Prabhas Imanvi: ప్రభాస్ రాజుగారి ట్రీట్ అంటే ఈమాత్రం ఉండాల్సిందే.. ఫౌజీ కోస్టార్ ఇమాన్వి బర్త్‌డేకు రాయల్ ఫీస్ట్
Prabhas Imanvi: ప్రభాస్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. తన ఫౌజీ మూవీ కోస్టార్ ఇమాన్వి బర్త్ డే సందర్భంగా ఆమెకు ఓ భారీ రాయల్ ఫీస్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Prabhas Imanvi: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఆన్ స్క్రీన్‌పై ఎంత మాస్ యాక్షన్ హీరోగా అదరగొడతారో, రియల్ లైఫ్‌లో తన తోటి నటీనటులకు, కో-స్టార్స్‌కు అంతకంటే ఎక్కువగా ఆప్యాయతను పంచుతుంటారు. తాజాగా ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'ఫౌజీ' (Fauzi) హీరోయిన్ ఇమాన్వి (Imanvi) పుట్టినరోజు వేడుక సందర్భంగా ప్రభాస్ అందించిన ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

టేబుల్ నిండా వంటకాలతో రాయల్ ఫీస్ట్
ఇమాన్ ఎస్మాయిల్ అసలు పేరుతో తెరవెనుక సుపరిచితురాలైన ముద్దుగుమ్మ ఇమాన్వీ.. టాలీవుడ్లో ఫౌజీ చిత్రంతోనే గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. తన 31వ పుట్టినరోజును జరుపుకున్న ఇమాన్వికి, ప్రభాస్ స్వయంగా ఒక అత్యంత భారీ రుచికరమైన విందును పంపి సర్ప్రైజ్ చేశారు.
ప్రభాస్ పంపిన ఆ ప్రత్యేకమైన రాయల్ ఫీస్ట్ చూసి ఆశ్చర్యపోయిన ఇమాన్వి.. ఆ టేబుల్ ఫోటోను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ ప్రభాస్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆ రాయల్ ఫీస్ట్ చూస్తే ఎవరికైనా నోరూరాల్సిందే. టేబుల్ నిండా ఘుమఘుమలాడే హైదరాబాదీ దమ్ బిర్యానీ, పులావ్ వెరైటీలతో పాటు రకరకాల స్టార్టర్స్ దర్శనమిచ్చాయి.
చికెన్ 65, చిల్లీ చికెన్, సీఖ్, షామీ కబాబ్స్, వేడివేడి తందూరి చికెన్ వంటి నాన్-వెజ్ వంటకాలతో పాటు అద్భుతమైన గ్రేవీలు, సలాన్, రైతా, చట్నీలు ఈ విందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చివరగా భోజనం ముగింపులో స్వీట్ లవర్స్‌ను ఆకట్టుకునేలా ఆప్రికాట్ డిలైట్ (Apricot Delight), గుమగుమలాడే ఫిర్ని (Phirni) వంటి ట్రెడిషనల్ డెజర్ట్స్ కూడా పంపి ప్రభాస్ తన పెద్ద మనసును చాటుకున్నారు. తోటి నటుల పట్ల ఆయన చూపించే ఈ కేరింగ్ నేచర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
ప్రభాస్ రాజు నిజంగా రాజే
ప్రభాస్ కు ఇలా చేయడం తొలిసారి కాదు. ఏ సినిమా షూటింగ్ లో అయినా తన సహ నటీనటులకు ఓ భారీ ఫీస్ట్ ఇవ్వడం అలవాటుగా మారింది. గతంలోనూ ప్రభాస్ ఇచ్చిన ఇలాంటి విందు భోజనాల ఫొటోలు, వీడియోలను ఆయా నటులు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అంతేకాదు స్వయంగా తన ఇంటి నుంచే ఇలాంటి ఫుడ్ పంపించడం కూడా రెబల్ స్టార్ కు అలవాటే. ఇక ఆ మధ్య ఓ కోస్టార్ ఓ ప్రత్యేకమైన డిష్ అడిగితే.. ఏకంగా చెన్నై నుంచి ముంబైకి ఫ్లైట్ లో ఆర్డర్ పెట్టాడన్న వార్త ఎంత వైరల్ అయిందో మనకు తెలిసిందే.
హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' అప్డేట్స్
ఇక డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చారిత్రాత్మక నేపథ్య సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫౌజీ సినిమాకు సంబంధించిన అధికారిక రిలీజ్ డేట్ త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు. తొలి సినిమాతోనే ప్రభాస్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్న ఇమాన్వి, ఈ బర్త్ డే సర్ప్రైజ్తో ఆనందంలో మునిగిపోయారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


