (2005) చిత్రాలతో మాస్ హీరోగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'బుజ్జిగాడు', 'బిల్లా', 'డార్లింగ్', 'మిస్టర్ పర్ఫెక్ట్', 'మిర్చి' వంటి చిత్రాలతో ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్‌కు దగ్గరయ్యారు.
అయితే, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' (2015, 2017) సిరీస్ ప్రభాస్ జీవితాన్నే మార్చేసింది. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ సినిమా స్థాయిని చాటిచెప్పిన తొలి నటుడిగా ఆయన చరిత్ర సృష్టించారు.
ఈ ఏడాది 'ది రాజా సాబ్' చిత్రంతో అలరించిన ప్రభాస్.. గ్లోబల్ హిట్ 'కల్కి 2898 AD' సీక్వెల్‌లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లతో కలిసి నటించనున్నారు. అంతేకాకుండా, హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ', సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మోస్ట్ అవేటెడ్ పోలీస్ డ్రామా 'స్పిరిట్' (2027) చిత్రాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడానికి సిద్ధమవుతున్నారు.