Peddi: 2025లో వచ్చిన పెద్ద సినిమా కంటే పెద్దికే ఎక్కువ కలెక్షన్లు.. ప్రొడ్యూసర్ రవిశంకర్ సంచలన కామెంట్లు.. ఆ మూవీ ఏదీ?

Peddi: పెద్ది మూవీ సక్సెస్ జోష్ లో ఉన్న ప్రొడ్యూసర్ రవి శంకర్ సంచలన కామెంట్లు చేశాడు. గతేడాది రిలీజైన ఓ పెద్ద సినిమా కంటే పెద్ది ఎక్కువ కలెక్షన్లు రాబట్టిందని చెప్పాడు. మరి అతను ఏ సినిమా గురించి చెప్పాడు? ఎవరికి కౌంటర్ వేశాడు? అనేది హాట్ టాపిక్ గా మారింది.

Published on: Jun 5, 2026, 18:18:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కలెక్షన్ల రికార్డుల దుమ్ము దులుపుతోంది. ఫస్ట్ డేనే రూ.135 కోట్లకు పైగా వసూళ్లను ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్ రవి శంకర్ సంచలన కామెంట్లు చేశాడు. అవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

2025లో వచ్చిన పెద్ద సినిమా కంటే పెద్దికే ఎక్కువ కలెక్షన్లు.. ప్రొడ్యూసర్ రవిశంకర్ సంచలన కామెంట్లు (x/sukumar writings)
2025లో వచ్చిన పెద్ద సినిమా కంటే పెద్దికే ఎక్కువ కలెక్షన్లు.. ప్రొడ్యూసర్ రవిశంకర్ సంచలన కామెంట్లు (x/sukumar writings)

పెద్ది ప్రొడ్యూసర్ రవి శంకర్ సంచలన కామెంట్లు

‘‘బాక్సాఫీస్ ఛాంపియన్ పెద్ది’’ అనే పేరుతో పెద్ది మేకర్స్ శుక్రవారం (జూన్ 5) ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ బుచ్చిబాబు సాన, ప్రొడ్యూసర్లు రవి శంకర్, వెంకట కిలారు, డిస్ట్రిబ్యూటర్ శశి పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రవి శంకర్ చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి.

చరణ్ రికార్డు

‘‘ఇన్నాళ్లు ఎదురు చూసిన పెద్ది రానే వచ్చింది. మనం అనుకుంటున్న సైక్లోన్ క్రియేట్ చేసింది. ప్రీమియర్స్ తో కలిసి హైయ్యస్ట్ రికార్డు క్రియేట్ చేసింది. చరణ్ కెరీర్ లోనే ఇది రికార్డు. ప్రతి సెంటర్లో పాజిటివ్ రిపోర్ట్ తో సాగిపోతుంది. ఫైనల్ గా అదిరే కలెక్షన్లు చూస్తామని నమ్మకముంది’’ అని రవి శంకర్ అన్నాడు.

ఆ పెద్ద సినిమా కంటే

‘‘గుంటూరు నుంచి యూవీ వంశీ పంపించాడు. గతేడాది వచ్చిన ఓ పెద్ద సినిమా రిఫరెన్స్ పంపించి, రెండో రోజు దాని నూన్ షో కలెక్షన్ల కంటే పెద్ది 30 శాతం ఎక్కువ కలెక్ట్ చేసిందని చెప్పాడు. శనివారం, ఆదివారం ఇంకా హెవీగా ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాం’’ అని రవి శంకర్ తెలిపాడు.

పిల్లలూ చూడొచ్చు

‘‘థియేటర్ ఫీల్ మూవీ ఇది. ఆడిటోరియంలో జనాలతో చూడాల్సిన మూవీ. నెక్ట్స్ వీక్ మేమే షాక్ అయ్యే నంబర్లతో మీ ముందుకు వస్తామని భావిస్తున్నాం. బుచ్చి రాసిన కథకు రామ్ చరణ్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. థియేటర్ బయటకు వచ్చిన తర్వాత పెద్ది పెద్ది అనే మాటే వినిపిస్తోంది.

ఇంతవరకు తెలుగు సినిమాలో చూడని మల్టీపుల్ స్పోర్ట్స్ సినిమా ఇది. వెరైటీని కోరుకునే వాళ్లకు నచ్చే సినిమా ఇది. పిల్లలు కూడా చూడొచ్చు’’ అని రవి శంకర్ పేర్కొన్నాడు.

బుచ్చిబాబు కామెంట్లు

‘‘చాలా పెద్ద విజయం ఇచ్చారు. నా ఫోన్ మోగుతూనే ఉంది. ఉప్పెన కంటే 10 రెట్లు ఎక్కువగా ఫోన్లు వస్తున్నాయి. అందరికీ ధన్యవాదాలు. అందరూ పెద్ది పెద్ది అని అంటున్నారు. మీ పిల్లలను తీసుకుని వెళ్లండి. చరణ్ పడ్డ కష్టాన్ని ప్రేక్షకులు గుర్తించారు. చరణ్ లేకపోతే సినిమా లేదు’’ అని డైరెక్టర్ బుచ్చిబాబు సాన చెప్పాడు.

ఏ సినిమా గురించి?

ప్రెస్ మీట్లో రవి శంకర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. అతను ఏ మూవీ గురించి మాట్లాడాడనే డిస్కషన్ జోరందుకుంది. 2025లో డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, హిట్ 3, కుబేర, కన్నప్ప, కింగ్డమ్, మిరాయ్, మాస్ జాతర, అఖండ 2 లాంటి మూవీస్ వచ్చాయి. మరి రవి శంకర్ ఏ సినిమాను ఉద్దేశించి అన్నాడో ఆయనే చెప్పాలి.

People Also Ask (FAQ)

  1. పెద్ది హిట్ ఆ ప్లాపా?

ప్రస్తుతం వస్తున్న పబ్లిక్ టాక్, యూఎస్ఏ ప్రీమియర్స్ రిపోర్ట్స్ ప్రకారం ‘పెద్ది’ ఒక ఎమోషనల్ బ్లాక్‌బస్టర్ హిట్. కమర్షియల్ ఎలివేషన్స్ కంటే సెకండ్ హాఫ్‌లో వచ్చే ఎమోషనల్ అండ్ స్పోర్ట్స్ డ్రామా సినిమాను నిలబెట్టాయి.

2. పెద్ది సినిమా పిల్లలతో చూడొచ్చా

కచ్చితంగా చూడొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా క్లారిఫై చేసినట్లు.. ఈ సినిమాలో మితిమీరిన వయొలెన్స్ లేదు. పిల్లలకు ఇన్‌స్పిరేషన్ ఇచ్చే స్పోర్ట్స్ డ్రామా, ప్యూర్ రూటెడ్ ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా థియేటర్లలో చూడొచ్చు.

3. పెద్ది ఓటీటీ లో ఎప్పుడు వస్తుంది?

పెద్ది మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయిన 4 నుండి 6 వారాల తర్వాతే ఇది ఓటీటీ లోకి వచ్చే అవకాశం ఉంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More