Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్, ఓ గుడ్ న్యూస్.. ఫౌజీ రిలీజ్‌పై ప్రొడ్యూసర్ క్లారిటీ.. బాహుబలి రేంజ్!
Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓ బ్యాడ్ న్యూస్, అలాగే ఓ గుడ్ న్యూస్ కూడా ఉంది. రెబల్ స్టార్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఫౌజీ రిలీజ్ పై ప్రొడ్యూసర్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయినట్లు అఫిషీయల్ గా చెప్పేశాడు. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో ఇక్కడ చూసేయండి.
Fauzi: రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ‘ఫౌజీ’ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 4 ఎప్పుడు వస్తుందా? అని ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అలాంటి అభిమానులకు ఫౌజీ మూవీ ప్రొడ్యూసర్లలో ఒకరైన మైత్రి రవిశంకర్ పిడుగులాంటి వార్త చెప్పారు. వెంటనే అదిరిపోయే అప్డేడ్ కూడా ఇచ్చారు.

ఫౌజీ రిలీజ్ లేట్
ప్రభాస్ హీరోగా హను రాఘవపుడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ మూవీ రిలీజ్ పై ఓ క్లారిటీ వచ్చింది. ఈ మూవీ ముందుగా ప్రకటించినట్లు డిసెంబర్ 3, 2026న రిలీజ్ కావడం లేదు. చిత్రం విడుదల వాయిదా పడ్డట్లు నిర్మాత రవిశంకర్ ప్రకటించారు.
కారణం అదే
డిసెంబర్ 3, 2026న విడుదల కావాల్సిన 'ఫౌజీ' సినిమా కొద్దిగా లేట్ గా థియేటర్లకు వస్తుందని ది ప్యారడైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవిశంకర్ ప్రకటించారు. డిజిటల్, సీజీఐ (CGI), విఎఫ్ఎక్స్ (VFX) పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో ఈ సినిమాను వాయిదా వేయక తప్పలేదు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. "ఫౌజీ కొద్దిగా వాయిదా పడుతోంది, క్షమించండి’’ అని పేర్కొన్నారు.
గుడ్ న్యూస్
ఫౌజీ రిలీజ్ డేట్ వాయిదా పడుతున్నట్లు షాక్ ఇచ్చిన రవిశంకర్.. ఆ వెంటనే గుడ్ న్యూస్ కూడా చెప్పారు. ‘‘ఇది నెక్స్ట్ లెవెల్ మూవీ. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇంత గ్రాండ్‌గా కనిపించే సినిమా మరేదీ లేదు. అభిమానులు తమ జీవితాంతం గుర్తుంచుకునేలా ఈ భారీ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దుతున్నాం" అని రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు.
ఆ సినిమాలకు లైన్ క్లియర్
గతంలో 'ఫౌజీ' డిసెంబర్ 3న విడుదలవుతుందని ప్రకటించడంతో డిసెంబర్ మొదటి వారంలో తీవ్రమైన బాక్సాఫీస్ పోటీ నెలకొనేలా కనిపించింది. నాగ చైతన్య నటించిన 'వృషకర్మ', దుల్కర్ సల్మాన్ 'శ్రీ శ్రీ' సినిమాలు డిసెంబర్ 4న విడుదల కానున్నాయి.
ఇప్పుడు ప్రభాస్ రేస్ నుంచి తప్పుకోవడంతో ఆ రెండు సినిమాలకు బాక్సాఫీస్ వద్ద లైన్ క్లియర్ అయింది. 'ఫౌజీ' కొత్త విడుదల తేదీని మైత్రి మూవీ మేకర్స్ త్వరలోనే ప్రకటించనుంది. మరి వచ్చే ఏడాది సమ్మర్ రేసులో స్పిరిట్ ఉండటంతో ఫౌజీని ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఫౌజీ గురించి
'సీతా రామం' వంటి క్లాసిక్ విజయం తర్వాత హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ బ్రిటీష్ కాలం నాటి రస్టిక్ పీరియడ్ డ్రామాలో ప్రభాస్ ఓ సోల్జర్ గా నటిస్తున్నాడు. ఇమాన్వి ఈస్మాయిల్ ఈ సినిమాతో హీరోయిన్ గా అడుగుపెడుతోంది. సజ్జాద్ డెలాఫ్రూజ్, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


