Prabhas: పాన్ ఇండియా సినీ లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అప్ కమింగ్ సినిమాల్లో ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ ఒకటి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సీక్వెల్ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. ఈ మూవీపై ముందు నుంచే భారీ అంచనాలున్నాయి. ఇప్పుడీ సీక్వెల్ టైటిల్ పై ఓ క్రేజీ జబ్ వైరల్ గా మారింది. అలాగే మూవీలో ప్రభాస్ అదరగొడతారని అంటున్నారు.
కల్కి 2898 ఏడీ

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ తదితరులు కూడా కీలక పాత్రలు పోషించారు.
సీక్వెల్ టైటిల్
బ్లాక్ బస్టర్ గా నిలిచిన కల్కి 2898 ఏడీ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ టైటిల్ ఇదేనంటూ ఓ పవర్ ఫుల్ పేరు వైరల్ గా మారింది. అదే ‘కర్ణ 3102 బీసీ’. కల్కి 2కు కర్ణ 3102 బీసీ అనే పేరును మేకర్స్ ప్రకటించే అవకాశముందనే ప్రచారం తెగ జోరుగా సాగుతోంది.
ప్రభాస్ విశ్వ రూపం
కల్కి 2898 ఏడీ సీక్వెల్ లో కర్ణుడి పాత్ర చుట్టూ కథ సాగుతుందని సమాచారం. అందుకే కర్ణ 3102 బీసీ అనే పేరు పెట్టేందుకు మేకర్స్ మొగ్గు చూపుతున్నారని టాక్. కల్కి పార్ట్ 1లో కర్ణుడిగా ప్రభాస్ కేవలం 5 నిమిషాలు మాత్రమే కనిపించాడు. కానీ పార్ట్ 2లో మాత్రం అరగంట సేపు కర్ణుడి క్యారెక్టర్ ఉంటుందని సమాచారం.
కర్ణుడి పాత్రలో ప్రభాస్ విశ్వరూపాన్ని నాగ్ అశ్విన్ బిగ్ స్క్రీన్ పై గ్రాండ్ గా చూపించబోతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్తున్నాాయి. కల్కి పార్ట్ 1 చివర్లో కర్ణుడిగా ప్రభాస్ ను చూపించారు. ఈ పార్ట్ 2లోనేమో అసలు కర్ణుడు ఎందుకు వచ్చాడు? ఎలా పునర్జన్మ ఎత్తాడు? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబోతున్నారని తెలిసింది.
జోరుగా షూటింగ్
{{/usCountry}}కర్ణుడి పాత్రలో ప్రభాస్ విశ్వరూపాన్ని నాగ్ అశ్విన్ బిగ్ స్క్రీన్ పై గ్రాండ్ గా చూపించబోతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్తున్నాాయి. కల్కి పార్ట్ 1 చివర్లో కర్ణుడిగా ప్రభాస్ ను చూపించారు. ఈ పార్ట్ 2లోనేమో అసలు కర్ణుడు ఎందుకు వచ్చాడు? ఎలా పునర్జన్మ ఎత్తాడు? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబోతున్నారని తెలిసింది.
జోరుగా షూటింగ్
{{/usCountry}}కల్కి 2898 ఏడీ సీక్వెల్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లపై ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశారు. త్వరలోనే మరో షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఇందులో హీరో ప్రభాస్ పాల్గొనబోతున్నాడు. మరోవైపు ఫౌజీ, స్పిరిట్ సినిమాలతోనూ ప్రభాస్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.