...
...
Next Story

Fauzi Release Date: అజ్ఞాత‌ప‌ర్వం ముగిసింది.. ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్.. తిరుగుబాటు షురూ అయ్యేది అప్పుడే!

Fauzi Release Date: రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది. అజ్ఞాత‌ప‌ర్వం ముగిసిందంటూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ మూవీపై హైప్ పెంచేసింది.

Published on: Jul 16, 2026, 11:40:13 IST
Advertisement

Fauzi Release Date: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఫౌజీ మూవీ యూనిట్ అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అప్‌డేట్ అందించింది. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'ఫౌజీ' (Fauzi) ప్రపంచవ్యాప్త విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఫౌజీ రిలీజ్ డేట్

అజ్ఞాత‌ప‌ర్వం ముగిసింది.. ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్.. తిరుగుబాటు షురూ అయ్యేది అప్పుడే! (x/MythriOfficial)
అజ్ఞాత‌ప‌ర్వం ముగిసింది.. ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్.. తిరుగుబాటు షురూ అయ్యేది అప్పుడే! (x/MythriOfficial)

"అజ్ఞాతపర్వం ముగిసింది.. ఇక తిరుగుబాటు మొదలైంది" అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ భారీ అనౌన్స్‌మెంట్‌ను పంచుకున్నారు. ఈ మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీని 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట సంబరాలు చేసుకుంటున్నారు.

సరికొత్త లుక్‌లో రెబల్ స్టార్

యుద్ధంలో ఒంటి నిండా రక్తంతో, చుట్టూ శవాల మధ్యలో, తుపాకీపై చేయి పెట్టి కూర్చొని ఉన్నాడు ప్రభాస్. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాను తగలపెట్టేస్తోంది.

ఇమాన్వి ఎంట్రీ

ఫౌజీ సినిమాతో సోషల్ మీడియా సెన్సేషన్, టాలెంటెడ్ బ్యూటీ ఇమాన్వి కథానాయకిగా వెండితెరకు పరిచయమవుతోంది. హను రాఘవపూడి మార్క్ క్లాసిక్ ప్రేమకథతో పాటు, మునుపెన్నడూ చూడని హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

భారీ తారాగణం

'ఫౌజీ' చిత్రంలో భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన దిగ్గజ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ చక్రవర్తి మిథున్ చక్రవర్తి, ఒకప్పటి సౌత్ ఇండియా గ్లామర్ క్వీన్, సీనియర్ నటి జయప్రద, వెటరన్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం. ఇంతటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సాంకేతిక విభాగం కూడా అంతే బలంగా ఉంది.

'సీతారామం' చిత్రానికి క్లాసిక్ ఆల్బమ్ అందించిన విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఛటర్జీ విజువల్స్ అందిస్తుండగా, కేకే సాహిత్యం అందిస్తున్నాడు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే శీతల్ శర్మ కాస్ట్యూమ్ డిజైనర్‌గా, ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు ఆర్.సి. కమలకన్నన్ వీఎఫ్ఎక్స్ బాధ్యతలు చూసుకుంటున్నారు.

మైత్రీ, టీ-సిరీస్ కలయికలో విజువల్ వండర్

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్, బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ సంయుక్తంగా ఈ ఫౌజీ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఎక్కడా రాజీ పడకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ విజువల్ వండర్‌ను స్క్రీన్‌పైకి తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

డిసెంబర్ 3న థియేటర్లలో ప్రభాస్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి వస్తున్నాడని మేకర్స్ విడుదల చేసిన ట్యాగ్‌లైన్ స్పష్టం చేస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks